Pawan Kalyan: రాజకీయాలకు అతీతంగా ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకునే కొన్ని నిర్ణయాలకు ప్రత్యర్థులు సైతం చప్పట్లు కొట్టేలా చేస్తోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో, పంచాయతీ రాజ్ విభాగం లో ఆయన చేస్తున్న అద్భుతాలను చూస్తుంటే , ఇలాంటి నాయకులు దేశమంతటా ఉంటే ఎంత బాగుంటుందో అని అనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జల్ జీవం మిషన్ – అమరజీవి జలధార అనే పధకం క్రింద రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన తాగునీటి ప్రాజెక్టులు జెట్ స్పీడ్ లో దూసుకువెళ్తున్నాయి. ఎలాంటి అవినీతి కి తావు ఇవ్వకుండా, అత్యంత పారదర్శకంగా , రాజకీయాలకు అతీతంగా ఆయన ఈ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తున్నాడు. గత వైసీపీ ప్రభుత్వం లో ప్రారంబంచిన కొన్ని ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయి. వాటిలో మాజీ సీఎం , వైసీపీ అధినేత జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల లోని మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ కూడా ఒకటి.
ఈ ప్రాజెక్ట్ గత ప్రభుత్వం లో నిర్లక్ష్యానికి గురవ్వగా, పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధలు తీసుకొని , దాదాపుగా 426 కోట్ల విలువైన 96 శాతం వాటర్ గ్రిడ్ పనులను పూర్తి చేశారు. ఏడు మండలాల పరిధిలో ఐదున్నర లక్షల మంది జనాల దాహార్తి ని తీర్చే లక్ష్యంతో 480 కోట్ల అంచనా వ్యయంతో జల జీవం మిషన్ పధకం క్రింద ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ గత ప్రభుత్వ గేయాల్లో నిర్లక్ష్యానికి గురైంది అట. కేంద్ర ప్రభుత్వం నుండి నిధులు వచ్చినప్పటికీ కూడా ఈ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకెళ్లే విషయం లో శ్రద్ద చూపలేదట. అంతే కాకుండా గత హయాం లో చేపట్టిన పనుల్లో కూడా నాణ్యత లేదట. కూటమి ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన వెంటనే జల్ జీవన్ మిషన్ క్రింద ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేయడానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నడుం బిగించాడు. 96 శాతం పనులు పూర్తిహి అయ్యాయి , ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ ద్వారా పులివెందుల, సింహాద్రిపురం మండలాలకు మంచి నీళ్లు అందుతున్నాయి. అదే విధంగా పులివెందుల పట్టణానికి సంబంధించిన పనులు కూడా 100 శాతం పూర్తి అయ్యాయి అట.
లింగాల మండల పరిధిలోని 27 ఆవాసాలకు గాను 24 ఆవాసాలకు త్వరలోనే తాగునీరు అందనుంది. వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ లో అత్యంత కీలకమైన ఇంటేక్ వెల్ పునరుద్ధరణ పనులు పూర్తి కాగా, 65 మిలియన్ లీటర్ల నీటి శుద్ధి ప్లాంట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. 1,111 కిలోమీటర్ల పైప్‌లైన్‌కు గాను 1,106 కిలోమీటర్ల నిర్మాణం పూర్తయ్యింది. ఓవర్‌హెడ్ ట్యాంకులు, గ్రౌండ్ లెవల్ రిజర్వాయర్ల నిర్మాణం కూడా దాదాపు తుది దశకు చేరింది. రాజకీయాలకు అతీతంగా , తాము ఆ నియోజకవర్గం లో ఎంత ప్రయత్నం చేసిన గెలవము అని తెలిసినప్పటికీ కూడా, పవన్ కళ్యాణ్ కేవలం జనాల దాహార్తిని అర్థం చేసుకొని ఈ ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తుండడం నిజంగా హర్షణీయం అంటూ రాజకీయ విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.