spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Amaravati Capital Bill 2026: 'అమరావతి' ఊపిరి పీల్చుకో.. తేల్చేయనున్న వైసిపి

Amaravati Capital Bill 2026: ‘అమరావతి’ ఊపిరి పీల్చుకో.. తేల్చేయనున్న వైసిపి

Amaravati Capital Bill 2026: అమరావతి రాజధాని( Amaravathi capital ) చట్ట సవరణ బిల్లు పార్లమెంట్ ముందుకు రానుంది. అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ ఏపీ సవరణ బిల్లు-2026 పార్లమెంట్ ముందుకు రానుంది. ఈరోజు ఈ అంశంపై చర్చించనున్నారు. టిడిపి నుంచి ముగ్గురు..బిజెపి, జనసేన నుంచి ఒక్కొక్కరు ఎంపీలు చర్చలో పాల్గొంటారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటన్నది తెలియడం లేదు. ఏపీ ప్రత్యేక అసెంబ్లీ సమావేశానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గైర్హాజరయింది. తాము అమరావతికి వ్యతిరేకమా? అనుకూలమా? అన్నది తెలియజేయలేదు. అందుకే ఇప్పుడు పార్లమెంట్లో ఈ బిల్లు ప్రవేశపెట్టనుండడంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ జాతీయ స్థాయిలో తెలియజేయాల్సిన అవసరం ఉంది. వారు వ్యతిరేకించినా.. ఈ బిల్లు మాత్రం పాస్ అవుతుంది. ఒకవేళ వ్యతిరేకిస్తే మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై శాశ్వత అమరావతి వ్యతిరేకముద్ర ఖాయం. అందుకే ఆ పార్టీ తటస్థ వైఖరి అనుసరించే అవకాశం ఉంది. అయితే శాసనసభ మాదిరిగా పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతారా? లేదా? అన్నది చూడాలి.

Also Read: ఇక క్వాంటం శకం.. చంద్రబాబు ఆశయం అదే!

* భిన్న వైఖరితో..
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం( central government) ప్రవేశపెట్టిన బిల్లులకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా మద్దతు తెలుపుతూ వస్తోంది. ఏపీలో కూటమిని వ్యతిరేకిస్తూ.. జాతీయస్థాయిలో అదే కూటమి మద్దతుతో నడుస్తున్న ఎన్డీఏని మాత్రం సమర్ధిస్తోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదే సమయంలో జాతీయస్థాయిలో తమకు ఇబ్బందులు వస్తున్న ప్రతిసారి ఇతర రాజకీయ పార్టీల వైపు చూస్తోంది. కానీ బిజెపిని సమర్థించడం ఇతర రాజకీయ పక్షాలకు ఎంత మాత్రం సహేతుకంగా లేదు. ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా ఇండియా కూటమి ఉంది. తాను బద్ధ శత్రువుగా భావిస్తున్న టిడిపి ఎన్ డి ఏ లో ఉంది. ఈ లెక్కన ఇండియా కూటమికి జగన్ దగ్గర కావాలి. కానీ అలా జరగడం లేదు. జాతీయస్థాయిలో తమది తటస్థ వైఖరి అని చెబుతూనే బిజెపికి మద్దతు ఇవ్వడం జగన్మోహన్ రెడ్డికి రివాజు గా మారింది. అయితే ఇప్పుడు అదే కేంద్రం అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ బిల్లు పెడుతోంది. కేవలం వైయస్సార్ కాంగ్రెస్ సృష్టించిన గందరగోళానికి తెరదించాలన్న ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకుంది కేంద్రం. అందుకే వైసీపీ స్టాండ్ కోసం అంతా ఎదురు చూస్తున్నారు.

* వ్యతిరేకించే ఛాన్స్ లేదు..
ఈ రోజు లోక్సభలో అమరావతి బిల్లు పై చర్చిస్తారు. ఆమోదం పొందుతారు. అయితే ఈ బిల్లును వ్యతిరేకించే వారు లేరు. అన్ని రాజకీయ పార్టీలు ఆహ్వానించే అవకాశం ఉంది. అందుకు తగ్గ ఏర్పాట్లు టిడిపి చేసింది. ఇప్పటికే సంపూర్ణ మద్దతు ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. దీంతో ఈ బిల్లుకు ఎదురు లేదు కానీ వైసీపీ స్టాండ్ అనేది ఏదో చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. వారు ఈ బిల్లుకు మద్దతిచ్చి ఆహ్వానం పలికితే ఇకనుంచి అమరావతి అనే దానిపై వ్యతిరేకంగా మాట్లాడడానికి వీలు లేదు. ఇప్పటివరకు తాము చేసింది తప్పు అని ఒప్పుకున్నట్టు అవుతుంది. వ్యతిరేకిస్తే మాత్రం శాశ్వత అమరావతి వ్యతిరేక ముద్ర వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై పడనుంది. ఒక్కమాటలో చెప్పాలంటే జాతీయస్థాయిలో ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ డిఫెన్స్ లో ఉంది. భిన్నమైన వైఖరితో ముందుకు సాగితే జాతీయస్థాయిలో మిగతా పార్టీల ముందు చులకన కావడం ఖాయం. అయితే అమరావతి చట్టబద్ధత బిల్లుపై ఎటువంటి వ్యూహంతో వైసీపీ సభకు హాజరవుతుందో? చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular