Pan India movies failure Actors: ఇండస్ట్రీలో ఎవరు ఎన్ని సక్సెస్ లు సాధించినా కూడా పాన్ ఇండియాలో పెను సంచలనాలను క్రియేట్ చేసే హీరోలకు మాత్రమే గొప్ప స్థాయి దక్కుతుంది. ఇప్పటివరకు టాప్ రేంజ్ లో ముందుకు దూసుకెళుతున్న హీరోలు చాలా మంది ఉండటం విశేషం… ఇక విజయ్ దేవరకొండ, నాని లాంటి హీరోలు టైర్ వన్ హీరోలుగా మారడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. వీళ్లిద్దరి మధ్య భారీ పోటీ అయితే ఉంది. ఇక ఆ పోటీని తట్టుకొని ఎవరు టైర్ వన్ హీరోగా మారబోతున్నారనేది తెలియాలంటే మాత్రం మరో రెండు మూడు సినిమాలు రిలీజ్ రిలీజ్ అయితే గానీ ఒక క్లారిటీ అయితే రాదు.
మరి ఇలాంటి క్రమంలోనే వీళ్ళు పాన్ ఇండియాలో ఒక సక్సెస్ సాధిస్తే చాలు అని ధోరణిలో కూడా తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. గతంలో నాని హీరోగా వచ్చిన దసర సినిమా పాన్ ఇండియా రిలీజ్ అయినప్పటికి ఆ సినిమా అనుకున్న మేరకు సక్సెస్ ని సాధించలేకపోయింది. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని మెప్పించగలిగే కెపాసిటీ ఉన్నాయి. స్టార్ హీరోలైన నాని, విజయ్ దేవరకొండ విజయాలు సాధించడంలో మాత్రం వెనకబడిపోతురు.
వీళ్ళకంటే తర్వాత వచ్చిన హీరోలు సైతం పెను సంచలనాలను క్రియేట్ చేస్తుండడం వీళ్ళు ఇంకా ఒక సక్సెస్ ని సాధించడానికి నానా తంటాలు పడుతూ ఉండడంతో ఇది చూసిన చాలామంది వీళ్ళ మీద కామెంట్లు అయితే చేస్తున్నారు. ఇక ఏది ఏమైనా కూడా రాబోయే సినిమాలతో పాన్ ఇండియా షేక్ అయ్యే విధంగా సక్సెస్లను సాధించాల్సిన అవసరమైతే ఉంది…
ఇక టైర్ వన్ హీరోలుగా కొనసాగుతున్న వాళ్ళు సైతం ఇప్పుడు వరుసగా ఫ్యాన్ ఇండియా సినిమాలను చేస్తూ సూపర్ సక్సెస్ లను సాధించడానికి సిద్ధమవుతున్నారు.టైర్ వన్ హీరో రేస్ లో మన వాళ్ళు ముందు వరుసలో ముందుకు దూసుకెళ్తుంటే విజయ్ దేవరకొండ, నాని మాత్రం టైర్ వన్ హీరోలుగా మారడానికి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు…