Homeఅంతర్జాతీయంScratching Business in China: గోకుడు కూడా ఒక వ్యాపారమే.. ఇతడు నెలకు ఎంత సంపాదిస్తున్నాడో...

Scratching Business in China: గోకుడు కూడా ఒక వ్యాపారమే.. ఇతడు నెలకు ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా..

Scratching Business in China: దురద పెడితే గోక్కుంటాం.. ఇది కూడా ఒక పనేనా అని చాలామంది అనుకోవచ్చు. కానీ ఇది కూడా పని అని.. చాలామందికి గోక్కోవడానికి కూడా ఖాళీ ఉండదని.. గోకడం కూడా ఒక బిజినెస్ అని నిరూపించాడు ఇతడు. అంతేకాదు, లక్షలు సంపాదిస్తున్నాడు. చైనాలో గోకడాన్ని ఒక వ్యాపారంగా మార్చాడు జాంగ్ అనే ఒక వ్యక్తి. ఇతడికి సోషల్ మీడియాలో రీల్స్ చూడటం విపరీతంగా ఇష్టం. కొత్త కొత్త షార్ట్స్ కూడా చూస్తూ […]

Scratching Business in China: దురద పెడితే గోక్కుంటాం.. ఇది కూడా ఒక పనేనా అని చాలామంది అనుకోవచ్చు. కానీ ఇది కూడా పని అని.. చాలామందికి గోక్కోవడానికి కూడా ఖాళీ ఉండదని.. గోకడం కూడా ఒక బిజినెస్ అని నిరూపించాడు ఇతడు. అంతేకాదు, లక్షలు సంపాదిస్తున్నాడు.

చైనాలో గోకడాన్ని ఒక వ్యాపారంగా మార్చాడు జాంగ్ అనే ఒక వ్యక్తి. ఇతడికి సోషల్ మీడియాలో రీల్స్ చూడటం విపరీతంగా ఇష్టం. కొత్త కొత్త షార్ట్స్ కూడా చూస్తూ ఉంటాడు. అయితే ఆ మధ్య ఇతడు సోషల్ మీడియాలో వీడియోలు చూస్తుండగా ఒక భార్య తన భర్త వీపు గోకుతున్న వీడియోను అతడు చూశాడు. దీంతో అది అతనికి వింతగా అనిపించింది. దీని ద్వారా వ్యాపారం చేస్తే బాగుంటుందనిపించింది. ఇంకేముంది ఆచరణలో పెట్టాడు. దర్జాగా సంపాదించడం మొదలుపెట్టాడు.

గోకడం కోసం ప్రత్యేకంగా గోర్లను పెంచుకున్నాడు. కాకపోతే వాటిని ఎప్పటికప్పుడు శానిటైజ్ చేస్తూ ఉంటాడు. కస్టమర్ల కోరిక మేరకు కొన్ని సందర్భాలలో చేతులకు తొడుగులు కూడా ధరిస్తుంటాడు. కస్టమర్లు కోరుకున్న విధంగా గోకుతూ ఉంటాడు. కొన్నిసార్లు అయితే మసాజ్ కూడా చేస్తుంటాడు. అయితే ఈ ప్రక్రియ మొత్తం సీసీ కెమెరాలలో రికార్డు అయ్యే విధంగా చూస్తూ ఉంటాడు. కస్టమర్లు ఆడవాళ్లు లేదా మగవాళ్ళు అయినప్పటికీ అందరిని ఒకే విధంగా రిసీవ్ చేసుకుంటాడు. ఎవరితో కూడా అసభ్యకరంగా ప్రవర్తించడు. పైగా తన వీడియోలను రకరకాల క్రియేటివ్ విధానాలలో ఎడిటింగ్ చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటాడు.

గోర్లతో గోకడం ద్వారా జాంగ్ గంటకు 4200.. నెలకు ఏకంగా 14 లక్షలు సంపాదిస్తున్నాడు. వాస్తవానికి మసాజ్ కంటే కూడా ఇలా గోకడం చాలామందికి రిలాక్స్ ఇస్తోందని అతడు చెబుతున్నాడు..”నా దగ్గరికి చాలామంది వస్తున్నారు. వారంతా కూడా రకరకాల కోణాలలో శరీరాన్ని గోకాలి అని చెబుతుంటారు. నేను అదే విధంగా గోకుతూ ఉంటాను. నేను గోకుతుంటే వారంతా ఆస్వాదిస్తూ ఉంటారు. ఈ ప్రక్రియ చాలా కొత్తగా ఉంది. కాకపోతే ఇది ఈ స్థాయిలో వ్యాపారంగా మారుతుందని నీ కలలో కూడా ఊహించలేదు. కొన్ని సందర్భాలలో కస్టమర్లు గంటల తరబడి ఎదురు చూస్తుంటారు. ఒక్కోసారి తినడానికి సమయం కూడా సరిపోదు. అంత బిజీగా ఉంటుంది.. ఏదైనా సరే ఇలాంటి వ్యాపారం ద్వారా.. ఎటువంటి పెట్టుబడి పెట్టకుండా డబ్బులు సంపాదించడం ఆనందంగా ఉందని” జాంగ్ చెబుతున్నాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper