Homeఅంతర్జాతీయంQatar helicopter crash: ఇరాన్‌కు పాకిస్తాన్‌ అణు సహకారం.. ఖతార్‌ హెలిక్యాప్టర్‌ క్రాష్‌తో గుట్టు రట్టు!

Qatar helicopter crash: ఇరాన్‌కు పాకిస్తాన్‌ అణు సహకారం.. ఖతార్‌ హెలిక్యాప్టర్‌ క్రాష్‌తో గుట్టు రట్టు!

Qatar helicopter crash: ఇరాన్‌ అణు కార్యకలాపాలు చేస్తోందని, ఉగ్రవాదుతను తయారు చేసి అమెరికా, ఇజ్రాయెల్‌పై దాడులకు ప్రణాళిక రూపొందిస్తోందని అగ్రరాజ్యం అమెరికా భావించింది. దీంతో అణ్వస్త్ర కార్యకలాపాలు ఆపాలని ఆదేశించింది. చర్చలు జరిపింది. కానీ, ఇరాన్‌ అంగీకరించలేదు. దీంతో యుద్ధం మొదలు పెట్టింది. 22 రోజులుగా దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియా రగులుతోంది. అయితే ఇరాన్‌ అణ్వస్త్ర తయారీకి పాకిస్తాన్‌ అణు నిపుణులు సహకరిస్తున్న విషయం బయటపడింది. ఖతార్‌ విమానంలో తరలిస్తుండగా అది కూలిపోయింది. ఆరుగురు పాక్‌ […]

Qatar helicopter crash: ఇరాన్‌ అణు కార్యకలాపాలు చేస్తోందని, ఉగ్రవాదుతను తయారు చేసి అమెరికా, ఇజ్రాయెల్‌పై దాడులకు ప్రణాళిక రూపొందిస్తోందని అగ్రరాజ్యం అమెరికా భావించింది. దీంతో అణ్వస్త్ర కార్యకలాపాలు ఆపాలని ఆదేశించింది. చర్చలు జరిపింది. కానీ, ఇరాన్‌ అంగీకరించలేదు. దీంతో యుద్ధం మొదలు పెట్టింది. 22 రోజులుగా దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియా రగులుతోంది. అయితే ఇరాన్‌ అణ్వస్త్ర తయారీకి పాకిస్తాన్‌ అణు నిపుణులు సహకరిస్తున్న విషయం బయటపడింది. ఖతార్‌ విమానంలో తరలిస్తుండగా అది కూలిపోయింది. ఆరుగురు పాక్‌ అణు శాస్త్రవేత్తలు మరణించారు. అయితే ఈ ఘటనపై మూడు వాదనలు వినిపిస్తున్నాయి.

ఇరాన్‌ లేపేసిందా?
అణుశాస్త్రవేత్తలను పాకిస్తాన్‌ స్వదేశం తీసుకురావడానికి ఖతార్‌ హెలిక్యాప్టర్‌ను ఇరాన్‌కు పంపింది. అణుశాస్త్రవేత్తలతో బయల్దేరిన హెలిక్యాప్తర్‌ను ఇరాన్‌ పేల్చివేసినట్లు ప్రచారం జరగుతోంది. యుద్ద సమయంలో అందుబాటులో ఉండకుండా వెళ్లిపోతున్నారని ఇలా చేసినట్లు సమాచారం.

మొసాద్‌ ఏజెంట్లుగా..?
ఇక మరో వాదన పాకిస్తాన్‌ అణుశాస్త్రవేత్తలు ఇజ్రాయెల్‌కు చెందిన ఇంటలిజెన్స్‌ ఏజెన్సీ మోసాద్‌కు ఏజెంట్లుగా పనిచేశారని సమాచారం. ఇరాన్‌లోని అణు రహస్యాలు, కీలక పత్రాలతో ఖతార్‌ హెలిక్యాప్టర్‌లో వెళ్లిపోతుండగా, సమాచారం అందిన ఇరాన్‌ దానిని కూల్చినట్లు సమాచారం.

Also Read: ఇరాన్‌ దెబ్బ అదుర్స్‌.. యుద్ధంతో ఆగ్రరాజ్యానికి రూ.7,520 కోట్ల నష్టం!

రష్యాకు తరలిస్తుండగా..
ఇక మరో వాదన ఏమిటంటే.. ఇరాన్‌ తన అణు రహస్యాలు తెలిసిన శాస్త్రవేత్తలు సురక్షితంగా ఉండాలని, వారిని ఖతార్‌ విమానంలో రష్యాకు తరలించే ప్రయత్నం చేసింది. ఈ సమాచారం తెలిసిన అమరికా–ఇజ్రాయెల్‌ దాడిచేసి హెలిక్యాప్టర్‌ను కూల్చినట్లు ప్రచారం జరుగుతోంది.

అణు స్థావరాల్లో పాకిస్తాన్‌ కీలక పాత్ర..
ఇరాన్‌ అణు కార్యక్రమంలో పాకిస్తానీ శాస్త్రవేత్తలు కీలకంగా పనిచేస్తున్నారని తాజాగా అసలు విషయం బయటపడింది. పాకిస్తానీ నిపుణులు ఇరాన్‌ అణుస్థావరాల్లో అభివృద్ధి, రక్షణ వ్యవస్థల్లో పనిచేశారని నిర్ధారణ అయింది. వీరి జ్ఞానం ఇరాన్‌ అణ్వస్త్ర క్షిపణులు, యురేనియం సుధీకరణకు కీలకం. అంతర్జాతీయ సంస్థలు ఈ ఆరోపణలపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది.

ఈ సంఘటన పాకిస్తాన్‌కు ఒత్తిడి పెంచింది, ఇరాన్‌ అణు కార్యక్రమాన్ని మరింత రహస్యంగా చేసింది. మొసాద్‌ ఆపరేషన్లు ఇరాన్‌ శాస్త్రవేత్తలపై దాడులను వేగవంతం చేశాయి. రష్యా, చైనా ఇరాన్‌కు మద్దతు పెంచే అవకాశం ఉంది. ప్రాంతీయ భద్రతకు ఇది కొత్త సవాలుగా మారింది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper