Bigg Boss 10 Telugu: ‘బిగ్ బాస్ 10’ మొదటి 50 రోజులు బ్లాక్ బస్టర్ టీఆర్ఫీ రేటింగ్స్ తో కొనసాగగా, రోహిత్ ఎలిమినేషన్ తర్వాత డిజాస్టర్ దిశగా అడుగులు వేస్తోంది. మొదటి 50 రోజులు 11 కి పైగా టీఆర్ఫీ రేటింగ్స్ తో కొనసాగిన ఈ రియాలిటీ షో , ప్రస్తుతం 4 రేటింగ్స్ తో కొనసాగుతోంది. అయితే రేపు రోహిత్ రీ ఎంట్రీ ఉండే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రోహిత్ ని తీసుకొస్తే మరో రెండు వారాలు ఈ షో ని పొడిగిస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. పైగా హౌస్ లో ఇప్పటికీ 12 మందికి పైగా ఉన్నారు. ఇంతమంది ఉన్నారు కాబట్టి , ఈ వీకెండ్ డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని అంతా ఆశించారు. కానీ కేవలం సింగిల్ ఎలిమినేషన్ మాత్రమే ఉంటుందట. ఈ షో ని మరో రెండు వారాలు పొడిగించే ఆలోచనలో మేకర్స్ ఉండడం వల్లే ఈ వారం సింగిల్ ఎలిమినేషన్ నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు.
ప్రస్తుతానికి డేంజర్ జోన్ లో రామకృష్ణ , శ్వేతా నాయుడు ఉన్నారట. డబుల్ ఎలిమినేషన్ ఉండుంటే వీళ్లిద్దరు ఎలిమినేట్ అయ్యేవాళ్ళు. కానీ సింగిల్ ఎలిమినేషన్ పెట్టడం తో శ్వేతా నాయుడు ఎలిమినేట్ అయ్యినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. మరోపక్క ఫ్యామిలీ వీక్ లో భాగంగా ఈ వారం స్టేజి మీదకు కంటెస్టెంట్స్ తరుపున వాళ్ళ కుటుంబ సభ్యులు రావడమే కాకుండా, వాళ్ళతో పాటు పలువురు సెలబ్రిటీలు కూడా వచ్చారట. శ్వేతా నీదు కోసం సందీప్ మాస్టర్, ముకేశ్ కోసం నిఖిల్ , శివ్ కోసం గౌతమ్ కృష్ణ , దేబ్జాని కోసం అమరదీప్ చౌదరి, త్రిగున్ కోసం సాయి రాజేష్, అమన్ కోసం సోహైల్, వంశీ కోసం అలీ రీజా, వర్షిణి కోసం హైపర్ ఆది , రామ్ ప్రసాద్ కోసం గెటప్ శ్రీను, నీతూ మాస్టర్ కోసం తనూజ గౌడ వచ్చారట.