Caribbean Islands To Miami: ఆదిమానవులు పురాతన కాలంలో దుస్తులు లేకుండా ఉండేవారు. ఈ స్థాయిలో మేధస్సు లేదు కాబట్టి నగ్నంగానే ఉండేవారు. ఆ తర్వాత ఆదిమానవులు నెమ్మది నెమ్మదిగా పరిణామ క్రమంలో ఎదిగారు.. మేధస్సును సంతరించుకొని విజ్ఞానవంతులుగా మారారు. నగ్నంగా ఉండడం సరైనది కాదని.. దుస్తులు వేసుకోవడం ప్రారంభించారు. ఆ తర్వాత దుస్తులు ధరించడంలోనూ సరికొత్త సాంకేతికతను ప్రదర్శించారు. అద్భుతమైన దుస్తులను ధరించి సరికొత్తగా కనిపించేవారు. నేటి ఆధునిక కాలంలో దుస్తులు అనేవి చాలామందికి నామోషీగా మారిపోయాయి. ఫ్యాషన్ పేరుతో చినిగిన దుస్తులను వేసుకోవడం పరిపాటిగా మారిపోయింది.
Also Read: వర్షం పడింది.. కండోమ్ ల కథ బయటపడింది
పాశ్చాత్య దేశాలలో..
పాశ్చాత్య దేశాలలో పనికిమాలిన పోకడలు ఎక్కువ. ఆధునికత పేరుతో ఈ దేశాలలో విశృంఖలం అధికంగా ఉంటుంది. ఆడ మగ అని తేడా లేకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటారు. అనైతిక కార్యకలాపాలకు కూడా పాల్పడుతుంటారు. పైగా అక్కడ చట్టాలు అలానే ఉంటాయి కాబట్టి ఎవరూ ఏమీ అనలేని పరిస్థితి. అయితే ఇది చూసే వాళ్లకు అత్యంత దారుణంగా ఉంటుంది. ముఖ్యంగా ఆదేశాలకు వెళ్లిన మనలాంటి వాళ్ళ పరిస్థితి అత్యంత ఇబ్బందికరంగా ఉంటుంది. కాకపోతే తప్పదు కాబట్టి చూస్తూ ఏమీ తెలియనట్లు వెళ్లిపోతుంటారు.
ముందుగానే చెప్పుకున్నట్టు పాశ్చాత్య దేశాలలో విపరీతమైన స్వేచ్ఛ ఉంటుంది. ఈ స్వేచ్ఛ ఆధారంగానే అక్కడ వందల కోట్ల వ్యాపారం సాగుతూ ఉంటుంది. అటువంటి వ్యాపారానికి ఓ సంస్థ శ్రీకారం చుట్టింది. దానికి ప్రపంచంలోనే అతిపెద్ద నగ్న యాత్ర అని పేరు పెట్టింది. కాకపోతే ఇది సముద్రం మీదగా సాగుతుంది. అతిపెద్ద బోటులో సముద్రం మీదుగా నగ్న యాత్ర కొనసాగుతుంది. ఇది ప్రతి ఏడాది ఫిబ్రవరి 9 నుంచి 20 మధ్యలో సాగుతుంది. అమెరికాలోని మియామీ నుంచి కరేబియన్ దీవుల చుట్టూ ఈ ప్రయాణం సాగుతూ ఉంటుంది. 11 రోజుల పాటు యాత్రికులు ఒంటిపై దుస్తులు లేకుండానే ప్రయాణిస్తుంటారు.. అయితే దీని వెనుక కారణం లేకపోలేదు.. వినోదం మాత్రమే కాకుండా.. తమ శరీరాన్ని ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించే భావన దీని ద్వారా కలుగుతుందని నిర్వాహకులు చెబుతుంటారు. ఇలా 11 రోజులపాటు నగ్నంగా ప్రయాణించాలంటే ఒక్కో ప్రయాణికుడు 43 లక్షలు చెల్లించాలి. అమెరికా చెందిన బేర్ నెసెసిటీస్ అనే లో దుస్తుల సంస్థ 1990 నుంచి ఈ ప్రయాణానికి శ్రీకారం చుట్టింది. ప్రతి ఏడాది ఈ యాత్రలో పాల్గొనే ప్రయాణికుల సంఖ్య పెరుగుతూనే ఉంది.. చివరికి కరోనా సమయంలోను ఈ యాత్రను నిర్వహించాలనే డిమాండ్ పర్యాటకుల నుంచి వచ్చిందంటే.. దీనికి ఉన్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.