Khawaja Asif on Indo-Pak war: పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా మహమ్మద్ ఆసిఫ్‌కు ఈపు ములముల పెడుతున్నట్లుంది. సాప్ చేయించుకునేదాకా ఒళ్లు ములముల అనేలానే ఉంది. ఎందుకంటే.. వరుసగా భారత్ విషయంలో నోరు పారేసుకుంటున్నాడు. రెండు రోజుల క్రితం యుద్ధం వస్తే భారత్ తమ యుద్ధ విమానా శకలాల కింద సమాధి అవుతుందన్నారు. తాజాగా సమా టీవీతో మాట్లాడుతూ, రెండు దేశాల మధ్య యుద్ధం జరగదని చెప్పలేమని పేర్కొన్నారు. ఈ మాటలు రెండు దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తతలను పెంచేలా ఉన్నాయి. సైనిక చర్యలకు దిగితే పాకిస్తాన్ ప్రపంచ పటంలో ఉండదని, మన ఆర్మీ చీఫ్, ఎయిర్ ఫోర్స్ చీఫ్ హెచ్చరించారు. అయినా ఖావాజా బలుపెక్కిన మాటలు మాట్లాడుతూ కయ్యానికి కాలుదువ్వుతున్నాడు. తాజాగా ఆయన వ్యాఖ్యలు అంతర్జాతీయ వేదికలపై కొత్త చర్చలకు దారి తీశాయి. ఈ ప్రకటనలు భవిష్యత్తు రాజకీయ, సైనిక పరిణామాలపై ప్రభావం చూపవచ్చు.
భయం ఉన్నా.. బలుపు మాటలు
ఇదిలా ఉంటే తాము రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచాలనుకోవడం లేదని స్పష్టం చేశారు. అయితే సంఘర్షణ అవకాశాలను పూర్తిగా తిరస్కరించలేమని వ్యాఖ్యానించారు. యుద్ధం జరిగితే మాత్రం గతంకన్నా మెరుగైన ఫలితాలు సాధిస్తామనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. తద్వారా పాకిస్తాన్ సైన్యంలో ఆత్మవిశ్వానం నింపే ప్రయత్నం చేశారు. భారత్ అంటే భయం ఉన్నప్పటికీ ఈ ప్రకటనలు దేశీయ రాజకీయాల్లో ఆయన స్థానాన్ని బలోపేతం చేయడానికి లేదా అంతర్గత సమస్యల నుండి దృష్టి మళ్లించడానికి ఉద్దేశించినవిగా విశ్లేషకులు భావిస్తున్నారు. పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరతల నేపథ్యంలో ఇటువంటి మాటలు బాహ్య శత్రువును చూపి జాతీయ ఐక్యతను ప్రోత్సహించే వ్యూహంగా పరిగణించవచ్చు.
చారిత్రక వాస్తవాలు ఇలా..
భారత్ ఎప్పుడూ ఏకీకృత దేశం కాదని, మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు పాలనలో మాత్రమే అలా ఉందని ఖాజావా అన్నారు. కానీ ఇది చారిత్రక వాస్తవాలకు విరుద్ధంగా ఉంది. ఎందుకంటే భారత ఉపఖండం మౌర్య, గుప్త సామ్రాజ్యాలు, మరాఠాలు వంటి అనేక రాజవంశాల కాలంలో ఏకీకృత రూపాలను చూసింది. పాకిస్తాన్ ఎప్పటి నుంచో వేరుగా ఉందనే వాదన కూడా వివాదాస్పదం. ఎందుకంటే 1947 విభజన మతపరమైన ఆధారంగా జరిగినప్పటికీ, ఇరు దేశాల చరిత్రలు ఒకే మూలాల నుంచి పుట్టాయి. ఇటువంటి వ్యాఖ్యలు రాజకీయ ఉద్దేశాలతో చరిత్రను వక్రీకరించే ప్రయత్నంగా కనిపిస్తాయి. ఇది రెండు దేశాల మధ్య శాంతి ప్రక్రియలకు అడ్డంకి కావచ్చు. పాక్ ఏకత్వం, సైనిక సిద్ధత మంత్రి తమ దేశంలో అంతర్గత వివాదాలు ఉన్నప్పటికీ, భారత్‌తో ఎదుర్కోవాలంటే అందరూ ఏకమవుతామని చెప్పారు.
పాకిస్తాన్‌లోనే కానరాని ఐక్యత..
పాక్ సమాజంలో మతపరమైన ఐక్యతను ఆధారంగా చేసుకున్న వాదన, కానీ వాస్తవంలో బలూచిస్తాన్, సింధ్ వంటి ప్రాంతాల్లో విభజన భావనలు బలంగా ఉన్నాయి. సైనికంగా మెరుగైన ఫలితాలు సాధిస్తామనే ఆత్మవిశ్వాసం గత యుద్ధాలు (1947, 1965, 1971, 1999)లో ఎదురైన నష్టాలకు విరుద్ధంగా ఉంది. ఇటువంటి ప్రకటనలు దేశీయ మనోధైర్యాన్ని పెంచడానికి ఉద్దేశించినవి కావచ్చు, కానీ అంతర్జాతీయంగా పాక్ ఆర్థిక బలహీనతలు, సైనిక సవాళ్లు దీన్ని ప్రశ్నార్థకం చేస్తాయి. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చను రేకెత్తించాయి, ముఖ్యంగా భారతీయ నెటిజన్లు హాస్యాస్పదంగా స్పందిస్తున్నారు. ‘ఖౌఫ్ కా మహౌల్ హై‘ వంటి కామెంట్లు, మంత్రి ఉచ్చారణలను మాక్ చేస్తూ వైరల్ అవుతున్నాయి.
పాక్ అంతర్గత సమస్యల నుంచి దృష్టి మళ్లించే ప్రయత్నంగా విమర్శలు వస్తున్నాయి. కొందరు ఇది రాజకీయ బలహీనతను సూచిస్తుందని అంటున్నారు. మొత్తంగా, ఈ ప్రతిస్పందనలు రెండు దేశాల మధ్య డిజిటల్ వార్‌ను మరింత తీవ్రతరం చేస్తున్నాయి. ఈ ప్రకటనలు భారత్–పాక్ సంబంధాలను మరింత దిగజార్చవచ్చు, అంతర్జాతీయ శాంతి ప్రయత్నాలకు అడ్డుగా నిలుస్తాయి.
Pakistan Defence Minister Khwaja Asif speaks of the possibility of another Indo-Pak war-
“History shows that India was never truly united, except briefly under Aurangzeb. Pakistan was created in the name of Allah. At home, we argue and compete, but in a fight with India we come… pic.twitter.com/bTrDxqhQel
— Geeta Mohan گیتا موہن गीता मोहन (@Geeta_Mohan) October 8, 2025