pitru karma : కాకిని చూడగానే చాలామందికి భయం వేస్తుంది. ఎందుకంటే కాకి ఇంట్లోకి వస్తే అరిష్టమని భావిస్తారు. అలాగే ఇంటిముందు కాకి అరిచినా ఏదో ఆశుభం జరుగుతుందని అనుకుంటారు. కానీ చనిపోయిన వారికి పిండాలు పెట్టే సమయంలో కాదు కోసం ఎదురుచూస్తూ ఉంటారు. కాకులకు పిండం పెట్టడం వల్ల పూర్వీకులు సంతోషిస్తారని భావిస్తారు. అయితే కాకులకు మాత్రమే పిండం ఎందుకు పెట్టాలి? ఇతర పక్షులకు ఎందుకు పెట్టకూడదు? అనే సందేహం చాలామందికి వస్తుంది. ఆ వివరాల్లోకి వెళితే..
ప్రస్తుత కాలంలో వాతావరణ కాలుష్యం కారణంగా పక్షులు ఎక్కడ ఎక్కువగా కనిపించడం లేదు. అంతేకాకుండా రేడియేషన్ ఎక్కువగా మారడంతో కొన్ని పక్షులు కనుమరుగవుతున్నాయి. వీటిలో కాకులు కూడా ఉన్నాయి. ఎవరైనా చనిపోతే వారికి 3, 5, 11వ రోజుల్లో పిండ ప్రధానం చేస్తూ ఉంటారు. అంతేకాకుండా కాకి వచ్చి ముట్టే దాకా అక్కడి నుంచి కదలరు. కాకికి ఎంత ప్రాధాన్యత ఉందో కొన్ని సినిమాల్లో ప్రత్యేకంగా కూడా చూపించారు. అయితే ఖాకీ మాత్రం నెత్తి మీద వాలిన లేదా ఇంట్లోకి వచ్చిన హరిష్టమని బాధపడుతూ ఉంటారు. అయితే కాకులకు మాత్రమే పిండాలు ఎందుకు పెడతారంటే.. దీనికి ఓ చరిత్ర ఉంది..
పూర్వకాలంలో రామాయణం సమయంలో రావణుడు దేవతలను బాధపెట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రావణుడి భయానికి దేవతలు జంతువుల రూపంలో మారిపోతూ ఉంటారు. ఇంద్రుడు లేడి రూపంలో మారిపోగా.. వరుణుడు నెమలి రూపంలో మారిపోతాడు. అయితే యముడు కాకి పక్షిలో చేరిపోతాడు. ఆ తర్వాత బయటకు వచ్చినంక ఆయా జంతువులకు దేవతలు వరాలు ఇస్తూ ఉంటారు. లేటుగా మారినా ఇంద్రుడు.. బయటకు వచ్చిన తర్వాత అందంగా కనిపించే వరం ఇచ్చాడు. అలాగే వర్షం పడిన సమయంలో పించం విప్పేలా నెమలికి అవకాశం ఇచ్చాడు.
ఇక కాకికి యముడు అరుదైన వరం ఇస్తాడు. ఒకరి ఇంట్లో ఎవరైనా చనిపోతే వారు స్వర్గానికి వెళ్లాలంటే వారి పిండ ప్రధానం పుడితే ఫలితం ఉంటుందని కాకికి వరం ఇస్తాడు. అందువల్ల పిండ ప్రకారం చేసే సమయంలో ఖాకీ ముడితే తమ పూర్వికులు స్వర్గానికి వెళ్తారని అనుకుంటారు. అయితే కాకికి ఈ వరం రావడానికి మరో కథ ఉంది. రాముడు ఒక భక్తుడికి.. మీ పూర్వీకులు కాకి రూపంలో సంచరిస్తారని.. వారికి ఆహారం పెడితే ఫలితం ఉంటుందని చెబుతాడు. అందువల్ల ఈ రకంగా కూడా ఆలోచించి కాకులకు పిండ ప్రధానం చేస్తూ ఉంటారు.
అయితే కాకులకు యముడు మరో మరణం కూడా ఇచ్చాడు. కాకి బాలవర్మనం తప్ప స్వతహాగా మరణించే అవకాశం లేదని వరం కూడా ఇచ్చాడు. అందువల్ల కాకులు కూడా ఎంతో మేలు చేస్తాయని కొందరు చెబుతూ ఉంటారు. అయితే ప్రస్తుత కాలంలో మాయమవుతున్న కాకులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కొందరు పక్షి ప్రేమికులు చెబుతున్నారు. వీటికి కేవలం పిండ ప్రధాన సమయంలోనే కాకుండా సాధారణ సమయాల్లో కూడా ఆహారాన్ని అందించాలని అంటున్నారు.