Homeఅంతర్జాతీయంSwitzerland Terror Attack: ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చింది.. స్విట్జర్లాండ్ అనుభవిస్తోంది..

Switzerland Terror Attack: ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చింది.. స్విట్జర్లాండ్ అనుభవిస్తోంది..

Switzerland Terror Attack: పాముకు పాలు పోసి పెంచితే అది.. అమృతాన్ని ఇవ్వదు.. విషాన్ని మాత్రమే కక్కుతుంది. అవసరమైతే కాటు వేసి ప్రాణాలు కూడా తీస్తుంది. ప్రాణాలు పోయిన తర్వాత చింతించి లాభం లేదు. ఎందుకంటే పాము విషయంలో పాల కంటే కర్రతోనే గట్టిగా సమాధానం చెప్పాలి. అప్పుడు చనిపోవాల్సిన అవసరం ఉండదు.

సరిగ్గా ఇదే ఉపోద్ఘాతం ఇప్పుడు యూరప్ దేశాలకు వర్తిస్తుంది. ఎందుకంటే కొంతకాలంగా యూరప్ దేశాలు బతకడానికి వచ్చిన అనేకమంది ముస్లింలకు ఆశ్రయం కల్పించాయి. ఆ ముస్లింలు ఆ దేశాల పౌరులుగా మారిపోయారు. వాస్తవానికి యూరప్ ప్రజలుగా నియమ నిబంధనలు పాటించి.. సమర్థవంతంగా జీవిస్తే పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. కాని వాళ్లు ఉగ్రవాదాన్ని తమ మనసులో నింపుకుంటున్నారు. అంతేకాదు ఉగ్రదాడులకు పాల్పడుతున్నారు.

ఇప్పటికే చాలామంది ముస్లింలను ఇంగ్లాండ్ ప్రభుత్వం పక్కన పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి.. మిగతా యూరప్ దేశాలు కూడా అదే దారిలో ఉన్నట్టు సమాచారం. అయితే కొంతమంది ముస్లింలు యూరప్ దేశాలలో అత్యంత దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా స్విజర్లాండ్ లో జరిగిన ఒక దారుణం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. దీంతో యూరప్ దేశాలు మొత్తం చింతిస్తున్నాయి. అనవసరంగా వారికి ఆశ్రయం కల్పించామని బాధపడుతున్నాయి.

స్విట్జర్లాండ్ దేశంలోని జ్యూరిచ్ నగరంలో ఇటీవల ఓ వ్యక్తి చేతిలో కత్తి పట్టుకుని విధ్వంసానికి పాల్పడ్డాడు. చాలామందిని గాయపరిచాడు. వారిలో ముగ్గురు చనిపోయారు. ఆ ముగ్గురు వ్యక్తులు చంపిన ఆ కిరాతకుడి పేరు నసీం. ఇతడు టర్కీ ప్రాంతానికి చెందినవాడు. చాలా సంవత్సరాల క్రితమే స్విజర్లాండ్ వచ్చాడు. 2017లో అక్కడి పౌరసత్వాన్ని తీసుకున్నాడు.. అయితే ప్రశాంతతకు మారుపేరైన స్విజర్లాండ్ లో అతడు రక్తాన్ని పారించాడు. స్విజర్లాండ్ పౌరుల మీద దారుణంగా కత్తిపోట్లు పొడిచాడు. ముగ్గురిని బలి తీసుకున్నాడు. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా ఇస్లాం ఉగ్రవాదాన్ని మరోసారి తెరపైకి తీసుకువచ్చింది.. పాపం అని ఆశ్రయం ఇచ్చినందుకు స్విజర్లాండ్ దేశ పౌరులను చంపిన నసీం ను ఉరితీయాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.

కొంతకాలంగా ఇస్లాం ఉగ్రవాదం విపరీతంగా పెరుగుతుంది. ప్రపంచం మొత్తం ఇస్లాం మతం మాత్రమే ఉండే విధంగా చాందసవాదులు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. వీరికి పలు దేశాల నుంచి నిధులు వస్తున్న నేపథ్యంలో ఉగ్ర కార్యకలాపాలను వేగవంతం చేస్తున్నారు. ప్రశాంతతకు మారుపేరైన స్విజర్లాండ్ ప్రాంతంలో ఈ తరహా దాడి జరిగింది అంటే దానిని మామూలు విషయంగా చూడొద్దని విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పటికైనా శరణార్థులుగా వచ్చే వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని.. వారు ప్రపంచ దేశాల అధినేతలకు సూచిస్తున్నారు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular