Homeఅంతర్జాతీయంSamsung galaxy s27 ultra: సాంసంగ్ కొత్త ఫ్లాగ్ షిప్ లో అదిరిపోయే ఫీచర్లు..

Samsung galaxy s27 ultra: సాంసంగ్ కొత్త ఫ్లాగ్ షిప్ లో అదిరిపోయే ఫీచర్లు..

Samsung galaxy s27 ultra: సాంసంగ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలి అనుకునే వారి కోసం గెలాక్సీ s27 ఆల్ట్రా ఆసక్తికరమైన ఫోన్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. 200 మెగా ఫిక్సల్ కెమెరా, శక్తివంతమైన ప్రాసెసర్.. పెద్ద బ్యాటరీ.. అధునాతనమైన ఏఐ ఫీచర్లతో సాంసంగ్ కంపెనీ ఈ ఫోన్ తీసుకొస్తుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఫోన్ కు సంబంధించి టెక్ వర్గాల్లో లీకులు వస్తున్నాయి. అయితే వచ్చే ఏడాది ఈ ఫోన్ విడుదల కావచ్చని సమాచారం. […]

Samsung galaxy s27 ultra: సాంసంగ్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలి అనుకునే వారి కోసం గెలాక్సీ s27 ఆల్ట్రా ఆసక్తికరమైన ఫోన్ గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. 200 మెగా ఫిక్సల్ కెమెరా, శక్తివంతమైన ప్రాసెసర్.. పెద్ద బ్యాటరీ.. అధునాతనమైన ఏఐ ఫీచర్లతో సాంసంగ్ కంపెనీ ఈ ఫోన్ తీసుకొస్తుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ ఫోన్ కు సంబంధించి టెక్ వర్గాల్లో లీకులు వస్తున్నాయి. అయితే వచ్చే ఏడాది ఈ ఫోన్ విడుదల కావచ్చని సమాచారం. అయితే అధికారికంగా సాంసంగ్ కంపెనీ ఈ ఫోన్ ను ప్రకటించలేదు. అయితే ప్రస్తుతం ప్రచారంలో ఉన్న ఫీచర్లు లీకులు మాత్రమే. కంపెనీ అధికారికంగా వెల్లడిస్తేనే వీటి గురించి పూర్తిస్థాయిలో తెలుస్తుంది.

ఫీచర్లను ఒకసారి పరిశీలిస్తే

  • డిస్ ప్లే 6.9 అంగుళాలు ఉంటుంది. ఇందులో QHD+ Dynamic AMOLED 2X,120 Hz ఫీచర్లను అందబాటులోకి తీసుకొచ్చింది.
  • ప్రాసెసర్ స్నాప్ డ్రాగన్, 8 ఎలైట్ ఎక్స్ ట్రీమ్ జెన్ 6(అంచనా) ను ఈ ఫోన్లో సాంసంగ్ కంపెనీ ఏర్పాటుచేసిందని తెలుస్తోంది.
  • ప్రధాన కెమెరా 200 మెగా ఫిక్సల్. ఆల్ట్రా వైడ్ కెమెరా 50 మెగాఫిక్సల్.
  • టెలీఫొటో కెమెరా 50 మెగా ఫిక్సల్ ,5 ఎక్స్ఆప్టికల్ జూమ్ ఉంటుంది.
  • సెల్ఫీ కెమెరా 16మెగా ఫిక్సల్ ఉంటుంది.

బ్యాటరీలో 5,700 ఎంఏహెచ్ సామర్థ్యం

బ్యాటరీలో 5,700 ఎంఏహెచ్ సామర్థ్యం ఉంటుంది. చార్జింగ్ 60 డబ్ల్యూ వైర్డ్, 25 డబ్ల్యూ మాగ్నిటిక్ వైర్ లెస్ చార్జింగ్ ఉంటుంది. రామ్, స్టోరేజ్ 12 జీబీ రామ్, 256 జీబీ నుంచి 1 టీబీ వరకు స్టోరేజీ ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ 17 ఆధారిత వన్ యూఐ తదుపరి వెర్షన్. ఇతర ఫీచర్లు ఎస్ పెన్, గెలాక్సీ ఏఐ, ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ఈ ఫోన్ 2027 జనవరి లేదా ఫిబ్రవరిలో విడుదలయ్యే అవకాశం ఉంది. కొన్ని నివేదికల ప్రకారం ఈ ఫోన్ భారత మార్కెట్లో 1.5 లక్షల నుంచి 1.7 లక్షలు వరకు ఉండొచ్చని తెలుస్తోంది. ఇక ఈ ఫోన్లో 200 మెగా ఫిక్సల్ మెయిన్ కెమెరాను కొనసాగిస్తూ.. ఫోటోలకు క్వాలిటీని మెరుగుపరిచేందుకు కొత్త సెన్సార్ వ్యవస్థను సాంసంగ్ కంపెనీ తీసుకొచ్చిందని సమాచారం. ముఖ్యంగా తక్కువ వెలుతురులో ఫోటోలు.. రాత్రి ఫోటోగ్రఫీ.. దూరంలోని వస్తువులను జూమ్ చేసి తీసే చిత్రాల్లో మెరుగుదల ఉండవచ్చని సమాచారం. అయితే కెమెరా, సెన్సార్, జూమ్ సామర్థ్యాలు తుది ఉత్పత్తిలో ఎలా ఉంటాయో ఇంకా క్లారిటీ రాలేదు.

మొత్తంగా సాంసంగ్ గెలాక్సీ ఎస్ 27 అల్ట్రా కెమెరా, బ్యాటరీ, ప్రాసెసర్, ఏఐ ఫీచర్లపై ప్రధానంగా దృష్టి పెట్టిన ప్రీమియం స్మార్ట్ ఫోన్ గా రావచ్చని అంచనాలున్నాయి.. అయితే ప్రస్తుతం ఫోన్ కొనుగోలు చేయాలనుకునేవారు లీకుల ఆధారంగా నిర్ణయం తీసుకోకుండా.. అధికారిక ఫీచర్లు.. ధర.. విడుదల తేదీ వెళ్లడయ్యే వరకు వేచి చూడడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper