Homeఅంతర్జాతీయంUS Flight Disruptions: కాలం చెల్లిన పరికరాలు.. అమెరికా విమానయానంలో ఇంత దారుణమా

US Flight Disruptions: కాలం చెల్లిన పరికరాలు.. అమెరికా విమానయానంలో ఇంత దారుణమా

US Flight Disruptions: అమెరికా విమానయాన చరిత్రలో అరుదైన పరిణామం చోటుచేసుకుంది. దేశవ్యాప్తంగా విమానాల టేక్ ఆఫ్ లను ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తాత్కాలికంగా నిలిపివేసింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థలో ఏర్పడిన సాంకేతిక సమస్య కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో వేలాదిమంది ప్రయాణికులు విమానాశ్రయాలలోనే చిక్కుకుపోయారు. కొన్ని గంటల తర్వాత విమానాల రాకపోకలకు అనుమతి లభించినప్పటికీ.. ప్రయాణ అంతరాయాలు కొనసాగుతున్నాయి. అమెరికా విమాన రంగాన్ని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ సంస్థ […]

US Flight Disruptions: అమెరికా విమానయాన చరిత్రలో అరుదైన పరిణామం చోటుచేసుకుంది. దేశవ్యాప్తంగా విమానాల టేక్ ఆఫ్ లను ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తాత్కాలికంగా నిలిపివేసింది. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థలో ఏర్పడిన సాంకేతిక సమస్య కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో వేలాదిమంది ప్రయాణికులు విమానాశ్రయాలలోనే చిక్కుకుపోయారు. కొన్ని గంటల తర్వాత విమానాల రాకపోకలకు అనుమతి లభించినప్పటికీ.. ప్రయాణ అంతరాయాలు కొనసాగుతున్నాయి.

అమెరికా విమాన రంగాన్ని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ సంస్థ నియంత్రిస్తూ ఉంటుంది. అయితే ఈ సంస్థ నిర్వహించిన తనిఖీలలో దేశవ్యాప్తంగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రాల్లో కమ్యూనికేషన్ సమస్య ఏర్పడినట్లు గుర్తించింది. విమానాలు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణించే సమయంలో వాటి కదలికలను పర్యవేక్షించడానికి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. పైలెట్లు.. కంట్రోలర్లు పరస్పరం సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటూ.. విమానాల రాకపోకలను సమన్వయం చేస్తారు.

ఈ కమ్యూనికేషన్ వ్యవస్థలో సమస్య ఏర్పడిన నేపథ్యంలో విమానాల సురక్షిత ప్రయాణానికి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు ముందుగానే అంచనా వేశారు. దీంతో ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని దేశవ్యాప్తంగా విమానాల టేక్ ఆఫ్ ను నిలిపివేయాలని నిర్ణయించారు. అమెరికాలో 22 ప్రాంతీయ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రాలను ప్రభావితం చేసిన ఈ సమస్యను పరిష్కరించడానికి సాంకేతిక నిపుణులు రంగంలోకి దిగారు.

అమెరికాలోని ప్రధాన విమానాశ్రయాల్లో విమాన సర్వీసులు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. న్యూయార్క్.. చికాగో. లాస్ ఏంజిల్స్.. ఫిలడెల్ఫియా.. హ్యూస్టన్ వంటి నగరాలలో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు ప్రయాణికులు విమానంలోకి ఎక్కిన తర్వాత కూడా తిరిగి టెర్మినల్స్ కు రావాల్సి వచ్చింది. మరికొందరు గంటల తరబడి విమానాశ్రయాలలోనే ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. విమానాల రద్దు.. ఆలస్యల కారణంగా వేలాదిమంది ప్రయాణికులు తమ ప్రణాళికలను తలకిందులు చేసుకున్నారు. నవంబర్ 13న ఒక్కరోజే 4700 పైగా విమానాల రద్దు అయ్యాయి. పదివేలకు పై అభిమానాలు ఆలస్యంగా నడిచాయి. నవంబర్ 14న కూడా వందలాది విమానాలు రద్దయ్యాయి. అదే శుక్రవారం రాత్రి దేశవ్యాప్తంగా గ్రౌండ్ స్టాప్ ఆదేశాలను ఎత్తేశారు. దీంతో విమానాలు రాకపోకలు మొదలుపెట్టాయి. కాకపోతే చాలా విమానాలు ఇంకా విమానాశ్రయాలలోనే ఉండిపోయాయి. పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. కాలం చెల్లిన పరికరాలను వాడటం అమెరికా చరిత్రను ప్రపంచ దేశాల ముందు చులకన చేస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు. దేశాల మీద యుద్ధాలు చేసే అమెరికా ముందు తన రాతను మార్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper