Revanth Reddy: అందరూ అనుకున్నట్టుగానే సిరిసిల్ల ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలను మాత్రమే కాకుండా.. కేటీఆర్ ను లక్ష్యంగా చేసుకొని ముఖ్యమంత్రి విమర్శలు చేశారు. ఈసారి తన సహజ శైలికి భిన్నంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు. పైగా ఆయన మాట్లాడుతున్న ప్రతి మాటలో కూడా సిరిసిల్ల ప్రజలను భాగస్వాములను చేశారు. ఆయన మాట్లాడుతుంటే సిరిసిల్ల ప్రజలు చప్పట్లు కొట్టారు.
ఈ వేదిక ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఆస్తుల వివరాలను బయటపెట్టారు. ఇన్ని రోజులపాటు ఆ ఆస్తులు ఆంధ్ర వ్యక్తుల చేతులలో ఉండేవని.. గడిచిన ఆరు నెలల కాలంలో ఆ ఆస్తులు కేటీఆర్ పేరు మీద బదిలీ అయ్యాయని.. ఇన్ని వందల కోట్లు కేటీఆర్ కు ఎక్కడి నుంచి వచ్చాయని రేవంత్ ప్రశ్నించారు.. ముఖ్యంగా కేటీఆర్ పేరు మీద ఉన్న హోటల్స్.. అపార్ట్మెంట్లు.. వ్యవసాయ క్షేత్రాలను రేవంత్ రెడ్డి ఒక్కొక్కటిగా చిట్టా విప్పుతూ బయటపెట్టారు. అసెంబ్లీలో పార్ట్ 2 ఉంటుందని హింట్ ఇచ్చారు.
రేవంత్ రెడ్డి బయటపెట్టిన ఆస్తుల జాబితా
సిరిసిల్ల వేదికగా జరిగిన సభలో రేవంత్ రెడ్డి కీలక విషయాలను బయటపెట్టారు. కేటీఆర్ ఆధీనంలో ఉన్న ఆస్తుల వివరాలను మొత్తం వెల్లడించారు.. హైదరాబాదులోని హైటెక్ సిటీకి సమీపంలో దక్కన్ సారాయి ఫైవ్ స్టార్ హోటల్ ఉందని.. ఎట్ హోం సర్వీస్ పేరుతో అపార్ట్మెంట్లు ఉన్నాయని.. హైటెక్ సిటీ సమీపంలో మూడు హోటల్ ప్రాపర్టీలలో సుమారు 400 గదులు.. ఇందులో ఒక్క ఫైవ్ స్టార్ హోటల్ లోనే దాదాపు 190 గదులు ఉన్నాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు. హైటెక్ సిటీ చుట్టూ అవతలి ఎకరాల భూములు ఉన్నాయని రేవంత్ రెడ్డి విమర్శించారు. బంజారాహిల్స్.. జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఆస్తులు.. అమెరికా.. సింగపూర్ దేశాలలో పెట్టుబడులు ఉన్నట్టు రేవంత్ రెడ్డి ఆరోపించారు. జన్వాడ ప్రాంతంలో కేటీఆర్ కు వ్యవసాయ క్షేత్రం ఉందని.. శంకర్పల్లి ప్రాంతంలో కవితకు వ్యవసాయ క్షేత్రం ఉందని.. మొయినాబాద్ ప్రాంతంలో హరీష్ రావుకు వ్యవసాయ క్షేత్రం ఉందని.. ఎర్రవల్లిలో కెసిఆర్ కు వ్యవసాయ క్షేత్రం ఉందని.. గతంలో ఈ ఆస్తులు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తుల పేర్ల మీద ఉండేవని.. సుమారు 6 నెలల క్రితమే ఈ ఆస్తులు కేటీఆర్.. ఆయన కుటుంబ సభ్యుల పేరు మీద బదిలీ అయ్యాయని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
రేవంత్ చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా సంచలనం నమోదు అయింది. ముఖ్యంగా ఇటీవల కాలంలో కెసిఆర్ వ్యవసాయ క్షేత్రానికి సంబంధించిన భూముల సర్వే మొదలైంది. దానిని మర్చిపోకముందే కేటీఆర్ ఆస్తులను రేవంత్ రెడ్డి స్వయంగా సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రంలో జరిగిన సభలో బయటపెట్టారు. అంతేకాదు.. త్వరలో అసెంబ్లీలో పార్ట్ టూ కూడా ఉంటుందని ప్రకటించారు. మొత్తానికి సిరిసిల్ల వేదికగా జరిగిన సభలో రేవంత్ రెడ్డి కేటీఆర్ ను లక్ష్యంగా చేసుకొని మాట్లాడారు. మరి దీనిపై కేటీఆర్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.
#RevanthReddy’s big #allegations on KTR’s assets#Telangana Chief Minister @revanth_anumula has alleged that @BRSparty working president @KTRBRS and his #family are linked to major properties around #Hyderabad’s #HITECCity, including:
• Deccan Serai five-star hotels
• At… pic.twitter.com/SeD3H10ItG— NewsMeter (@NewsMeter_In) September 30, 2026
Pinkies often troll Shashi Bro whenever he tries to get a photo with the Chief Minister.
But today, the Chief Minister himself called a normal karyakartha from a huge crowd.
What else recognition can a karyakartha get?
This could be one of the reasons why Revanth Reddy’s… https://t.co/D4O1BAV7C0 pic.twitter.com/0549zANtuV
— Yash Tweets (@Yashinonx) September 30, 2026
#WATCH | Sircilla, Telangana: Chief Minister Revanth Reddy participates in padayatra in Sircilla town with thousands of Congress activists from Ambedkar Chowk, Sircilla.
TPCC President Mahesh Kumar Goud, Ministers Duddilla Sridhar Babu, Ponnam Prabhakar, Adluri Laxman,… pic.twitter.com/XcYoouh75i
— ANI (@ANI) September 30, 2026