Homeఅంతర్జాతీయంLashkar Terrorist Eliminated: ఒక్కరోజులోనే.. లష్కరే తోయిబా టాప్ కమాండర్ ను అజ్ఞాత సాయుధులు లేపేశారు..

Lashkar Terrorist Eliminated: ఒక్కరోజులోనే.. లష్కరే తోయిబా టాప్ కమాండర్ ను అజ్ఞాత సాయుధులు లేపేశారు..

Lashkar Terrorist Eliminated: ఎవరో వస్తున్నారు.. ముసుగులు ధరించి చూస్తుండగానే కాల్పులు జరుపుతున్నారు. వెంటనే మాయమైపోతున్నారు. సంఘటన స్థలంలోనే కొంతమంది వ్యక్తులు చనిపోతున్నారు. కాల్పులు జరిపింది ఎవరు.. అనే ప్రశ్నలకు సమాధానం లభించడం లేదు. చనిపోయిన వ్యక్తులు మాత్రం ఉగ్రవాదులు.. భయంకరమైన ఉగ్రవాదులు.. దీని వెనుక ఎవరు ఉన్నారు.. ఎవరు ఇదంతా చేస్తున్నారు.. ఈ ప్రశ్నలకు సమాధానం ముంజేతి కంకణమే అయినప్పటికీ.. జరుగుతున్న తీరు చూస్తే భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేసినవారు.. భారత దేశంలో అల్ల కల్లోలం సృష్టించిన […]

Lashkar Terrorist Eliminated: ఎవరో వస్తున్నారు.. ముసుగులు ధరించి చూస్తుండగానే కాల్పులు జరుపుతున్నారు. వెంటనే మాయమైపోతున్నారు. సంఘటన స్థలంలోనే కొంతమంది వ్యక్తులు చనిపోతున్నారు. కాల్పులు జరిపింది ఎవరు.. అనే ప్రశ్నలకు సమాధానం లభించడం లేదు. చనిపోయిన వ్యక్తులు మాత్రం ఉగ్రవాదులు.. భయంకరమైన ఉగ్రవాదులు.. దీని వెనుక ఎవరు ఉన్నారు.. ఎవరు ఇదంతా చేస్తున్నారు.. ఈ ప్రశ్నలకు సమాధానం ముంజేతి కంకణమే అయినప్పటికీ.. జరుగుతున్న తీరు చూస్తే భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేసినవారు.. భారత దేశంలో అల్ల కల్లోలం సృష్టించిన వారు నేల కొరికిపోతున్నారు.

మన శత్రుదేశం పాకిస్తాన్లో కొంతకాలంగా ప్రమాదకరమైన ఉగ్రవాద సంస్థలకు సంబంధించిన కమాండర్లు.. కీలక నాయకులు.. మతోన్మాదాన్ని పెంచి పోషించే వ్యక్తులు చనిపోతున్నారు. సాయుధులైన వ్యక్తుల చేతిలో తుపాకీ తూటాలకు నేలకొరిగి పోతున్నారు. వాస్తవానికి వీరంతా కూడా భారతదేశానికి వ్యతిరేకంగా పనిచేసేవారు. గతంలో మనదేశంలో దారుణమైన అల్లర్లు.. ఇతర గొడవలకు వీరంతా కారణమయ్యారు.. దారుణమైన మారణ హోమాన్ని సృష్టించారు. వీరి మీద ఎప్పటినుంచో భారత భద్రతా దళాలు దృష్టి సారించాయి. వీరిని అంతం చేయడానికి ఎన్నో సంవత్సరాలుగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సాధ్యం కావడం లేదు.

భారత్ భద్రతా దళాలు కాచుకొని కూర్చున్నప్పటికీ.. కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు సాయుదులుగా మారిపోయారు. వారంతా ఉగ్రవాదుల మీద దాడులు చేస్తున్నారు. అందరూ చూస్తుండగానే కాల్పులు జరుపుతున్నారు. ఇలా గత కొంతకాలంగా ఉగ్రవాదుల మీద కాల్పులు జరుపుతూ చంపేస్తున్నారు. తాజాగా పాకిస్తాన్లోని బలు చిస్తాను ప్రాంతంలోని క్వెటా ఏరియాలో లస్కర్ ఏ తోయిబా సీనియర్ కమాండర్ మీరు శుక్రకాన్ రైసాని అనే ఉగ్రవాదిని సాయుదులు హతమార్చారు. ఎల్ఈటీ నియామకాలు, తీవ్రవాద భావజాల వ్యాప్తి, శిక్షణ నెట్వర్క్ లో ఇతడికి కీలక వ్యక్తి. మన దేశానికి వ్యతిరేకంగా జరిగిన అనేక దాడులలో ఇతడు పాలుపంచుకున్నాడు. గురువారం ఇతడి మీద కాల్పులు చేరడానికి ఒకరోజు ముందు లష్కరే ఏ తోయిబా కార్యక్రమంలో పాల్గొన్నాడు. అతడు చనిపోయిన తర్వాత ఎప్పటి మాదిరిగానే పాకిస్తాన్ అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. వాళ్లకు తెలుసు చంపింది ఎవరో. కానీ బయటికి చెప్పలేదు. చెప్పినా ఉపయోగం ఉండదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper