spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Aadhar Card : చిన్న పిల్లలకు ఆధార్ కార్డులు.. మే 5 నుంచి ఊరూరా స్పెషల్...

Aadhar Card : చిన్న పిల్లలకు ఆధార్ కార్డులు.. మే 5 నుంచి ఊరూరా స్పెషల్ క్యాంపులు!

Aadhar Card : ఏపీలో ఆరేళ్ల లోపు చిన్నారులందరికీ ఆధార్ కార్డు నమోదు ప్రక్రియను వేగవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన చర్యలు చేపట్టింది. ఈ మేరకు మే నెలలో రెండు విడతలుగా రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక ఆధార్ నమోదు శిబిరాలను నిర్వహించనున్నారు. మొదటి విడత మే 5వ తేదీ నుంచి ప్రారంభమై 8వ తేదీ వరకు కొనసాగుతుంది. రెండవ విడత మే 12వ తేదీ నుంచి మొదలై 15వ తేదీ వరకు జరుగుతుంది. ఈ ప్రత్యేక శిబిరాలు గ్రామ, వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంటాయి.

చిన్నారులకు ఆధార్ నమోదు చేయించడం చాలా సులభమైన ప్రక్రియ. తల్లిదండ్రులు కేవలం తమ పిల్లల జనన ధ్రువీకరణ పత్రాన్ని (Birth Certificate) తీసుకొని శిబిరానికి హాజరైతే సరిపోతుంది. సచివాలయ సిబ్బంది అక్కడ ఉచితంగా ఆధార్ నమోదు ప్రక్రియను పూర్తి చేస్తారు. ఎటువంటి అదనపు పత్రాలు లేదా రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

Also Read : పవన్ కళ్యాణ్ కి చాక్లెట్ గిఫ్ట్‌గా ఇచ్చిన ప్రధాని మోడీ..వీడియో వైరల్!

రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు జనన ధ్రువీకరణ పత్రాలు పొందిన 1.07 లక్షల మంది పిల్లలకు ఇంకా ఆధార్ నమోదు పూర్తి చేయాల్సి ఉంది. ఈ ప్రత్యేక శిబిరాల ద్వారా వీలైనంత ఎక్కువ మంది పిల్లలకు ఆధార్ అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఒకవేళ మీ ఆరేళ్ల లోపు పిల్లలకు ఇదివరకే ఆధార్ కార్డు ఉన్నట్లయితే ఆ విషయాన్ని సంబంధిత సచివాలయ సిబ్బందికి తెలియజేయాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. దీనివల్ల డేటా కచ్చితంగా తెలుస్తోంది.

ఆధార్ కార్డు అనేది భారతదేశంలో ఒక ముఖ్యమైన గుర్తింపు పత్రం. ఇది పిల్లలకు అనేక ప్రభుత్వ పథకాలు,సేవలను పొందడానికి అవసరం. ముఖ్యంగా పాఠశాలల్లో ప్రవేశాలు, ఆరోగ్య సంరక్షణ, ఇతర ప్రభుత్వ ప్రయోజనాలను పొందడానికి ఆధార్ తప్పనిసరి. భవిష్యత్తులో కూడా అనేక అవసరాలకు ఇది ఉపయోగపడుతుంది.

ప్రత్యేక శిబిరాల పూర్తి షెడ్యూల్:
మొదటి విడత: మే 5, 6, 7, 8 తేదీలు
రెండవ విడత: మే 12, 13, 14, 15 తేదీలు

ఈ తేదీల్లో మీ సమీపంలోని గ్రామ లేదా వార్డు సచివాలయానికి మీ పిల్లల జనన ధ్రువీకరణ పత్రంతో వెళ్లి ఆధార్ నమోదు చేయించుకోవాలి. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper