Bigg Boss 10 Telugu: నెంబర్ 1 ఓటింగ్ తో కొనసాగే కంటెస్టెంట్ ని హౌస్ మేట్స్ ఓట్లతో ఎలిమినేట్ చేయడం గత తెలుగు బిగ్ బాస్ హిస్టరీ లో ఎప్పుడూ జరగలేదు , ఆ సాహసం కూడా చెయ్యలేదు. ఈ సీజన్ లోనే ఆ సాహసం చేశారు. రోహిత్ ని కనికరం చూపకుండా హౌస్ మేట్స్ ఓట్లతో ఎలిమినేట్ చేసి బయటకు పంపేశారు. సీక్రెట్ రూమ్ లో పెడతారేమో అని అంతా అనుకున్నారు కానీ , అది జరగలేదు. ఆయన ఎలిమినేట్ అయ్యి రెండు వారాలు కావొస్తుంది, కానీ ఇప్పటికీ సోషల్ మీడియా లో ఆయన అభిమానులు పోరాడుతూనే ఉన్నారు. రోహిత్ ని వెనక్కి తీసుకొని రావాలంటూ డిమాండ్ చేస్తున్నారు. అయితే రేపు బిగ్ బాస్ హౌస్ లోకి రోహిత్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. నామినేషన్స్ ప్రక్రియ లో పాల్గొనబోతున్నాడు. ఆ తర్వాత హౌస్ లో ఉంటాడో లేదో తెలియదు కానీ , నామినేషన్స్ ప్రక్రియ లో ఆయన తనకు నమ్మకద్రోహం చేసిన అమన్ ని నామినేట్ చేసి రివెంజ్ తీర్చుకుంటాడా లేదా అనేది చూడాలి.
అయితే రోహిత్ అభిమానులు మాత్రం కేవలం నామినేషన్స్ ప్రక్రియ కోసం నువ్వు వెళ్లాల్సిన అవసరం లేదని , కేవలం రీ ఎంట్రీ అవకాశం ఉంటేనే వెళ్లాలని, నామినేషన్స్ ప్రక్రియ కోసం వెళ్తే కచ్చితంగా నిన్ను అక్కడ అమన్ , త్రిగున్ వంటి వారు దారుణంగా అవమానిస్తారని , వాటిని చూసి తట్టుకునే శక్తి మాకు లేదంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కానీ అగ్రిమెంట్ ప్రకారం బిగ్ బాస్ షో ముగిసేవరకు టీం ఏది చెప్తే అది కచ్చితంగా కంటెస్టెంట్స్ చేయాల్సి ఉంటుంది. కానీ రోహిత్ అందుబాటులో లేకపోతే నేను రాలేనని చెప్పేయొచ్చు. గత సీజన్ లో మాస్క్ మ్యాన్ హరీష్ ని కూడా నామినేషన్ ప్రక్రియ కోసం పిలిచారు, కానీ అతను రాలేదు. రోహిత్ కూడా అలా రిజెక్ట్ చేస్తే బాగుండును అని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. మరి ఏమి జరగబోతుందో రాబోయే రోజుల్లో చూడాలి.