Homeఆంధ్రప్రదేశ్‌Quantum Valley Amaravati Project: ఇక క్వాంటం శకం.. చంద్రబాబు ఆశయం అదే!

Quantum Valley Amaravati Project: ఇక క్వాంటం శకం.. చంద్రబాబు ఆశయం అదే!

Quantum Valley Amaravati Project: ఏపీ సీఎం చంద్రబాబు ఏ పని చేసిన దాని వెనుక ఒక పరమార్ధం ఉంటుంది. గతంలో ఐటి అన్నారు. దానిని చేసి చూపించారు. ఇప్పుడు క్వాంటం వ్యాలీ అంటున్నారు. ఇప్పుడు కూడా అదే పనిలో ఉన్నారు. అమరావతిలో క్వాంటం వ్యాలీ ప్రాజెక్టును పట్టాలెక్కించాలని భావించారు. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు సచివాలయంలో అమరావతి క్వాంటం వ్యాలీ, క్వాంటం హార్డ్వేర్ ఉత్పత్తి, ఎకో సిస్టం పై రౌండ్ టేబుల్ […]

Quantum Valley Amaravati Project: ఏపీ సీఎం చంద్రబాబు ఏ పని చేసిన దాని వెనుక ఒక పరమార్ధం ఉంటుంది. గతంలో ఐటి అన్నారు. దానిని చేసి చూపించారు. ఇప్పుడు క్వాంటం వ్యాలీ అంటున్నారు. ఇప్పుడు కూడా అదే పనిలో ఉన్నారు. అమరావతిలో క్వాంటం వ్యాలీ ప్రాజెక్టును పట్టాలెక్కించాలని భావించారు. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు సచివాలయంలో అమరావతి క్వాంటం వ్యాలీ, క్వాంటం హార్డ్వేర్ ఉత్పత్తి, ఎకో సిస్టం పై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబు హాజరయ్యారు. కీలక ప్రసంగం చేశారు. క్వాంటం వ్యాలీ ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు.
* జాతీయ క్వాంటం మిషన్ ద్వారా చేపట్టిన కార్యాచరణను ఏపీ తొలిగా అందిపుచ్చుకొని.. అమరావతి క్వాంటం వ్యాలీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
* గతంలో ఐటీని, ఇప్పుడు క్వాంటం కంప్యూటర్ టెక్నాలజీని ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ గా వినియోగించుకుంటున్నామని గుర్తు చేశారు.
* అమరావతి క్వాంటం వ్యాలీ దేశ భవిష్యత్తు, దేశ ప్రేరేకమని తేల్చి చెప్పారు. గ్రీన్ అండ్ క్లీన్ ఎనర్జీ దిశగా ఏపీ ముందుకు వెళుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు.
* రాష్ట్రంలో సంజీవని ప్రాజెక్టును జూలైలోగా అమలు చేయాలని అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. మెరుగైన ఆరోగ్యం కోసం అందరూ ఉద్యమంలా కృషి చేయాలని కూడా సూచించారు.

* రెండేళ్లలో క్వాంటం వ్యాలీ కంప్యూటర్..
ఇప్పటివరకు ప్రపంచాన్ని ఐటి ఏలింది. అయితే దీనిని 1999 కాలంలో గుర్తించారు చంద్రబాబు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ప్రోత్సాహం ఇచ్చారు. అయితే ఇక ప్రపంచంలో భవిష్యత్తు అంతా క్వాంటం వ్యాలీ అని నమ్ముతున్నారు చంద్రబాబు. అందుకే దేశంలో ఏ రాష్ట్రం కూడా గుర్తించని విధంగా పావులు కదుపుతున్నారు. దేశీయంగా క్వాంటం కంప్యూటర్ను రెండేళ్లలో జాతికి అందించాలన్న కృత నిశ్చయంతో ఉన్నారు సీఎం చంద్రబాబు. అందుకు అనుగుణంగా అడుగులు వేస్తున్నారు. మరి ఈ ప్రయత్నంలో ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper