Homeఅంతర్జాతీయంIran Vs US Israel Conflict Economic Impact: యుద్ధ వ్యూహం మార్చిన ఇరాన్‌.. కుప్పకూలుతున్న...

Iran Vs US Israel Conflict Economic Impact: యుద్ధ వ్యూహం మార్చిన ఇరాన్‌.. కుప్పకూలుతున్న ప్రపంచ మార్కెట్లు!

Iran Vs US Israel Conflict Economic Impact: ఇరాన్‌పై అమెరికా ఇజ్రాయెల్‌ విరుచుకుపడుతున్నాయి. ఇరాన్‌ కూడా శక్తిమేరకు పోరాడుతోంది. అయితే అమెరికా –ఇజ్రాయెల్‌ ముందు ఎంతో కాలం నిలబడే అవకాశం లేదు. ఆ విషయం ఇరాన్‌కు కూడా తెలుసు. అందుకే ఇరాన్‌ తన రక్షణ కోసం కొత్త వ్యూహం ఎంచుకుంది. తాను మునిగిపోయే పరిస్థితి వస్తే.. తనతోపాటు ప్రపంచ దేశాలన్నీ మునిగిపోవాలని భావిస్తోంది. లేదా మునిగిపోతాయనే భయమైనా కల్పించాలి. అందుకు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను […]

Iran Vs US Israel Conflict Economic Impact: ఇరాన్‌పై అమెరికా ఇజ్రాయెల్‌ విరుచుకుపడుతున్నాయి. ఇరాన్‌ కూడా శక్తిమేరకు పోరాడుతోంది. అయితే అమెరికా –ఇజ్రాయెల్‌ ముందు ఎంతో కాలం నిలబడే అవకాశం లేదు. ఆ విషయం ఇరాన్‌కు కూడా తెలుసు. అందుకే ఇరాన్‌ తన రక్షణ కోసం కొత్త వ్యూహం ఎంచుకుంది. తాను మునిగిపోయే పరిస్థితి వస్తే.. తనతోపాటు ప్రపంచ దేశాలన్నీ మునిగిపోవాలని భావిస్తోంది. లేదా మునిగిపోతాయనే భయమైనా కల్పించాలి. అందుకు ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను అల్లకల్లోలం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో భారత్‌తో సహా అనేక దేశాల్లో ద్రవ్యోల్బణాన్ని పెంచుతూ మార్కెట్లను కుప్పకూల్చింది.

Also Read: ‘ధురంధర్ 2’ లో మేజర్ ఇక్బాల్ క్యారెక్టర్ మిస్ చేసుకున్న తమిళ సూపర్ స్టార్ అతనేనా?

గెలవలేమని తెలిసి..
అమెరికా–ఇజ్రాయెల్‌ దాడులతో ఇరాన్‌ రక్షణ పరిస్థితి బలహీనపడినా, ఆ దేశం ప్రత్యాంతిక దాడుల ద్వారా ప్రతిఘటిస్తోంది. గల్ఫ్‌ ప్రాంతంలోని రిఫైనరీలు, గ్యాస్‌ కేంద్రాలు, ఎగుమతి ఓడరేవులపై దాడులు చేసి ఇంధన ప్రవాహాన్ని అడ్డుకుంటోంది. హర్మూజ్‌ జలసంధి మూసివేయడం వల్ల ప్రపంచ చమురు రవాణాలో 20% అడ్డంకి వచ్చింది, ఇది సౌదీ, యూఏఈ, ఖతార్‌ వంటి దేశాల ఆదాయాలను ప్రభావితం చేస్తోంది.

రెట్టింపైన చమురు ధరలు..
యుద్ధానికి ముందు ఆయిల్‌ ధర బ్యారెల్‌కు 60–70 డాలర్లు ఉండగా, ప్రస్తుతం 100–117 డాలర్లకు చేరాయి. అంటే దాదాపు రెట్టింపయ్యాయి. ఈ ఊగిసలు హార్మూజ్‌ ఆంక్షలు, గల్ఫ్‌ దాడుల వల్లే వచ్చాయి, ప్రపంచ సరఫరా గొలుసులను స్తంభించేశాయి. ఫలితంగా ఇండియా, చైనా, పాకిస్తాన్‌లో ఇంధన కొరత ఏర్పడి, పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరిగాయి. యురోపియన్‌ యూనియన్‌పైనా ప్రభావం పడుతోంది.

ఆర్థిక పరిణామాలు
ఇంధన ధరల పెరుగుదల వస్తువుల ధరలను, రవాణా ఖర్చులను పెంచుతూ ద్రవ్యోల్బణాన్ని రెక్కిపెట్టింది. భారత మార్కెట్‌లో 240 బిలియన్‌ డాలర్లు ఇన్వెస్టర్ల సొమ్ము తుడిచిపెట్టుకుపోయింది. రూపాయి విలువ ఆల్‌టైం కనిష్టానికి 93కు పడిపోవడం దీని ప్రభావాలు. ప్రపంచవ్యాప్తంగా స్టాక్‌ మార్కెట్లు పతనం, ఎఈ్క పెరుగుదల మందగించడం జరుగుతున్నాయి, ఇది సామాన్య ప్రజల జీవన ఖర్చును భారపరుస్తోంది.

భారత్‌పై ప్రభావం
భారత్‌ దిగుమతి చమురుపై ఆధారపడటం వల్ల ఇంధన, విద్యుత్, వ్యవసాయ, పరిశ్రమలు దెబ్బతింటున్నాయి. ఆహారం, పారిశ్రామిక ఉత్పత్తుల ధరలు పెరిగి ద్రవ్యోల్బణం 5–8%కు చేరే అవకాశం ఉంది. ప్రభుత్వం రిజర్వులు, పునరుత్పాదక ఇంధనాలపై దృష్టి పెట్టాలి.

ఇరాన్‌ వ్యూహం ప్రపంచ దేశాలను పరోక్షంగా అమెరికాపై ఒత్తిడి చేయడానికి ఉపయోగపడుతోంది. దీర్ఘకాలంగా ఇంధన వైవిధ్యత, డిప్లొమసీ అవసరం. లేకపోతే ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రమవుతుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper