Homeబిజినెస్Hyundai i20: సీక్రెట్ గా టెస్ట్ చేస్తున్న Hyundai i20 ఫొటోస్ లీక్.. ఫీచర్స్ తెలిస్తే...

Hyundai i20: సీక్రెట్ గా టెస్ట్ చేస్తున్న Hyundai i20 ఫొటోస్ లీక్.. ఫీచర్స్ తెలిస్తే షాక్ అవుతారు..

Hyundai i20: ప్రముఖ కార్ల కంపెనీ Hyundai గురించి అందరికీ తెలిసిన విషయమే. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే i10, i20 కార్లు మార్కెట్లోకి వచ్చి అలరించాయి. అయితే వినియోగదారుల అభివృద్ధిలో మారడంతో వారికి అనుగుణంగా టెక్నాలజీని కూడా మారుస్తుంది. దీంతో ప్రముఖంగా నిలిచిన i20 కారును అప్డేట్ చేసి తీసుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కారును సీక్రెట్ గా టెస్టు చేస్తున్న ఫోటోలు లీక్ అయ్యాయి. ఇందులో ముఖ్యంగా ఇంటీరియర్ డిజైన్ పూర్తిగా మారినట్లు తెలుస్తోంది. […]

Hyundai i20: ప్రముఖ కార్ల కంపెనీ Hyundai గురించి అందరికీ తెలిసిన విషయమే. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే i10, i20 కార్లు మార్కెట్లోకి వచ్చి అలరించాయి. అయితే వినియోగదారుల అభివృద్ధిలో మారడంతో వారికి అనుగుణంగా టెక్నాలజీని కూడా మారుస్తుంది. దీంతో ప్రముఖంగా నిలిచిన i20 కారును అప్డేట్ చేసి తీసుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కారును సీక్రెట్ గా టెస్టు చేస్తున్న ఫోటోలు లీక్ అయ్యాయి. ఇందులో ముఖ్యంగా ఇంటీరియర్ డిజైన్ పూర్తిగా మారినట్లు తెలుస్తోంది. అవి ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Hyundai కంపెనీ నుంచి ఐ20 కారు 2026 ఏడాది చివర్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించిన టెస్టింగ్ స్కాన్డినేనియా లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. అక్కడ మంచు పరిస్థితులు ఉన్నాయి. ఈ వాతావరణంలో ఈ కారు ఎలా ఉండబోతుందో టెస్టు చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే కొందరు ఈ కారులోని ఇంటీరియర్ డిజైన్ కు సంబంధించిన ఫోటోలను బయటపెట్టారు. వాటి ప్రకారం ఇందులో 12.3 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, ఇన్స్ట్రుమెంట్ డిస్ప్లే అనే డ్యూయల్ స్క్రీన్లు ఉన్నాయి. ఇప్పటివరకు టాప్ కార్లలో మాత్రమే ఇలాంటి స్క్రీన్లు ఉండేవి. ఈ డిస్ప్లేలు హెచ్ ఆకారంలో కనిపిస్తుంది. డాష్ బోర్డు కూడా పూర్తిగా మార్చినట్లు తెలుస్తోంది. అలాగే స్టీరింగ్ వీల్ ఇటీవల మార్కెట్లో ప్రవేశపెట్టిన వెన్యూ కారు వలె పోలి ఉంటాయి.

అలాగే ఈ కారు 360 డిగ్రీ సరౌండ్ వ్యూ కెమెరా వంటి కొత్త లక్షణాలను కలిగి ఉంటుంది. దీంతో ఈ కారు సేఫ్టీ గా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఇందులో 2 అడాస్ టెక్నాలజీ కూడా చేర్చినట్లు తెలుస్తోంది. సిక్స్ ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ కంట్రోల్, వెహికల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్ తో పాటు రియల్ పార్కింగ్ సెన్సార్, డైనమిక్ గైడ్లైన్స్ తో కూడిన రియర్ కెమెరా, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టం వంటివి ఇందులో కనిపిస్తున్నాయి. హుండాయ్ ఐ20 కారు ఎక్స్టీరియర్ డిజైన్ కూడా వేరే లెవెల్ అనుకోవచ్చు. ఈ కొత్త కారు పూర్తిగా బాక్సి డిజైన్తో కలిగి ఉంటుంది. దీంతో ప్రీమియం లుక్ తో కనిపించే అవకాశం ఉంది. అలాగే కారు చుట్టూ ఎల్ఈడి బార్ ఉండనుంది. టాప్ మౌంటెడ్ ఎల్ఈడి డిఆర్ఎల్ లో కూడా చూడవచ్చు.

అంతర్జాతీయ మార్కెట్లో హుందాయికి ప్రత్యేక గుర్తింపు ఉంది దీంతో కొత్తగా రాబోయే i20 అన్ని వర్గాల వారికి అనుగుణంగా ఉండే అవకాశం ఉంది. ఇందులో హైబ్రిడ్ పవర్ ట్రెయిన్ ఇంజన్ చేర్చారు. ఈ ఇంజన్ 5 స్పీడ్ మాన్యువల్ తో పనిచేస్తుంది. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో కొనసాగే ఇది 83 పవర్ తో పనిచేస్తుంది. ఇది మార్కెట్లోకి వస్తే రూ.5.99 లక్షల ప్రారంభ ధర నుంచి రూ. 13.41 లక్షల వరకు విక్రయించే అవకాశం ఉందని తెలుస్తోంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Oktelugu Epaper