OM Movie: గత కొంతకాలం నుండి సరైన హిట్టు లేకుండా ఇబ్బంది పడుతున్న ధనుష్, రీసెంట్ గా ఓం అనే చిత్రం చేసిన సంగతి తెలిసిందే. ధనుష్ కెరీర్ లోనే భారీ హైప్ తో విడుదల అవ్వబోతున్న సినిమా ఇది. ఎందుకంటే ఇప్పటి వరకు విడుదలైన పాటలు సూపర్ హిట్ అయ్యాయి. యూత్ ఆడియన్స్ మొత్తం మెంటలెక్కిపోయారు. నిన్న విడుదల చేసిన ట్రైలర్ కి కూడా బ్లాస్టింగ్ రేంజ్ రెస్పాన్స్ వచ్చింది. ఇకపోతే ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు వెర్షన్ ప్రివ్యూ షో ని నిర్మాత నాగవంశీ బయ్యర్స్ వేసి చూపించాడట. వాళ్ళ నుండి భీభత్సమైన రెస్పాన్స్ వచ్చిందని వినికిడి. ఫస్ట్ హాఫ్ బాగుందని అనుకుంటే , సెకండ్ హాఫ్ అంతకు మించి ఉందని, ధనుష్ నట విశ్వరూపం మామూలు రేంజ్ లో లేదని అంటున్నారు. మరి ఇందులో ఎంత వరకు నిజముందో తెలియాలంటే నవంబర్ 20 వరకు ఆగాల్సిందే.
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే ధనుష్ ఒక పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. రెడ్ శాండిల్స్ స్మగ్లింగ్ చేసే మమ్మూటీ గ్యాంగ్ లో ఒక స్పై లాగా చేరి, అక్కడి సమాచారాన్ని మొత్తం పోలీసులకు అందిస్తూ ఉంటాడు. కానీ పోలీసుల దుశ్చర్య వల్ల , తన వాళ్ళని మొత్తం ధనుష్ కోల్పోవాల్సి వస్తుంది. అప్పుడు తన స్పై ఉద్యోగాన్ని పక్కన పెట్టి నిజంగానే మమ్మూటీ గ్యాంగ్ లో చేరిపోతాడు ధనుష్. ఆ తర్వాత ఎదురైనా పరిణామాలను ఆధారంగా చేసుకొని ఈ చిత్రం స్క్రీన్ ప్లే నడుస్తుంది. మంచి యాక్షన్, ఎమోషనల్ డెప్త్ ఉన్న స్టోరీ. డైరెక్టర్ సరిగ్గా డీల్ చేసి ఉంటే కచ్చితంగా బాక్స్ ఆఫీస్ వద్ద ఈ చిత్రం 300 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశాలు ఉంటాయి. ఇందులో సాయి పల్లవి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో నటించగా , శ్రీలీల ధనుష్ కి సతీమణి గా నటించింది.