Homeఎంటర్టైన్మెంట్Rajakumari Dayana: జబర్దస్త్ లోకి 'అగ్ని పరీక్ష 2' కంటెస్టెంట్ రాజకుమారి దయానా..ఎవరి టీం లోనో...

Rajakumari Dayana: జబర్దస్త్ లోకి ‘అగ్ని పరీక్ష 2’ కంటెస్టెంట్ రాజకుమారి దయానా..ఎవరి టీం లోనో తెలుసా?

Rajakumari Dayana: ‘అగ్ని పరీక్ష 2’ షో ద్వారా మంచి క్రేజ్ , ఫేమ్ ని సంపాదించుకున్న రాజకుమారి దయానా, బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనందుకు ఆమె అభిమానులు ఎంత బాధపడ్డారో అందరికీ తెలిసిందే. ‘అగ్ని పరీక్ష 2’ లో ఆమె తోపు పెర్ఫార్మన్స్ ఇచ్చింది , తన తోటి కంటెస్టెంట్స్ తో ఈమె తలపడిన విధానం వేరే లెవెల్ లో అనిపించింది. కచ్చితంగా బిగ్ బాస్ హౌస్ లోకి ఈమె ఎంట్రీ ఇస్తుందని […]

Rajakumari Dayana: ‘అగ్ని పరీక్ష 2’ షో ద్వారా మంచి క్రేజ్ , ఫేమ్ ని సంపాదించుకున్న రాజకుమారి దయానా, బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వనందుకు ఆమె అభిమానులు ఎంత బాధపడ్డారో అందరికీ తెలిసిందే. ‘అగ్ని పరీక్ష 2’ లో ఆమె తోపు పెర్ఫార్మన్స్ ఇచ్చింది , తన తోటి కంటెస్టెంట్స్ తో ఈమె తలపడిన విధానం వేరే లెవెల్ లో అనిపించింది. కచ్చితంగా బిగ్ బాస్ హౌస్ లోకి ఈమె ఎంట్రీ ఇస్తుందని అంతా ఆశించారు. ఓటింగ్ కూడా అప్పట్లో టాప్ 3 రేంజ్ లో ఉండేది. కానీ తెలిసిందే కదా , ఈ సీజన్ లో బిగ్ బాస్ టీం కి ఏది అనిపిస్తే అది చేస్తూ వెళ్తోంది తప్ప, ఆడియన్స్ ఓటింగ్ కి వారి మనోభావాలకు ఇసుమంత గౌరవం కూడా ఇవ్వడం లేదు అనే సంగతి. అందుకే శ్రేష్టి ని ఎంచుకొని , రాజకుమారి దయానా ని పంపేశారు. సోషల్ మీడియా లో అప్పట్లో దీనిపై పెద్ద చర్చనే నడిచింది.

అయితే ‘బిగ్ బాస్’ లోకి ఈమె రాలేకపోయుండొచ్చు కానీ , ‘జబర్దస్త్’ షోకి ఎంట్రీ ఇచ్చే అరుదైన అదృష్టం ఈమెకు కలిగింది. ఈ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ ఇండస్ట్రీ కి పరిచయమై నేడు ఉన్నత శిఖరాలను అధిరోహించారు. అలాంటి షో లోకి కేవలం ‘అగ్ని పరీక్ష 2’ తో ఫేమస్ అయ్యి రావడం అనేది చిన్న విషయం కాదు. ప్రస్తుతం ఈమె నూకరాజు టీం లో కొనసాగుతుంది. ఈ ఆదివారం ప్రసారమయ్యే లేటెస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో లో కూడా మనం రాజకుమారి దయానా ని చూడొచ్చు. చూస్తుంటే రాబోయే రోజుల్లో కూడా ఈమెకు బాగానే అవకాశాలు వచ్చేలా కనిపిస్తోంది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి , మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper