Homeఆంధ్రప్రదేశ్‌AP Municipal Elections: మున్సిపల్ పోరు.. పదవుల పంపకాలే కూటమికి సవాల్!

AP Municipal Elections: మున్సిపల్ పోరు.. పదవుల పంపకాలే కూటమికి సవాల్!

AP Municipal Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధపడుతోంది ప్రభుత్వం. ముందుగా మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని చూస్తోంది. అయితే ఈసారి ప్రత్యక్ష ఎన్నికల ద్వారా మున్సిపల్ చైర్మన్ తో పాటు కార్పొరేషన్ మేయర్ ఎన్నికకు రంగం సిద్ధమయింది. శాసనసభలో బిల్లు పెట్టి ఆమోదం కూడా పొందింది. ఈ లెక్కన 100కు పైగా ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ లకు డైరెక్ట్ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ మున్సిపల్ ఎన్నికలు కూటమి పార్టీలకు ఒక సవాల్ లాంటివి. 2029 సార్వత్రిక […]

AP Municipal Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధపడుతోంది ప్రభుత్వం. ముందుగా మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలని చూస్తోంది. అయితే ఈసారి ప్రత్యక్ష ఎన్నికల ద్వారా మున్సిపల్ చైర్మన్ తో పాటు కార్పొరేషన్ మేయర్ ఎన్నికకు రంగం సిద్ధమయింది. శాసనసభలో బిల్లు పెట్టి ఆమోదం కూడా పొందింది. ఈ లెక్కన 100కు పైగా ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్ లకు డైరెక్ట్ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఈ మున్సిపల్ ఎన్నికలు కూటమి పార్టీలకు ఒక సవాల్ లాంటివి. 2029 సార్వత్రిక ఎన్నికలకు ఒక రిహార్సల్స్ వంటివి. ఈ ఎన్నికల్లో కానీ మూడు పార్టీలు సమన్వయంతో సక్సెస్ అయితే కూటమికి తిరుగు ఉండదు. అయితే మొన్నటి ఎన్నికల ఫార్ములాను అనుసరిస్తారా? లేకుంటే జనసేనతో పాటు బిజెపి ప్రాతినిధ్యాన్ని పెంచుతారా? అన్నది చూడాలి.

* ఫార్ములా సిద్ధం చేస్తేనే మంచిది..
కూటమి పార్టీలు ఒక ఫార్ములాను ముందుగానే సిద్ధం చేసుకుంటే మంచిది. ఎందుకంటే ప్రత్యక్ష ఎన్నికలు కాబట్టి ఫలానా మున్సిపల్ చైర్మన్ పలానా పార్టీకి.. ఫలానా కార్పొరేషన్ మేయర్ పదవి ఫలానా పార్టీకి అనేది ముందుగానే ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. మూడు పార్టీల మధ్య పదవుల సర్దుబాటు అనేది కీలకం. మున్సిపల్ చైర్మన్ ఒక పార్టీకి ఇస్తే.. వైస్ చైర్మన్ పదవి మరో పార్టీకి కేటాయించాల్సి ఉంటుంది. మేయర్ పదవి ఒక్క పార్టీకి ఇస్తే డిప్యూటీ మేయర్ పదవి మరో పార్టీకి ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడే మూడు పార్టీల మధ్య సమన్వయం సాధ్యం. అయితే బలం లేని చోట.. క్యాడర్ లేని చోట పట్టుబడితే మాత్రం అది ప్రత్యర్థికి వరంగా మారుతుంది.

* రెండో పదవులు కీలకం..
ప్రస్తుతం శాసనసభలో 135 మంది ఎమ్మెల్యేలు టిడిపికి ఉన్నారు. జనసేనకు 21 మంది, బిజెపికి ఎనిమిది మంది ఉన్నారు. ఎమ్మెల్యేలు ఉన్నచోట అదే పార్టీకి మున్సిపల్ చైర్మన్, మేయర్ పదవి వదులుకోవడం ఒక ఫార్మేట్. అదే చోట వైస్ చైర్మన్, డిప్యూటీ మేయర్ పదవి టిడిపి కానీ.. బిజెపి కానీ తీసుకోవాల్సి ఉంటుంది. అదే టిడిపి ప్రాతినిధ్యం ఉన్నచోట అదే పార్టీకి ప్రధాన పదవి ఇచ్చి ఆ తరువాత పోస్టులు జనసేనతో పాటు బిజెపి తీసుకోవాల్సి ఉంటుంది. అలా కాదనుకుంటే వచ్చిన ఓటింగ్ బట్టి మున్సిపాలిటీలను విభజించి ఆయా పార్టీలకు అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ ఫార్ములా కంటే మొదటి ఫార్ములాను అనుసరించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి కూటమి పార్టీలు తమకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాతినిధ్యం కోరుకునేలా ప్రకటనలు చేయడం సర్వసాధారణం. ప్రత్యక్ష ఎన్నికల నిర్ణయానికి వచ్చినప్పుడే.. పొత్తుల సీట్ల పంపకాల మాటలు కూడా కొంతవరకు కొలిక్కి తెచ్చి ఉంటారు. చూడాలి మరి ఎలా పంపకాలు జరుగుతాయో..

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Oktelugu Epaper