YS Jagan: 2019లో జగన్ ఆధ్వర్యంలో వైసీపీ ఏపీలో అధికారంలోకి వచ్చింది. అద్భుతమైన మెజారిటీతో అధికారాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత వచ్చిన అధికారాన్ని జగన్ ప్రతీకారానికి.. పగలు సాధించడానికి ఉపయోగించారని చాలామంది చెప్పుకుంటారు. దానికి తగ్గట్టుగానే తాడు బొంగరం లేని కేసులో చంద్రబాబు నాయుడుని జగన్ జైల్లో పెట్టించారు. రాజమండ్రి జైల్లో అత్యంత దుర్భరమైన స్థితిలో ఉంచారు. ఇది ఒక రకంగా జగన్ మనస్తత్వానికి నిదర్శనంగా నిలిచింది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్వహించిన ప్రజా వేదికను జగన్ అధికారంలోకి రాగానే కూల్చివేశారు. అక్రమం పేరుతో నేలమట్టం చేశారు. అలా కూలగొట్టుడుతో మొదలైన ఆయన అధికారం 2024 వరకు దర్జాగా సాగిపోయింది.
చంద్రబాబును జైల్లో వేయడం.. వైసిపి నాయకులు దుర్మార్గంగా దాడులు చేయడం.. ప్రభుత్వానికి ఒక దిశ అంటూ లేకపోవడం.. పంతుడు పథకాలకు మాత్రమే పరిమితం కావడంతో జనాలకు చిరాకు లేచింది. చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని వదులుకొని తమ నరకం చూస్తున్నామని ప్రజలకు అర్థమైంది. దీంతో 2024 ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజారిటీతో కూటమిని ఏపీ ప్రజలు గెలిపించారు. ఆ తర్వాత చంద్రబాబు తన పని మొదలు పెట్టారు. రాష్ట్రాన్ని గాడిలో పెట్టేశారు. కేంద్రంలో కీలకంగా ఉండడంతో రాష్ట్రానికి అవసరమైన ప్రాజెక్టులు మొత్తం తీసుకొస్తున్నారు. అమరావతి నిర్మాణానికి భారీగా కేటాయింపులు జరుపుకున్నారు. అమరావతి నగరాన్ని కనివిని ఎరగని స్థాయిలో నిర్మిస్తున్నారు. అంతేకాదు రోడ్ల నుంచి మొదలు పెడితే డ్రైనేజీ వరకు ప్రతి విషయంలోనూ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నారు. తద్వారా అమరావతి భవిష్యత్తు పెట్టుబడులకు స్వర్గధామం లాగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అమరావతిని మాత్రమే కాకుండా.. ఏపీ రాష్ట్రంలో ఎంతో క్యాపబిలిటీ ఉన్న విశాఖపట్నం నగరాన్ని మరింత డెవలప్ చేయడానికి చంద్రబాబు కంకణం కట్టుకున్నారు.
విశాఖపట్నం వేదికగా కూటమి ప్రభుత్వం ప్రస్తుతం పెట్టుబడిదారుల సదస్సు నిర్వహిస్తోంది. ఈ సదస్సులో పెద్దపెద్ద కంపెనీల ప్రతినిధులు పాల్గొంటున్నారు. ప్రభుత్వంతో భారీగా ఎంఓయూలు కుదుర్చుకుంటున్నారు. వాస్తవానికి గతంలో జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విశాఖపట్నంలో నిర్వహించిన పెట్టుబడిదారుల సదస్సు అబాసు ప్రక్రియగా మారిపోయింది. అక్కడికి పెట్టుబడిదారులు ఎవరూ రాకపోగా.. కిరాయి ఆర్టిస్టులను తీసుకొచ్చి వారిని పెట్టుబడిదారులుగా వైసీపీ చిత్రీకరించింది. కానీ మీడియా లోతుగా తవ్వితీయడంతో ఇదంతా ప్రశాంత్ కిషోర్ పని అని అర్థమయిపోయింది.
ఇప్పుడు విశాఖపట్నం సదస్సులో భారీగా పెట్టుబడులు వస్తున్న నేపథ్యంలో ఇక ఎప్పుడూ కూడా జగన్ ఏపీలో అధికారంలోకి రాడని.. రానిచ్చే అవకాశం లేదని చంద్రబాబు నిరూపిస్తున్నారు. దిగ్గజ సంస్థల ప్రతినిధులను విశాఖపట్నం దాకా తీసుకొచ్చి.. పెట్టుబడులు పెట్టిస్తున్నారు. కేంద్రం సహకారం కూడా అందిస్తున్న నేపథ్యంలో ఏపీ భవిష్యత్తు పెట్టుబడులకు స్వర్గధామం లాగా మారిపోతోంది. విశాఖపట్నం ఏపీకి మాత్రమే కాకుండా.. భారతదేశానికే బలమైన రాబడి అందించే నగరంగా రూపాంతరం చెందుతోంది.