Homeఅంతర్జాతీయంPakistan Terrorism Crackdown: ఉగ్రవాదులను లేపేస్తున్న అజ్ఞాత సాయుధులు.. రోజూ లెక్కలు వేసుకుంటున్న పాకిస్తాన్‌!

Pakistan Terrorism Crackdown: ఉగ్రవాదులను లేపేస్తున్న అజ్ఞాత సాయుధులు.. రోజూ లెక్కలు వేసుకుంటున్న పాకిస్తాన్‌!

Pakistan Terrorism Crackdown: పాకిస్తాన్‌లో వారం రోజులుగా ఉగ్రవాద సంస్థలు, వారికి సహకరించే ఓవర్‌ గ్రౌండ్‌ వర్కర్స్‌ నిద్ర లేవగానే ఒక ప్రశ్న వేసుకుంటున్నారు. అదే ఈరోజు స్కోర్‌ ఎంత.. మనలా అక్కడ ఐపీఎల్‌ ఏమీ జరగడం లేదు. కానీ అక్కడ పది రోజులుగా నిత్యం భారత వ్యతిరేక ఉగ్రవాదులు హతమవుతున్నారు. పది రోజుల్లో పది మంది భారత వ్యతిరేకులను అజ్ఞాత సాయుధలు లేపేశారు. రెండేళ్లలో 100కి పైగా హతమయ్యారు. శుక్రవారం స్కోర్‌ ’2’. ఇది కేవలం […]

Pakistan Terrorism Crackdown: పాకిస్తాన్‌లో వారం రోజులుగా ఉగ్రవాద సంస్థలు, వారికి సహకరించే ఓవర్‌ గ్రౌండ్‌ వర్కర్స్‌ నిద్ర లేవగానే ఒక ప్రశ్న వేసుకుంటున్నారు. అదే ఈరోజు స్కోర్‌ ఎంత.. మనలా అక్కడ ఐపీఎల్‌ ఏమీ జరగడం లేదు. కానీ అక్కడ పది రోజులుగా నిత్యం భారత వ్యతిరేక ఉగ్రవాదులు హతమవుతున్నారు. పది రోజుల్లో పది మంది భారత వ్యతిరేకులను అజ్ఞాత సాయుధలు లేపేశారు. రెండేళ్లలో 100కి పైగా హతమయ్యారు. శుక్రవారం స్కోర్‌ ’2’. ఇది కేవలం సంఖ్యలు కాదు.. ాకిస్తాన్‌ టెర్రర్‌ యంత్రాంగం వెన్నులో వణుకు పుట్టించే నంబర్‌. భారత్‌పై దాడులు ప్లాన్‌ చేసే వాళ్లే టార్గెట్‌గా అజ్ఞాత బందూకులు మట్టుపెడుతున్నారు.

ఇస్లామాబాద్‌–కరాచీ డబుల్‌ బ్లో..
ఇస్లామాబాద్‌లో హిజ్బుల్‌ ముజాహిదీన్‌ కీలకుడు సజ్జాద్‌ అహ్మద్‌. కాశ్మీర్‌ నుంచి పాక్‌కు వెళ్లి సలావుద్దీన్‌ కౌన్సిల్‌లు ఏర్పాటు చేసి, లష్కర్‌–జైష్‌లకు గ్రౌండ్‌ సపోర్ట్‌ ఇచ్చినవాడు. తాజాగా సజ్జాద్‌ను అజ్ఞాతులు లేపేశారు. అతని ఇంటి పక్కన ఉండే వ్యక్తి సోషల్‌ మీడియా పోస్ట్‌ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన ఇస్లామాబాద్‌లో జరిగింది. ఇక కరాచీలో లష్కర్‌ ఎ తోయిబా ఉగ్రవాది అబూ జకర్‌ మసూద్‌ ఆసుపత్రిలో మరణించాడు. ఎలా చనిపోయాడో తెలియదు కానీ చికిత్స పొందుతూ చనిపోయాడు. దీంతో ఇక నెక్ట్స్‌ టార్గెట్‌ హాఫిజ్‌ సయ్యద్‌ అన్న వాదనలు వినిపిస్తున్నాయి. వరుస ఘటనలతో భయపడిపోయిన హఫీజ్‌ తనకు భద్రత కల్పించాలని పాకిస్తాన్‌ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు.

ఉగ్రవాదులను పెంచి పోషించిన పాకిస్తాన్‌..
ఇదిలా ఉంటే పాకిస్తాన్‌ భారత్‌లో విధ్వంసం, అల్లర్లు, దాడుల కోసం ఉగ్రవాద సంస్థలను తయారు చేసింది. ముందుగా హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ను ఏర్పాటు చేసింది. తర్వాత లష్కర్‌ ఎ తోయిబా, జైష్‌ ఎ మహ్మద్‌ సంస్థలను ఏర్పాటు చేసింది. ఈ సంస్థలు ఉగ్రవాదులను తయారు చేసి భారత్‌లోకి పంపి దాడులు చేయిస్తున్నాయి. అయితే భారత్‌ ఉగ్రవాదులు భారత్‌లోకి రాకుండానే లేపేసే ప్లాన్‌ చేసింది. ఈ క్రమంలోనే అజ్ఞాత సాయుధులు భారత వ్యతిరేకులను లేపేస్తున్నారు.

పాకిస్తాన్‌ టెర్రర్‌ ఫ్యాక్టరీలు ఇక సేఫ్‌ కావు. ఆర్థిక సంక్షోభం, టీటీపీ దాడుల మధ్య ఇది మరో షాక్‌. భారత్‌పై దాడులకు మూలాలు కట్‌ అయితే, దక్షిణాసియా శాంతి సాధ్యమే. స్కోర్‌ టిక్‌ అవుతుంటే, పాక్‌ ప్రభుత్వం ఏమి చేస్తుంది? సమయం చెప్పాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper