Ustaad Bhagat Singh Vs Dhurandhar 2: గత ఏడాది విడుదలైన ‘ధురంధర్'(Dhurandhar Movie) చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన వసూళ్ల సునామీ ని అంత తేలికగా ఎవ్వరైనా మర్చిపోగలరా?, అలాంటి సినిమాకు సీక్వెల్ తీస్తే సౌత్ నుండి నార్త్ వరకు ఓపెనింగ్స్ ఏ రేంజ్ లో ఉంటాయని ఊహించామో, అంతకు మించే వచ్చేలా ఉంది. కేవలం ఇండియా నుండే ఈ చిత్రానికి 100 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చేలా ఉన్నాయి. ఇక ఓవర్సీస్ లో అయితే ఈ చిత్రానికి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా నమోదు అవుతున్న గ్రాస్ చూస్తుంటే మైండ్ బ్లాక్ అవుతోంది. ఎందుకు ‘ధురంధర్ 2′(Dhurandhar 2 Movie) తో పోటీ పడేందుకు పెద్ద పెద్ద పాన్ ఇండియన్ సినిమాలు కూడా భయపడి వెనక్కి వెళ్తున్నాయి అనేది ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ చూసిన తర్వాతే తెలుస్తోంది. ఈ సినిమాకు పోటీగా వచ్చి చాలా పెద్ద తప్పు చేసాము అంటూ ఇప్పుడు పవన్ అభిమానులు బాధపడుతున్నారు.
Also Read: ఈ వయసులో ఆ హుక్స్ స్టెప్పులు ఏంటి సామి.. మల్లారెడ్డి నువ్వు అరాచకం అంతే.. వైరల్ వీడియో
‘ధురంధర్ 2’ తో పోటీ పడేందుకు పాన్ ఇండియన్ సినిమాలే వణుకుతుంటే, పాత కమర్షియల్ ఫార్మటు లో తీసిన ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ చిత్రం ఎక్కడ నిలుస్తుంది అని విశ్లేషకులు గతంలో కామెంట్స్ చేశారు. కానీ అది పవర్ స్టార్ సినిమా, ఎవరు ఎదురొచ్చినా అడ్డు ఉండదు, ఆయన స్టామినా వేరు అని అభిమానులు చాలా బలమైన నమ్మకం తో చెప్పారు. వాళ్ళు చెప్పిన దాంట్లో నిజముంది, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఓవర్సీస్ ఆడియన్స్ మైండ్ సెట్ గడిచిన మూడేళ్లలో పూర్తిగా మారిపోయింది. వీళ్లకు న్యూ ఏజ్ కంటెంట్ ఇస్తే నెత్తిన పెట్టుకొని మరీ ఆదరిస్తున్నారు. అలా కాకుండా రొటీన్ కమర్షియల్ సినిమా తీస్తే ఎంత పెద్ద సూపర్ స్టార్ ని అయినా తోక్కేస్తున్నారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ విషయం లో అదే జరిగింది.
ఇలాంటి మామూలు కమర్షియల్ సినిమాలను సోలో గా విడుదల చేస్తే చూడడమే చాలా కష్టం. అలాంటిది ‘ధురంధర్ 2 ‘ లాంటి సినిమాతో పోటీకి వస్తే ఓవర్సీస్ ఆడియన్స్ ఎలా చూస్తారు చెప్పండి ?, నార్త్ అమెరికా నుండి ఆస్ట్రేలియా వరకు ‘ధురంధర్ 2’ ప్రభావం ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ చిత్రం పై మామూలు రేంజ్ లో పడలేదు. నార్త్ అమెరికా లో ‘ధురంధర్ 2’ చిత్రానికి దాదాపుగా 82 వేల టికెట్స్ అమ్ముడుపోయాయి. మూవీ లవర్స్ మొత్తం అటు వైపే మొగ్గు చూపించారు, తెలుగు ఆడియన్స్ తో సహా. ఆ కారణం చేత ‘ఉస్తాద్ భగత్ సింగ్ ‘ చిత్రానికి కేవలం 8 వేల టిక్కెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. పవన్ కళ్యాణ్ మూవీ కి క్రేజ్ ఉన్నా , లేకపోయినా, చివరి మూడు రోజుల్లో ఓవర్సీస్ లో భారీ అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతుంటాయి. కానీ ఉస్తాద్ కి అది కూడా జరిగే అవకాశం కనిపించడం లేదని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు .
