Homeఅంతర్జాతీయంIndo Nepal Border Issues: అక్రమ చొరబాట్లకు అడ్డాగా భారత్‌–నేపాల్‌ బార్డర్‌.. దేశ భద్రతకు ముప్పు

Indo Nepal Border Issues: అక్రమ చొరబాట్లకు అడ్డాగా భారత్‌–నేపాల్‌ బార్డర్‌.. దేశ భద్రతకు ముప్పు

Indo Nepal Border Issues: భారత్‌–నేపాల్‌ సరిహద్దు ఇప్పటికే స్నేహపూర్వక రాకపోకలకు ప్రసిద్ధి చెందినప్పటికీ, ఇటీవల అక్రమ చొరబాట్లు, స్మగ్లింగ్‌ కార్యకలాపాలు దాని సురక్షితత్వాన్ని సవాలు చేస్తున్నాయి. తూర్పు చంపారన్‌లోని 114 కిలోమీటర్ల సరిహద్దు ప్రాంతంలో ఈ సమస్యలు తీవ్రంగా బయటపడ్డాయి. ఇది జాతీయ భద్రతకు ముప్పుగా మారుతోంది.

సరిహద్దు లక్షణాలు
ఈ 1,751 కిలోమీటర్ల సరిహద్దు పాస్‌పోర్టు లేకుండా స్వేచ్ఛా ప్రయాణానికి అనుకూలం. ఉగ్రవాదం, అక్రమ వలసలతో పోలిస్తే ఇక్కడ సైనిక నిగ్రహం తక్కువ. కానీ దక్షిణ నేపాల్‌ నుంచి భారత్‌లోకి చొరబాట్లు పెరిగాయి. తూర్పు చంపారన్‌ సీఎస్‌ సమీక్షలో గతేడాది 25 మంది, 4 ఏళ్లలో 41 మంది విదేశీయులు (పాక్, బంగ్లా, శ్రీలంక, యూఏఈకి చెందిన)వారు అక్రమంగా నేపాల్‌– భారత్‌ సరిహద్దుగుండా చొరబడ్డారు.

బార్డర్‌ పిల్లర్లు ధ్వంస..
చంపారన్‌ జిల్లాలో 114 కిలోమీటర్ల పొడవునా 1,237 పిల్లర్లు ఉన్నాయి. వీటిలో 931 సురక్షితం. 73 పూర్తి ధ్వంసం అÄయయి. 121 సమీపంలో చొరబాట్లు. రక్షౌ ల్, సికర్నా ప్రాంతాల్లో 34 ఎంక్రోచ్‌మెంట్లు, 117 అక్రమ నివాసాలు గుర్తించబడ్డాయి. మిగిలిన 4 తొలగించే ప్రక్రియలో ఉన్నాయి. ఈ లోపాలు పాక్‌ ఉగ్రవాదులకు అవకాశం కల్పిస్తున్నాయని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.

అక్రమ కార్యకలాపాలు
2022–2026 మధ్య భారీ అక్రమ మద్యం, 10 నకిలీ నోట్ల కేసులు నమోదు. అక్రమ మదరసాలు, మసీదుల నిర్మాణాలు పెరుగుతున్నాయి. శాటిలైట్‌ ఫోన్ల తరలింపు కూడా ఆందోళనకరం: జమ్మూ కశ్మీర్‌లో అమెరికన్‌ జంట, పుదుచ్చేరిలో అమెరికన్, చైనా పౌరులు అనుమతి లేకుండా తీసుకొచ్చారు. ఇవి భద్రతా బెదిరింపులుగా పరిగణించబడుతున్నాయి. బిహార్‌లో సమ్రాట్‌ చౌదరి ప్రభుత్వం ఈ సమీక్ష తర్వాత కట్టుదిట్టమైన చర్యలు ప్రకటించింది. భారత్‌–నేపాల్‌ సరిహద్దు సురక్షా విధానాలు బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది.

దేశంలోకి శాటిలైట్‌ ఫోన్లు తీసుకుని వచ్చి అమెరికా పౌరుడు, గర్ల్‌ప్రెండ్‌ జమూ కశ్మీర్‌లో దిగారు. వారివద్ద శాటిలైట్‌ ఫోన్‌ ఉంది. అనుమతి లేకుండా వాడారు. పుదుచ్చేరిలో అమెఇరకా పౌరుడు శాటిలైట్‌ ఫోన్‌తో పట్టుపడ్డాడు. చైనీయులు కూడా దేశంలోకి శాటిలైట్‌ ఫోన్లు తరలిస్తూ పట్టుపడ్డాడు. 114 కిలోమీటర్ల బార్డర్‌లో అనేక కార్యకలాపాలు సాగుతున్నాయి. 2022 నుంచి 2026 మధ్య భారీగా అక్రమ మద్యం కేసులు, పది నకిలీ నోట్ల చెలామణి కేసులు నమోదుచేశారు. బార్డర్‌ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని ఈ సమాచారం చెబుతుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular