Homeఅంతర్జాతీయంNorth Korea nuclear warship: ఉత్తర కొరియా అణు యుద్ధనౌక.. రష్యా సహకారంతో సిద్ధం చేస్తున్న...

North Korea nuclear warship: ఉత్తర కొరియా అణు యుద్ధనౌక.. రష్యా సహకారంతో సిద్ధం చేస్తున్న కిమ్‌ జోంగ్‌ ఉన్‌!

North Korea nuclear warship: అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్‌ ట్రంప్‌.. అమెరికా ఆధితప్యం మరింత పెంచేందుకు యత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రపంచ దేశాలపై టారిఫ్‌లు విధించారు. ఇక శత్రుశేషం లేకుండా ఉండేందుకు చిన్న దేశాలపై దాడులు చేస్తున్నారు. మొన్న వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్‌ మధురోను, ఆయన భార్యను కిడ్నాప్‌ చేశారు. తర్వాత గ్రీన్‌లాండ్‌ స్వాధీనం కోసం ప్రయత్నించారు. నాటో దేశాలు వ్యతిరేకించడంతో వెనక్కి తగ్గారు. ఇక ఇప్పుడు ఇరాన్‌తో యుద్ధం చేస్తున్నారు. ఇది ముగిసిన వెంటనే తర్వాత టార్గెట్‌ ఉత్తర కొరియా అన్న ప్రచారం జరుగుతోంది. దీంతో కిమ్‌ జోంగ్‌ ఉన్‌ అప్రమత్తమయ్యారు. తన మూడో చోయ్‌ హ్యోన్‌ క్లాస్‌ డెస్ట్రాయర్‌ నిర్మాణాన్ని ప్రారంభించారు. 5 వేల టన్నుల బరువైన అణ్వాయయుధాలను మోసుకెళ్లే ఈ నౌక ప్రపంచం దృష్టిని ఆకర్సిస్తోంది. రష్యా సాంకేతిక సహకారంతో షిప్‌యార్డ్‌లో ఈ ప్రాజెక్ట్‌ జరుగుతోంది.

నౌక విశేషాలు
చోయ్‌ హ్యోన్‌ క్లాస్‌ డెస్ట్రాయర్‌ల సిరీస్‌లో మొదటిది ఏప్రిల్‌ 2025లో, రెండోది జూన్‌లో ప్రయోగించారు. మూడో నౌక 2026 అక్టోబర్‌ 10 నాటికి (వర్కర్స్‌ పార్టీ స్థాపన దినం) సిద్ధమవుతుంది. క్రూజ్‌ మిస్సైళ్లు, యాంటీ–షిప్, యాంటీ–ఎయిర్‌ ఆయుధాలతో తయారు చేస్తున్నారు. అణు సామర్థ్యంతో సముద్ర సరిహద్దులను మార్చాలని కిమ్‌ లక్ష్యం పెట్టుకున్నారు.

రష్యా సహకారం
రష్యా–ఉత్తరకొరియా సైనిక ఒప్పందాలు ఈ ప్రాజెక్ట్‌కు ఆధారం. సర్గే లావ్రోవ్‌ కిమ్‌తో సమావేశాలు జరిగిన తర్వాత ఈ ప్రకటన వచ్చింది. రష్యా సాంకేతిక నైపుణ్యం లేకుండా ఈ స్థాయి నౌకలు కష్టమని నిపుణులు అంచనా. ఇది రెండు దేశాల మధ్య ఆయుధ, సాంకేతిక ఇన్‌ఫర్మేషన్‌ బదిలీకి నిదర్శనం.

ఉత్తరకొరియా నావికాశక్తి బలోపేతంతో దక్షిణకొరియా నార్తర్న్‌ లిమిట్‌ లైన్‌ను తొలగించాలని, సముద్ర సరిహద్దులు మార్చాలని చూస్తోంది. 2026 నుంచి ఏటా రెండు డెస్ట్రాయర్‌లు నిర్మించాలని కిమ్‌ ఆదేశాలు చేశారు. దక్షిణకొరియా, అమెరికా ఈ అభివృద్ధిపై ఆందోళన చెందుతున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular