Rohit Naidu: ఈ ఆదివారం ప్రసారం అవ్వబోయే ‘ఆదివారం విత్ స్టార్ మా పరివారం’ లేటెస్ట్ ఎపిసోడ్ లో రోహిత్, అపూర్వ మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. నువ్వు నాకన్నా ముందే వెళ్లిపోయావ్, జనాలు ఎత్తి కొట్టి నిన్ను బయటకి పంపేశారు అంటూ అపూర్వ పై మండిపడగా..అపూర్వ నన్ను ఎత్తి కొట్టి పంపలేదు, నిన్ను ఛీ కొట్టి బయటకు పంపేశారు అని రోహిత్ పై అరుస్తుంది. సరదాగా సాగిపోవాల్సిన ఈ షో కాస్త గందరగోళం గా మారింది. ఈ షో లో కూడా ఇంత గొడవ అవసరమా?, వీళ్లిద్దరు ఇంకా బిగ్ బాస్ హౌస్ లోనే ఉన్నామని అనుకుంటున్నారు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇకపోతే ఈ ఈవెంట్ అయిపోయిన వెంటనే వీళ్లంతా కలిసి నీతూ మాస్టర్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్నారు. అంత గొడవ పెట్టుకొని వెంటనే మళ్లీ కలిసిపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసే విషయం. అయితే ఒక ఫన్ ఈవెంట్ లో రోహిత్ అంతలా ఫైర్ అవ్వడం పై నెటిజెన్స్ లో కొంతమంది, ఇతనికి విన్నర్ అయ్యే లక్షణాలు లేవు, ఇంత కోపం అవసరం లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. రోహిత్ లో ఉన్న ఈ కోపం కారణంగానే కంటెస్టెంట్స్ అందరూ అతనికి వ్యతిరేకంగా ఓట్లు వేసి బయటకు పంపేశారని, హౌస్ లోని కంటెస్టెంట్స్ అందరినీ తన గుప్పిట్లోకి తీసుకోవడం కూడా గేమ్ లో భాగమే కదా, రోహిత్ ఆ లాజిక్ మిస్ అవ్వడం వల్లే ఈరోజు ఇలా బయట ఉన్నాడంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కానీ అసలు ఏమి జరిగిందో తెలియకుండా మాట్లాడడం కరెక్ట్ కాదని, ఆదివారం రోజు టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ తో అసలు తప్పు ఎవరి వైపు ఉందో తెలుస్తుందని కామెంట్స్ చేస్తున్నారు రోహిత్ ఫ్యాన్స్.