Homeఅంతర్జాతీయంNarendra Modi Israel Visit Analysis: మోదీ ఇజ్రాయెల్‌ పర్యటన.. నేతన్యాహు బలం పెంచేందుకేనా?

Narendra Modi Israel Visit Analysis: మోదీ ఇజ్రాయెల్‌ పర్యటన.. నేతన్యాహు బలం పెంచేందుకేనా?

Narendra Modi Israel Visit Analysis: భారత ప్రధాని నరేంద్రమోదీ రెండు రోజుల పర్యటన కోసం ఫిబ్రవరి 25న ఇజ్రాయెల్‌ వెళ్లారు. 26న కూడా అక్కడే ఉంటారు. మోదీకి ఇజ్రాయెల్‌లో ఘన స్వాగతం లభించింది. ఇక రాత్రి ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమెన్‌ నెతన్యాహు భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించి కలిశారు. ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక ఎయిర్‌పోర్టులో నెతన్యాహు భార్య కాషాయ రంగు దుస్తులు ధరించి వచ్చింది. ఇలాంటి నేపథ్యంలో మోదీ పర్యటనపై ఒకవైపు సానుకూల […]

Narendra Modi Israel Visit Analysis: భారత ప్రధాని నరేంద్రమోదీ రెండు రోజుల పర్యటన కోసం ఫిబ్రవరి 25న ఇజ్రాయెల్‌ వెళ్లారు. 26న కూడా అక్కడే ఉంటారు. మోదీకి ఇజ్రాయెల్‌లో ఘన స్వాగతం లభించింది. ఇక రాత్రి ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమెన్‌ నెతన్యాహు భారతీయ సంప్రదాయ దుస్తులు ధరించి కలిశారు. ఇది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇక ఎయిర్‌పోర్టులో నెతన్యాహు భార్య కాషాయ రంగు దుస్తులు ధరించి వచ్చింది. ఇలాంటి నేపథ్యంలో మోదీ పర్యటనపై ఒకవైపు సానుకూల విశ్లేషణలు వస్తుండగా కొందరు ఈ పర్యటనతో భారత్‌కన్నా ఎక్కువగా నెతన్యాహుకే లబ్ధి కలుగుతుందని అభిప్రాయపడుతున్నారు. మోదీ పర్యటన వెనుక రాజకీయ లక్ష్యాలు ఉన్నట్లు పేర్కొంటున్నారు.

Also Read: ఏ క్షణమైనా యుద్ధం నేపద్యంలో మోడీ ఇజ్రాయిల్ సాహస యాత్ర

సంబంధాల చారిత్రక మార్పు
గతంలో భారత్‌ – ఇజ్రాయెల్‌ మధ్య సంత్సంబంధాలు ఉండేవి కావు. పాలస్తీనాపై వ్యతిరేకత కారణంగా భారత్‌ ఇజ్రాయెల్‌ను దూరంగా ఉంచింది. అయితే పీవీ నర్సింహారావు పాలనలో దౌత్య సంబంధాలు ఏర్పడ్డాయి. బీజేపీ, సంఘ్‌ పరివార్‌ మొదటి నుంచి ఇజ్రాయెల్‌ అనుకూలంగా ఉనానయి. ఇజ్రాయెల్‌ ముస్లిం దేశాలకు వ్యతిరేకంగా యుద్ధాలు చేస్తుంది. అందుకే బీజేపీ, సంఘ్‌ ఇష్టపడతాయి.

మోదీ వచ్చాక బంధం బలోపేతం..
మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత రక్షణ, సాంకేతికతల్లో భారత్‌–ఇజ్రాయెల్‌ బంధం బలపడింది. తాజా పర్యటనలో ఇజ్రాయెల్‌ పార్లమెంట్‌ (క్నెసెట్‌)లో ప్రసంగం చారిత్రకం. అయితే, విపక్షం ప్రభుత్వ వ్యతిరేకతతో బహిష్కరణ ప్రకటించింది.

నెతన్యాహు రాజకీయ సంక్షోభం..
నెతన్యాహు బలహీన స్థితిలో ఉన్నారు. ఎన్నికలు జరిగితే ఓటమి అవకాశం ఎక్కువ. అవినీతి ఆరోపణలు, జుడీషియల్‌ సంస్కరణలపై ప్రతిపక్షుల వ్యతిరేకత, హమాస్‌ దాడి ముందు పదవి కోల్పోయే పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా వందకు పైగా దేశాలు వ్యతిరేకులు, సౌత్‌ ఆఫ్రికా అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు నుంచి అరెస్ట్‌ వారెంట్‌ కోరింది.

మోదీ పర్యటన వెనుక లక్ష్యాలు..
నెతన్యాహు మోదీ ఆహ్వానంతో తన ఇమేజ్‌ను మెరుగుపరచుకోవాలని భావించారు. భారత్‌ ప్రధాని సందర్శన ఆయనకు దేశీయ, అంతర్జాతీయ గౌరవాన్ని పెంచుతుంది. అయితే, ఇరాన్‌పై అమెరికా దాడి సందర్భంలో ఇజ్రాయెల్‌ మద్దతు, గల్ఫ్‌ దేశాల ఒత్తిళ్లు భారత్‌ను కష్ట పరిస్థితిలో ఉంచవచ్చు.

మోదీ పర్యటన భారత్‌ మధ్యప్రాచ్య వ్యూహాన్ని ప్రభావితం చేస్తుంది. ఇరాన్‌ వ్యతిరేక చర్యలకు మద్దతుగా కనిపించడం దీర్ఘకాలంలో దక్షిణ ఆసియా సంబంధాలను దెబ్బతీస్తుంది. రెండు దేశాల సహకారం లాభదాయకమైనా, భౌగోళిక రాజకీయాలు జాగ్రత్తలు పాటించాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper