Homeఅంతర్జాతీయంUS war impact on IT employees: యుద్ధం తెచ్చిన తంటా.. ఏమయ్యా ట్రంప్.. ఐటీ...

US war impact on IT employees: యుద్ధం తెచ్చిన తంటా.. ఏమయ్యా ట్రంప్.. ఐటీ ఉద్యోగుల కడుపు మీద కొడతావా

US war impact on IT employees: కోతలు.. ఇంకా రకరకాల వ్యవహారాలు సాగుతున్నప్పటికీ ఈ రోజుకు కూడా ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉద్యోగాలను కల్పిస్తున్న పరిశ్రమ ఏదైనా ఉందంటే అది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మాత్రమే. ఇందులో లక్షల మంది పనిచేస్తున్నారు. ఓ నివేదిక ప్రకారం ప్రపంచంలో వ్యవసాయం తర్వాత.. పారిశ్రామిక రంగం తర్వాత.. ఆ స్థాయిలో ఉద్యోగాలను కల్పిస్తున్నది ఐటి రంగమే. ఐటీ రంగంలో పని ఏ స్థాయిలో ఉంటుందో.. అంతకుమించిన స్థాయిలో వేతనాలు ఉంటాయి. అందువల్లే […]

US war impact on IT employees: కోతలు.. ఇంకా రకరకాల వ్యవహారాలు సాగుతున్నప్పటికీ ఈ రోజుకు కూడా ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా ఉద్యోగాలను కల్పిస్తున్న పరిశ్రమ ఏదైనా ఉందంటే అది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మాత్రమే. ఇందులో లక్షల మంది పనిచేస్తున్నారు. ఓ నివేదిక ప్రకారం ప్రపంచంలో వ్యవసాయం తర్వాత.. పారిశ్రామిక రంగం తర్వాత.. ఆ స్థాయిలో ఉద్యోగాలను కల్పిస్తున్నది ఐటి రంగమే. ఐటీ రంగంలో పని ఏ స్థాయిలో ఉంటుందో.. అంతకుమించిన స్థాయిలో వేతనాలు ఉంటాయి. అందువల్లే చాలామంది ఐటీ రంగంలో పనిచేయడానికి ఇష్టపడుతుంటారు.

కరోనా తర్వాత అంతర్జాతీయంగా పరిస్థితులు మారిపోతున్న నేపథ్యంలో ఐటి రంగం తీవ్రమైన ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నది. దీనివల్ల చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు.. ఇప్పటికీ కోల్పోతూనే ఉన్నారు. వేల సంఖ్యలో ఉద్యోగులను కంపెనీలు తొలగిస్తున్న నేపథ్యంలో పరిస్థితి దారుణంగా మారుతున్నది. ఇప్పటికే ఐటీ ఇండస్ట్రీలో ఉద్యోగుల తొలగింపు వల్ల ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడింది. అది సరిపోదు అన్నట్టుగా ట్రంప్ తీసుకున్న మూర్ఖపు నిర్ణయం వల్ల ఐటీ ఉద్యోగులు నరకం చూస్తున్నారు.

మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో యుద్ధం వల్ల ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని మళ్లీ తెరపైకి తీసుకొచ్చాయి. కొన్ని మల్టి నేషనల్ కంపెనీలు ఉద్యోగులకు ఇంటి నుంచి భోజనం తెచ్చుకోవాలని ఆదేశాలు జారీ చేశాయి. ఇంకా కొన్ని కంపెనీలు అయితే ఇంటి నుంచి పని చేయాలని స్పష్టం చేశాయి. యుద్ధం వల్ల పెట్రోలు, డీజిల్, ఎల్పిజి, గ్యాస్ వంటి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో ఉద్యోగులు వాహనాల వినియోగాన్ని తగ్గించారు. అంతేకాదు కంపెనీలు కూడా ఉద్యోగుల పికప్, డ్రాప్ సర్వీసులు కూడా తగ్గించాయి. సిలిండర్ల కొరత వల్ల ఐటీ కంపెనీల క్యాంపస్లలో మెనూ పూర్తిగా తగ్గించారు. ఫలితంగా ఐటీ సంస్థలు.. గ్లోబల్ కేబుల్ టి సెంటర్లు తమ సంస్థల్లో పని చేసిన ఉద్యోగులకు హైబ్రిడ్ వర్క్ మోడ్ విధానాన్ని అవలంబిస్తున్నాయి. బెంగళూరు, పూణే, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలలో ఇప్పటికే వర్గం హోం కల్చర్ మొదలైంది.

ఇక ఆన్ సైట్ వర్క్ కూడా పూర్తిగా తగ్గిపోయింది. పెద్దపెద్ద ఐటీ కంపెనీలు అమెరికా, అరబ్ దేశాలకు ఉద్యోగులను ఆన్ సైట్ కు పంపిస్తుంటాయి. అయితే తాజాగా యుద్ధం వల్ల ఉద్యోగులకు ప్రయాణ పరిమితులను అమలు చేస్తున్న నేపథ్యంలో.. ఆన్ సైట్ విధానాన్ని కంపెనీలు తాత్కాలికంగా వాయిదా వేశాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, విప్రో, డెలాయిట్, మోర్గాన్, కేపీఎంజీ, స్టాండర్డ్ చార్టర్డ్, గోల్డ్ మాన్ సాక్స్ వంటి కంపెనీలు ఉద్యోగుల భద్రతకు ప్రయారిటీ ఇస్తున్నాయి. అందువల్లే ఆఫ్ సైట్ వర్క్ విధానాన్ని పూర్తిగా నిలిపివేశాయి.

హైదరాబాద్ నగరంలో ఐటీ కారిడార్ లు గా మాదాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, మియాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పేరుందాయి. ఈ ప్రాంతాలలో సిలిండర్ల కొరత వల్ల హాస్టళ్లకు పూర్తిగా తాళాలు వేశారు. వెండర్లు ఆఫీస్ క్యాంటీన్లలో సేవలను నిలిపివేశారు. దీంతో బ్రింగ్ యువర్ ఓన్ ఫుడ్ విధానాన్ని ఐటి కంపెనీలు పాటించాలని సూచిస్తున్నాయి. దీంతో ఉద్యోగులు ఇంటి దగ్గర నుంచి ఆహారం తెచ్చుకుంటున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper