Homeఎంటర్టైన్మెంట్Dhurandhar 2: దురంధర్ -2ను బాలీవుడ్ తట్టుకోలేకపోతోందా? బాలీవుడ్ పెద్దలు గతంలో చేసుదేంటి?

Dhurandhar 2: దురంధర్ -2ను బాలీవుడ్ తట్టుకోలేకపోతోందా? బాలీవుడ్ పెద్దలు గతంలో చేసుదేంటి?

Dhurandhar 2: దురంధర్ -2 అంచనాలకు మించి ఆడుతోంది. బాక్సాఫీస్ లెక్కలను మొత్తం తారుమారు చేస్తోంది. సినీ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురి చేసే విధంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ చూసినా సరే దురంధర్ 2 సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్లు జన జాతరను తలపిస్తున్నాయి. Also Read: ‘ధురంధర్ 2’ లో మేజర్ ఇక్బాల్ క్యారెక్టర్ మిస్ చేసుకున్న తమిళ సూపర్ స్టార్ అతనేనా? దురంధర్ 2 సినిమా ఇండియన్ […]

Dhurandhar 2: దురంధర్ -2 అంచనాలకు మించి ఆడుతోంది. బాక్సాఫీస్ లెక్కలను మొత్తం తారుమారు చేస్తోంది. సినీ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురి చేసే విధంగా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడ చూసినా సరే దురంధర్ 2 సినిమాను ప్రదర్శిస్తున్న థియేటర్లు జన జాతరను తలపిస్తున్నాయి.

Also Read: ‘ధురంధర్ 2’ లో మేజర్ ఇక్బాల్ క్యారెక్టర్ మిస్ చేసుకున్న తమిళ సూపర్ స్టార్ అతనేనా?

దురంధర్ 2 సినిమా ఇండియన్ సినిమా చరిత్రలోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో కొంతమంది కుహనా లౌకికవాదులు తెరపైకి వచ్చారు. సినిమా గురించి అడ్డగోలుగా మాట్లాడుతున్నారు. ఈ సినిమా కొంతమంది వ్యక్తుల మనోభావాలను దెబ్బతీసిందని పేర్కొంటున్నారు. దురంధర్ 2 సినిమా అనేది ఒక ప్రాపగాండా అని.. ఆరోపిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమాను ప్రాపగాండా అనుకుంటే.. దశాబ్దాల బాలీవుడ్ చరిత్రను ఒకసారి పరిశీలిస్తే.. ఎవరిని ఎవరు టార్గెట్ చేశారు.. మెజారిటీ వ్యక్తుల సమూహాన్ని ఎలా దెబ్బతీశారో అర్థమవుతుంది..

ఫైర్

ఈ సినిమా ఒక నవల ఆధారంగా తీశారు. ఆ నవలలో పాత్రల పేర్లు బేగం జాన్, రబ్బో.. అయితే సినిమాలో మాత్రం వాటికి రాధ, సీత అని పేరు పెట్టారు .

షేర్ని

ఈ సినిమా ఫారెస్ట్ ఆఫీసర్ కె ఎం అభర్ణ జీవిత చరిత్ర ఆధారంగా తీశారు. ఫారెస్ట్ ఆఫీసర్ అభర్ణ జీవిత వృత్తాంతంలో అస్గర్ అలీ అనే వేటగాడు ఉన్నాడు . అభర్ణ రియల్ లైఫ్ లో వృత్తాంతాలను సినిమాటిక్ గా చూపించారు.. ఆ సినిమాకు షేర్ని అని పేరు పెట్టారు..ఆ సినిమాలో మాత్రం ఆఫీసర్ పేరు విద్యా విన్సెంట్ అని మార్చారు. విలన్ పేరు రంజన్ రాజ్ హంస్ అని పేర్కొన్నారు.

పీకే

ఈ సినిమా లో శివుడు భయంతో పరుగులు తీస్తున్నట్టుగా చూపించారు. వాస్తవానికి శివుడు అనేవాడు ధైర్యానికి ప్రతిరూపం. అతడు లయకారుడు కూడా. అతడు లేనిది సృష్టి లేదు. కానీ ఈ సినిమాలో శివుడు అనేవాడు పిరికివాడు అన్నట్టుగా చూపించారు.

చెక్ ద ఇండియా

ఈ సినిమా రియల్ లైఫ్ కోచ్ రంజన్ నేగి. కానీ ఈ సినిమాలో మాత్రం షారుక్ ఖాన్ పాత్రకు కబిర్ ఖాన్ అని పేరు పెట్టారు. అన్యాయానికి గురైన ఒక ముస్లిం యువకుడిగా కబీర్ ఖాన్ ను చూపించారు.

రామ్ తేరీ గంగా మైలి

ఈ సినిమాలో ఒక పండితుడు కథానాయికపై దారుణానికి పాల్పడతాడు. ఆ తర్వాత అతడు ఓం నమశ్శివాయ అంటూ మంత్రాన్ని జపిస్తుంటాడు.

దివార్

ఈ సినిమాలో హీరో ఒక గుడికి వెళుతుంటాడు. అక్కడికి వెళ్లి తనకు దేవుడి మీద నమ్మకం లేదని చెప్తుంటాడు. అయితే అతడి చేతికి మాత్రం 786 అనే సింబల్ ఉన్న బిళ్ళను కట్టుకుంటాడు. 786 నెంబర్ అనేది దేనికి ప్రతీకనో చెప్పాల్సిన అవసరం లేదు.

మదర్ ఇండియా

ఈ సినిమాలో విలన్ పేరు సుఖీలాలా.. అతడు హీరోయిన్ ను వేధించడానికి ముందు దేవి మాత ను మనసులో నిత్యం తలచుకుంటాడు.

రెడీ

ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ ఒక వ్యక్తి జుట్టును కత్తిరిస్తుంటాడు.. జుట్టు మాత్రమే కదా కత్తిరిస్తున్నాం.. సున్నితి చేయడం లేదు కదా అంటూ డైలాగ్ వదులుతాడు.

దబాంగ్

ఈ సినిమాలో విలన్ పేరు చెది సింగ్.. అతడు చుల్బుల్ పాండేను చంపాలని తన మనుషులకు ఆదేశాలు జారీ చేస్తాడు. దానికంటే ముందు హనుమంతుడికి పూజలు చేస్తుంటాడు.

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్

ఈ సినిమాలో హీరోయిన్ చేసిన ఒక పాట చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సె** రాధాబాడీ అనే పాటకు డ్యాన్స్ చేస్తూ ఉంటుంది.. ఆ పాట వచ్చినంతసేపు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే బాలీవుడ్ పెద్దలు చేసిన నెగటివ్ ప్రాపగాండ మామూలుది కాదు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper