Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తో సినిమాని ప్రకటించిన నిర్మాత దిల్ రాజు..డైరెక్టర్ ఎవరంటే!

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తో సినిమాని ప్రకటించిన నిర్మాత దిల్ రాజు..డైరెక్టర్ ఎవరంటే!

Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి గా ఫుల్ బిజీ గా గడుపుతున్న పవన్ కళ్యాణ్ , వచ్చే ఏడాది సమ్మర్ నుండి వరుస సినిమాలతో బిజీ కాబోతున్నాడు. ముందుగా ఇచ్చిన మాట ప్రకారం ఓజీ 2 షూటింగ్ ని మొదలు పెట్టనున్న పవన్ కళ్యాణ్ , ఆ తర్వాత దిల్ రాజు ప్రొడక్షన్స్ లో ఒక సినిమా చేయనున్నాడు. మొన్న పవన్ కళ్యాణ్ ని వెళ్లి కలిసిన దిల్ రాజు , నిన్నటి ప్రెస్ […]

Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి గా ఫుల్ బిజీ గా గడుపుతున్న పవన్ కళ్యాణ్ , వచ్చే ఏడాది సమ్మర్ నుండి వరుస సినిమాలతో బిజీ కాబోతున్నాడు. ముందుగా ఇచ్చిన మాట ప్రకారం ఓజీ 2 షూటింగ్ ని మొదలు పెట్టనున్న పవన్ కళ్యాణ్ , ఆ తర్వాత దిల్ రాజు ప్రొడక్షన్స్ లో ఒక సినిమా చేయనున్నాడు. మొన్న పవన్ కళ్యాణ్ ని వెళ్లి కలిసిన దిల్ రాజు , నిన్నటి ప్రెస్ మీట్ లో పలు కీలకమైన వ్యాఖ్యలు చేసాడు. త్వరలోనే మా కాంబినేషన్ లో సినిమా రాబోతుందని, ఈసారి సాలిడ్ సబ్జెక్టు తో , మంచి డైరెక్టర్ ని పవన్ కళ్యాణ్ గారి వద్దకు తీసుకెళ్తానని దిల్ రాజు చెప్పుకొచ్చాడు. అనిల్ రావిపూడి ఇప్పటికే పవన్ కళ్యాణ్ కోసం ఒక పవర్ ఫుల్ సబ్జెక్టు ని రెడీ చేసాడట. దిల్ రాజు పరోక్షంగా నిన్నటి ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ , అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమా రాబోతున్నట్టుగా పరోక్షంగా హింట్ ఇచ్చాడు. 2028 సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అట.

వచ్చే ఏడాది సమ్మర్ నుండి పవన్ కళ్యాణ్ ‘ఓజీ 2’ మూవీ షూటింగ్ ని ప్రారంభించనున్నాడు. ప్రస్తుతం ఆ చిత్ర దర్శకుడు సుజిత్ హీరో నాని తో ‘బ్లడీ రోమియో’ అనే చిత్రం చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రం, ఈ ఏడాది డిసెంబర్ చివరిలోపు పూర్తి అయ్యే అవకాశం ఉందట. ఈ సినిమా పూర్తి అవ్వగానే , ఓజీ 2 చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని మొదలు పెడతారట. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ 50 రోజుల కాల్ షీట్స్ ని కేటాయించాడట. అదే విధంగా దిల్ రాజు చిత్రానికి నెలకు 15 రోజుల డేట్స్ ఇస్తానని మాట ఇచ్చాడట పవర్ స్టార్. చూడాలి మరి రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ ఎలా ఉండబోతుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper