Homeఅంతర్జాతీయంIran attack impact economic loss: ఇరాన్‌ దెబ్బ అదుర్స్‌.. యుద్ధంతో ఆగ్రరాజ్యానికి రూ.7,520 కోట్ల...

Iran attack impact economic loss: ఇరాన్‌ దెబ్బ అదుర్స్‌.. యుద్ధంతో ఆగ్రరాజ్యానికి రూ.7,520 కోట్ల నష్టం!

Iran attack impact economic loss: పశ్చిమాసియాలో అగ్గి రాజేసిన అమెరికా రాంగ్‌ స్టెప్‌ వేశామా అని ఇప్పుడు మదన పడుతోంది. ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై చేస్తున్న యుద్ధం 22 రోజులు అయినా కొలిక్కి రాలేదు. వారం పది రోజుల్లో ముగిస్తామనుకున్న యుద్ధం… సుదీర్ఘంగా కొనసాగుతోంది. ఇంకా ఎంతకాలం కొనసాగుతుందో తెలియడం లేదు. మరోవైపు ప్రచంచాన్ని చమురు సంక్షోభం చుట్టుముడుతోంది. 22 రోజుల తర్వాత కూడా ఇరాన్‌ తన దాడులను తగ్గించడం లేదు. ముఖ్యంగా గల్ఫ్‌ దేశాల్లోని […]

Iran attack impact economic loss: పశ్చిమాసియాలో అగ్గి రాజేసిన అమెరికా రాంగ్‌ స్టెప్‌ వేశామా అని ఇప్పుడు మదన పడుతోంది. ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్‌పై చేస్తున్న యుద్ధం 22 రోజులు అయినా కొలిక్కి రాలేదు. వారం పది రోజుల్లో ముగిస్తామనుకున్న యుద్ధం… సుదీర్ఘంగా కొనసాగుతోంది. ఇంకా ఎంతకాలం కొనసాగుతుందో తెలియడం లేదు. మరోవైపు ప్రచంచాన్ని చమురు సంక్షోభం చుట్టుముడుతోంది. 22 రోజుల తర్వాత కూడా ఇరాన్‌ తన దాడులను తగ్గించడం లేదు. ముఖ్యంగా గల్ఫ్‌ దేశాల్లోని అమెరికా బేస్‌లను టార్గెట్‌ చేస్తోంది. దీంతో అగ్రరాజ్యం తీవ్రంగా నష్టపోతోంది. యుద్ధం ప్రారంభమైన మొదటి రెండు వారాల్లోనే అగ్రరాజ్యాం రూ.7,520 కోట్లు నష్టపోయినట్లు బీబీసీ, సీఎస్‌ఐఎస్‌(సెంటర్‌ ఫర్‌ స్ట్రాటజిక్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ స్టడీస్‌) నివేదికలు వెల్లడించాయి. ఇటువంటి దాడులు అమెరికా రక్షణ సాంకేతికత లోపాలను, ఇరాన్‌ ఆయుధ శక్తిని ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం చేశాయి.

కీలక స్థావరాలపై ఇరాన్‌ దాడులు..
ఇరాన్‌ దళాలు జోర్డాన్, ఇరాక్, సిరియాలో ఉన్న అమెరికా సైనిక ప్రాంతాలను లక్ష్యంగా దాడులు చేశాయి. అమెరికా ప్యాట్రియట్, థాడ్‌ వ్యవస్థలను అధిగమించే వేగవంతమైనహైపర్‌సోనిక్‌ క్షిపణులతో ఇరాన్‌ దాడిచేసింది. తక్కువ ఎత్తులో ప్రయాణించి రాడార్‌లను మోసం చేసే షాహెద్‌–136 డ్రోన్‌లతో అమెరికాకు ఎక్కువ నష్టం కలిగించింది. ఇరాన్‌ జరిపిన దాడుల్లో 20 విజయవంతమయ్యాయి. జోర్డాన్‌లో అల్‌ – ఉదేస్‌కు సమీపంలో రాడార్‌ వ్యవస్థలు పూర్తిగా కుప్పకూలాయి.

Also Read: హర్మూజ్‌ ఓపెన్‌.. వారికి నో పర్మిషన్‌!

నష్టాలు ఇలా..
ఇరాన్‌ జరిపిన దాడుల్లో అమెరికాకు చెందిన థాడ్‌ రాడార్‌ ధ్వంసమైంది. దీంతో రూ.4,200 కోట్లు నష్టపోయింది. జోర్డాన్‌ ప్రధాన యూనిన్‌ నాశనమైంది. పునరుద్ధణకు రెండేళ్లు పట్టే అవకాశం ఉంది. ఇక ఇతర రక్షణ పరికరాలు ధ్వంసం కావడంతో రూ.1,800 కోట్లు నష్టపోయింది. వాహనాలు, ఇతర ఆస్తులు దెబ్బతినడంతో మరో రూ.1,520 కోట్లు నష్టం జరిగింది.

ఈ దాడులు అమెరికా రక్షణ బడ్జెట్‌ను 20% పెంచేలా చేయవచ్చు. ఇరాన్‌ డ్రోన్‌ సాంకేతికత హోతీలు, ఇతర సమూహాలకు మార్గదర్శకంగా మారింది. ప్రాంతీయ యుద్ధ స్థితిలోకి జారడానికి అవకాశం ఉంది. మధ్యప్రాచ్య భౌగోళిక రాజకీయాలు మారే అవకాశం ఉంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper