Allu Arha Noble Book Of World Records: సెలబ్రిటీ కిడ్స్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) కుమార్తె అల్లు అర్హ(Allu arha) కి ఉన్న క్రేజ్ మామూలుది కాదు. సోషల్ మీడియా లో ఈమెకు సంబంధించిన వీడియోలు ఎంత పాపులర్ అయ్యాయో అందరికీ తెలిసిందే. చాలా క్యూట్ గా కనిపిస్తూ, ముద్దు ముద్దుగా మాట్లాడుతూ అల్లు అర్జున్ అభిమానుల మనసులనే కాదు, ఇతర హీరోల అభిమానుల మనసులను కూడా దోచుకుంది. ఈ చిన్నారి నిన్న తన పుట్టినరోజు వేడుకలను గ్రాండ్ గా జరుపుకుంది. నిన్నటితో ఆమె నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. ఇంత చిన్న వయస్సు లో అసాధ్యమైన రికార్డుని ఒకటి నెలకొల్పింది అల్లు అర్హ. నాన్న నే టాలెంటెడ్ అనుకుంటే, అల్లు అర్హ ఇంకా గొప్ప టాలెంటెడ్ అని ఈ ఒక్క సంఘటనతో తేలిపోయింది. అల్లు అర్హ కి ‘నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ లో చోటు దక్కింది.
Also Read: ‘ధురంధర్ 2’ తో పోటీ పడడం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టీం చేసిన పెద్ద మిస్టేక్.. ఓవర్సీస్ లో చావు దెబ్బ!
ఈ అవార్డు ఆమెకు ఎందుకు వచ్చిందంటే, చెస్ గేమ్ లో తన ప్రతిభ ని చాటుకోవడం వల్లే. తానూ చెస్ గేమ్ అద్భుతంగా ఆడడమే కాకుండా 50 మందికి ట్రైనింగ్ కూడా ఇచ్చిందట ఈ చిన్నారి. హైదరాబాద్ లోని హైటెక్ సిటీ కి చెందిన రాయ్ చెస్ అకాడమీ లో అల్లు అర్హ శిక్షణ తీసుకుంటూ ఉంది. కేవలం రెండు నెలల్లోనే ఈ చిన్నారికి దాదాపుగా 50 మందికి ట్రైనింగ్ ఇస్తూ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఇంత చిన్న వయస్సులో అంత మందికి ట్రైనింగ్ ఇవ్వడం అనేది ఇది వరకు ప్రపంచం లో ఎక్కడా కూడా జరగలేదు. అందుకే ఆమెకు ఈ అవార్డు ని బహుకరించినట్టు తెలుస్తోంది. ఈ అవార్డుని అల్లు అరహా తన తల్లిదండ్రులైన అల్లు అర్జున్ , అల్లు స్నేహా రెడ్డి సమక్షంలో తీసుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
అల్లు అర్హ అంటే మొదటి నుండే సోషల్ మీడియా మంచి క్రేజ్ ఉంది, ఈ విషయం తెలుసుకున్న తర్వాత ఆమె క్రేజ్ మరింత పెరిగింది. అందంగా , క్యూట్ గా ఉండడమే కాదు, తండ్రి లాగానే గొప్ప టాలెంటెడ్, భవిష్యత్తులో ee చిన్నారి తండ్రికంటే గొప్ప స్థాయికి వెళ్తుంది అంటూ అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు. ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే , ప్రస్తుతం ఆయన తమిళ డైరెక్టర్ అట్లీ తో ఒక సినిమా చేస్తున్నాడు. షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ వీడియో ని వచ్చే నెల అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
