Homeఅంతర్జాతీయంSaudi Arabia Pakistan defense deal: పాక్‌కు సౌదీ షాక్‌.. డిఫెన్స్‌ డీల్‌కు బ్రేక్‌!

Saudi Arabia Pakistan defense deal: పాక్‌కు సౌదీ షాక్‌.. డిఫెన్స్‌ డీల్‌కు బ్రేక్‌!

Saudi Arabia Pakistan defense deal: పశ్చిమాసియా యుద్ధం వేళ.. అమెరికాకు మద్దతు ఇస్తుందన్న సాకుతో ఇరాన్‌ గల్ప్‌ దేశాలపై ప్రతీకార దాడులు చేసింది. సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, బహ్రెయిన్‌లోని అమెరికా ఎయిర్‌ బేస్‌లతోపాటు గల్ఫ్‌ దేశాల్లోని అయిల్‌ సంస్థలపై డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ క్రమంలో సౌదీ రేబియా గతంలో చేసుకున్న ఒప్పందంలో భాగంగా తమ తరఫున ఇరాన్‌పై యుద్ధం చేయాలని పాకిస్తాన్‌ను కోరింది. కానీ పాకిస్తాన్‌ ఆఫ్గానిస్తాన్‌ యుద్ధం సాకుగా చూపి తప్పించుకుంది. దీంతో […]

Saudi Arabia Pakistan defense deal: పశ్చిమాసియా యుద్ధం వేళ.. అమెరికాకు మద్దతు ఇస్తుందన్న సాకుతో ఇరాన్‌ గల్ప్‌ దేశాలపై ప్రతీకార దాడులు చేసింది. సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, బహ్రెయిన్‌లోని అమెరికా ఎయిర్‌ బేస్‌లతోపాటు గల్ఫ్‌ దేశాల్లోని అయిల్‌ సంస్థలపై డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ క్రమంలో సౌదీ రేబియా గతంలో చేసుకున్న ఒప్పందంలో భాగంగా తమ తరఫున ఇరాన్‌పై యుద్ధం చేయాలని పాకిస్తాన్‌ను కోరింది. కానీ పాకిస్తాన్‌ ఆఫ్గానిస్తాన్‌ యుద్ధం సాకుగా చూపి తప్పించుకుంది. దీంతో ఇప్పుడు అమెరికాకు సౌదీ షాక్‌ ఇచ్చింది.

సూదాన్‌ డీల్‌తో ఆర్థికసాయం వెనక్కి..
పాకిస్తాన్‌ సూడాన్‌తో ఫైటర్‌ జెట్లు, ఆయుధ వ్యవస్థల కోసం 1.5 బిలియన్ల ఒప్పందం ముందుకు సాగుతుండగా, సౌదీ పాకిస్తాన్‌కు చేసే ఆర్థిక సాయాన్ని వెనక్కి తీసుకుంది. సూడాన్‌ సైన్యాధ్యక్షుడు అబ్దెల్‌ ఫత్తాహ్‌ అల్‌–బుర్హాన్‌ నేతృత్వంలో ఈ డీల్‌ జరిగింది. ర్యాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్సెస్‌తో నాలుగో సంవత్సరంలో ఉన్న యుద్ధం ప్రపంచంలోని అతి గొప్ప మానవతా సంక్షోభానికి కారణమైంది.

సౌదీ వ్యూహ మార్పు..
సౌదీ మొదట యూఏఈ ప్రభావాన్ని అడ్డుకోవాలని, సూదాన్‌తో సంబంధాలు బలోపేతం చేయాలని ఈ డీల్‌కు మద్దతు ఇచ్చింది. పాక్‌ ఆఫ్రికాలో రక్షణ ఎగుమతులను పెంచుకోవాలని భావించగా, సౌదీ మార్చి రియాధ్‌ సమావేశంలో ఫైనాన్సింగ్‌ ఉపసంహరించింది. ఇరాన్‌–అమెరికా ఉద్రిక్తతలు సౌదీ దేశీయ భద్రతపై దృష్టి పెట్టేలా చేశాయి.

లిబియా ఒప్పందం ప్రమాదం..
లిబియా నేషనల్‌ ఆర్మీ సంబంధిత 4 బిలియన్‌ డాలర్ల డీల్‌ కూడా రియాధ్‌ పునర్విచారణకు గురైంది. సూడాన్, లిబియాలో ప్రాక్సీ యుద్ధాల్లో పాలుపంచుకోవడానికి పాశ్చాత్య దేశాలు సౌదీకి హెచ్చరికలు జారీ చేశాయి. రెడ్‌ సీ ప్రాంతంలో యూఏఈ ప్రభావాన్ని అడ్డుకోవాలని సూడాన్‌ బంగారు గనులు, నీటి ప్రాజెక్టులతో సంబంధాలు బాంధించుకుంది.

పాకిస్తాన్‌ ఆర్థిక స్థిరత్వానికి సౌదీ ముఖ్య ఆర్థిక మద్దతుదారు. ఈ ఆఫ్రికా డీల్స్‌ ఆగిపోవడం పాక్‌ రక్షణ ఎగుమతులు, దౌత్య ఆశయాలకు దెబ్బ తీసింది. సౌదీ ఇరాన్‌–అమెరికా మధ్య మధ్యవర్తిత్వానికి పాక్‌ను ఉపయోగించాలని భావిస్తున్నప్పటికీ, గల్ఫ్‌ ప్రాధాన్యతలు మారుతున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper