Homeఆంధ్రప్రదేశ్‌Sowjanya Case: సాదిక్ మనిషి కాదు.. మహా క్రూరుడు.. కన్నీళ్లు తెప్పిస్తున్న సౌజన్య కుమారుడి మాటలు..

Sowjanya Case: సాదిక్ మనిషి కాదు.. మహా క్రూరుడు.. కన్నీళ్లు తెప్పిస్తున్న సౌజన్య కుమారుడి మాటలు..

Sowjanya Case: వాడు మనిషి కాదు. మహా క్రూరమైన వ్యక్తి. చివరికి రాక్షసుల కైనా ఎంతోకొంత మానవత్వం ఉంటుంది. కానీ ఇతడిలో మాత్రం మానవత్వం కొంత కూడా లేదు. పైగా పైశాచికాన్ని అణువణువు ప్రదర్శించాడు. సౌజన్య జీవితాన్ని కుక్కలు చంపిన విస్తరి చేశాడు.. చివరికి ఆమెకు చనిపోయే అవకాశం కూడా ఇవ్వలేదు. ప్రతిదారిని మూసివేశాడు. తన దారిలోకి తెచ్చుకొని ఆమెను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. ఏఈ నూకరాజు, మీనా దంపతులకు సౌజన్య అనే కుమార్తె ఉంది. సౌజన్యకు […]

Sowjanya Case: వాడు మనిషి కాదు. మహా క్రూరమైన వ్యక్తి. చివరికి రాక్షసుల కైనా ఎంతోకొంత మానవత్వం ఉంటుంది. కానీ ఇతడిలో మాత్రం మానవత్వం కొంత కూడా లేదు. పైగా పైశాచికాన్ని అణువణువు ప్రదర్శించాడు. సౌజన్య జీవితాన్ని కుక్కలు చంపిన విస్తరి చేశాడు.. చివరికి ఆమెకు చనిపోయే అవకాశం కూడా ఇవ్వలేదు. ప్రతిదారిని మూసివేశాడు. తన దారిలోకి తెచ్చుకొని ఆమెను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు.

ఏఈ నూకరాజు, మీనా దంపతులకు సౌజన్య అనే కుమార్తె ఉంది. సౌజన్యకు వివాహం జరిగింది. సౌజన్య దంపతులకు రియాన్స్ రెడ్డి అనే అబ్బాయి ఉన్నాడు. ఇతడు మూడో తరగతి చదువుతున్నప్పటి నుంచి రైఫిల్ షూటింగ్ నేర్చుకునేవాడు. ఇతడికి సాదిక్ రైఫిల్ షూటింగ్ నేర్పేవాడు. రియాన్స్ ద్వారా సౌజన్య వ్యక్తిగత విషయాలను తెలుసుకున్న సాదిక్ ఆమె జీవితంలోకి ప్రవేశించాడు. ఆ తర్వాత ఆమెను పూర్తిగా ఆక్రమించడం మొదలుపెట్టాడు. బలహీనమైన క్షణంలో సౌజన్య అతడికి లొంగిపోయింది. ప్రవేట్ ఫోటోలను.. ప్రైవేట్ వీడియోలను రికార్డు చేసిన అతడు ఆమెను బెదిరించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత సౌజన్య భర్తను అంతం చేశాడు. ఆ తర్వాత సౌజన్య పూర్తిగా అతడి కంట్రోల్లోకి వెళ్లిపోయింది. ఆస్తులు.. బంగారం.. మొత్తం సాదిక్ చేతిలోకి తీసుకున్నాడు.

చివరికి సౌజన్యకు చనిపోయే అవకాశం కూడా ఇవ్వకుండా నరకం చూపించాడు. రియాన్ష్ రెడ్డిని ఉగ్రవాదులకు అమ్మేస్తానని బెదిరించేవాడు. అయితే చనిపోయే పది రోజులకు ముందు.. ఆమెను తీవ్రంగా కొట్టాడు సాదిక్. రియాన్స్ రెడ్డి చూస్తుండగానే ఆమె మీద దాడి చేసేవాడు. ఆమె ప్రవేట్ ఫోటోలను.. వీడియోలను బయట పెడతానని బెదిరించేవాడు. ఒక దశలో ఏ ఈ నూకరాజు మీద కూడా దాడి చేశాడు. ఈ వేధింపులు తట్టుకోలేక వారు సామూహికంగా ఆత్మహత్య చేసుకున్నారు.

“మా అమ్మను సాదిక్ వేధించేవాడు. మా నాన్నను కూడా అతడే చంపేశాడు. మా అమ్మను విపరీతంగా కొట్టేవాడు. మా అమ్మ విపరీతంగా ఏడ్చేది. తట్టుకోలేక చనిపోవాలని కూడా అనుకుంది. నాకు కుటుంబాన్ని లేకుండా చేశాడు సాదిక్. అతనికి కఠిన శిక్ష పడాలి. అతడు భూమ్మీద బ్రతకకూడదు.. మా అమ్మమ్మ.. మా తాతయ్యను కూడా సాధిక్ ఇబ్బంది పెట్టాడు. చంపేస్తానని బెదిరించేవాడు. నన్ను ఉగ్రవాదులకు అమ్మేస్తానని హెచ్చరించేవాడు. అతడికి పోలీసుల అండదండలు ఉన్నాయి. మా అమ్మ కూడా విపరీతంగా భయపడేది. అతనికి కఠిన శిక్ష పడాలని” రియాన్స్ పేర్కొన్నాడు. అతడు చెబుతున్న మాటలు కంటనీరు పెట్టిస్తున్నాయి. అసలు ఇటువంటి దుర్మార్గుడికి సౌజన్య ఎలా దగ్గర అయిందనేది అర్థం కావడం లేదు. మరోవైపు తన కుమారుడిని సౌజన్య దగ్గరుండి సాదిక్ తో చంపించిందని.. రియాన్స్ రెడ్డి తాత ఆరోపించడం.. పోలీసులకు ఫిర్యాదు చేయడం ఈ కేసులో సరికొత్త మలుపుగా మారింది. మరి ఈ కేసును పోలీసులు ఏ విధంగా సాల్వ్ చేస్తారనేది చూడాల్సి ఉంది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper