Homeఅంతర్జాతీయంIndia Pakistan Water Dispute: పాకిస్తాన్ కు గట్టి షాక్ ఇచ్చిన భారత్.. కోలుకోవడం కష్టమే...

India Pakistan Water Dispute: పాకిస్తాన్ కు గట్టి షాక్ ఇచ్చిన భారత్.. కోలుకోవడం కష్టమే ఇక

India Pakistan Water Dispute: పహల్గాంలో పర్యాటకులపై 2025 ఏప్రిల్‌లో పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది మరణించారు. దీంతో భారత్‌ కఠిన నిర్ణయాలు తీసుకుంది. 1960లో పాకిస్తాన్‌తో చేసుకున్న సిందూ జలాల ఒప్పందాన్ని భారత్‌ హోల్డ్‌లో పెట్టింది. దీంతో ఏడాది కాలంగా పాకిస్తాన్‌కు అవసరం ఉన్నప్పుడు నీళ్లు ఇవ్వడం లేదు.. అవసరం లేనప్పుడు నీళ్లు వదులుతూ వరదలు సృష్టిస్తోంది. దీంతో పాకిస్తాన్‌లో కరువు చాయలు ఏర్పడుతున్నాయి. దీంతో అంతర్జాతీయ వేదికలుగా పాకిస్తాన్‌ గగ్గోలు […]

India Pakistan Water Dispute: పహల్గాంలో పర్యాటకులపై 2025 ఏప్రిల్‌లో పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 26 మంది మరణించారు. దీంతో భారత్‌ కఠిన నిర్ణయాలు తీసుకుంది. 1960లో పాకిస్తాన్‌తో చేసుకున్న సిందూ జలాల ఒప్పందాన్ని భారత్‌ హోల్డ్‌లో పెట్టింది. దీంతో ఏడాది కాలంగా పాకిస్తాన్‌కు అవసరం ఉన్నప్పుడు నీళ్లు ఇవ్వడం లేదు.. అవసరం లేనప్పుడు నీళ్లు వదులుతూ వరదలు సృష్టిస్తోంది. దీంతో పాకిస్తాన్‌లో కరువు చాయలు ఏర్పడుతున్నాయి. దీంతో అంతర్జాతీయ వేదికలుగా పాకిస్తాన్‌ గగ్గోలు పెడుతోంది. తాజాగా ఐక్యరాజ్యసమితిలో ఈ విషయంలో పాకిస్తాన్‌కు భారత్‌ షాక్‌ ఇచ్చింది. భారత్‌ శాశ్వత ప్రతినిధి హరీశ్‌ మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని పూర్తిగా వదులుకోనంత వరకు సింధు జలాల ఒప్పందం పునరుద్ధరణ జరగదని స్పష్టం చేశారు. ప్రపంచ నీటి దినోత్సవ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేస్తూ భారత్‌ తాగునీటి అభివృద్ధిపై పురోగతిని ప్రదర్శించింది.

Also Read: అసెంబ్లీలో ‘గులాబీ’ ఫైట్: కెప్టెన్ కేసీఆర్ లేని గ్రౌండ్.. రేవంత్ ‘సిక్స్’ల పండగ!

ఒప్పంద నిలిపివేత నేపథ్యం
1960లో కుదురిన సింధు జలాల ఒప్పందం భారత్‌పై ఉన్న బాధ్యతలను పాక్‌ యుద్ధాలు, ఉగ్రకార్యకలాపాలు భంగపరచాయని హరీశ్‌ తెలిపారు. గతేడాది ఏప్రిల్‌ 22న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పాక్‌ మూలాల దాడిలో 26 మంది టూరిస్టులు మరణించారు. దీనికి ప్రతిగా భారత్‌ ఒప్పందాన్ని తాత్కాలికంగా ఆపేసింది, పాక్‌ నీటి సరఫరా ఆపేసింది.

ఆపరేషన్‌ సిందూర్‌ ఫలితాలు
పహల్గామ్‌ దాడికి ప్రతీకారంగా మే 7–10 మధ్య భారత్‌ పాక్‌లోని 9 ఉగ్రవాద కేంద్రాలను ధ్వంసం చేసింది. ముజఫరాబాద్‌లోని సవాయ్‌ నాలా, సిడ్నా బిలాల్‌ క్యాంపులు, కోట్లీలో గుల్‌ పూర్, అబ్బాస్, భీంబర్‌లో బర్నాలా, సియాల్‌కోట్‌లో సర్జాల్, మెహమూనా జోయా, మురిడ్‌కేలో మార్కాజ్‌ టైబా, బహావల్‌పూర్‌లో మార్కాజ్‌ సుభానల్లా క్యాంపులు లక్ష్యాలుగా మారాయి. వందల మంది ఉగ్రవాదులు హతమయ్యారు.

భారత్‌ నీటి విధానంలో మార్పు
సిందూ జలాల ఒప్పంద మార్పులు కోరినా పాక్‌ తిరస్కరించడం, ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం వల్ల భారత్‌ సార్వభౌమ నిర్ణయంగా మొత్తం ఒప్పందాన్నే హోల్డ్‌లో పెట్టింది. పాక్‌ వ్యవసాయ రంగం దెబ్బతింటోంది, ప్రపంచ దేశాల చుట్టూ తిరుగుతోంది. భారత్‌లో ’జల్‌ జీవన్‌ మిషన్‌’ ద్వారా తాగునీటి సరఫరా మెరుగుపడుతోంది.

సింధు జలాలు ఆగడంతో పాక్‌ వ్యవసాయం, ఆర్థికం కుప్పకూలే ప్రమాదం. ఉగ్రవాద మౌలిక సదుపాయాలను తొలగించాలని భారత్‌ షరతు విధించింది. పాక్‌ అంతర్జాతీయ సంస్థల సహాయం కోరుతోంది. ఈ నిర్ణయం రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను మరింత పెంచుతోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper