spot_img
Homeఅంతర్జాతీయంEl Salvador prison conditions: ఎల్‌ సాల్వడార్‌.. ఆ జైలుకు వెళ్లడం కన్నా.. చావే నయం!

El Salvador prison conditions: ఎల్‌ సాల్వడార్‌.. ఆ జైలుకు వెళ్లడం కన్నా.. చావే నయం!

El Salvador prison conditions: భారత దేశంలో అండమాన్‌ జైలు అనగానే నేరస్తులకు కూడా వణుకు పుడుతుంది. సాధారణ జైలుతో పోలిస్తే అండమాన్‌ జైలు దారునంగా ఉంటుంది. అక్కడికి వెళ్లిన ఖైదీలు దుర్భర జీవనం సాగించాల్సి ఉంటుంది. ఇలాగే ప్రపంచ వ్యాప్తంగా అనేక జైళ్లు ఖైదీలకు ప్రమాదకరంగా ఉన్నాయి. అలాంటి వాటిలో ఎల్‌ సాల్వడార్‌ ఒకటి. ఒకప్పుడు మాదకద్రవ్యాల ముఠాల అరాచకంతో, హత్యలతో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశంగా ముద్రపడిన ఎల్‌ సాల్వడార్‌.. నేడు అద్భుతమైన మార్పును చూస్తోంది. ఎంఎస్‌–13, బారియో 18 వంటి గ్యాంగ్‌ల మధ్య సాగిన ఆధిపత్య పోరు సామాన్యుల జీవితాలను చిన్నాభిన్నం చేసింది. అశాంతి, పేదరికం, నిరుద్యోగం కారణంగా యువత ఈ నేర సామ్రాజ్యంలోకి ఆకర్షితమై, హింసాత్మక కార్యకలాపాలకు కేంద్రబిందువులుగా మారారు.

నయిబ్‌ బుకెల్‌ వ్యూహం..
2019లో నయిబ్‌ బుకెల్‌ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక, దేశంలో నేర నియంత్రణకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2022లో ముఠా సభ్యుల హింసాకాండ పతాక స్థాయికి చేరాయి. ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని ప్రకటించి భారీ స్థాయిలో అరెస్టులు ప్రారంభించింది. నిందితులను నిర్బంధించేందుకు గాను, 2023లో ప్రపంచంలోనే అతిపెద్ద ’టెర్రరిజం కన్‌ఫైన్‌మెంట్‌ సెంటర్‌’ను ప్రభుత్వం నిర్మించింది. దాదాపు 40 వేల మంది గ్యాంగ్‌స్టర్లను బంధించగల సామర్థ్యం ఉన్న ఈ జైలు, అత్యంత పటిష్టమైన భద్రతా వ్యవస్థతో నేరస్థులకు సింహస్వప్నంగా మారింది.

కఠిన శిక్షా విధానం
ఈ జైలులోని పరిస్థితులు అత్యంత కఠినంగా ఉంటాయి. ఖైదీలు రోజులో 23 గంటల సమయాన్ని జైళ్లలోనే గడపాల్సి ఉంటుంది. పారిపోయే అవకాశం లేకుండా కాళ్లకు, చేతులకు సంకెళ్లు వేయడం, కాలానుగుణంగా తలలు గొరిగించడం వంటి చర్యలు తీసుకుంటారు. ఆహార నియామకాలు పరిమితంగా ఉంచడం, న్యాయ విచారణకు అవకాశం లేకపోవడం వంటి అంశాలపై మానవ హక్కుల సంఘాలు విమర్శలు చేస్తున్నప్పటికీ, భద్రత విషయంలో రాజీపడని ప్రభుత్వం తన విధానాన్ని కొనసాగిస్తోంది.

నేడు ప్రశాంత దేశంగా..
ప్రభుత్వ చర్యల వల్ల నేరాల రేటు గణనీయంగా పడిపోవడంతో ఎల్‌ సాల్వడార్‌ నేడు సెంట్రల్‌ అమెరికాలోనే సురక్షితమైన దేశంగా గుర్తింపు పొందింది. ముఠాల భయం వీడటంతో పర్యాటక రంగం పుంజుకుంది, తద్వారా దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. దేశ జనాభాలో దాదాపు 2 శాతం మంది జైళ్లలో ఉన్నప్పటికీ, సుమారు 95 శాతం ప్రజలు అధ్యక్షుడి కఠిన నిర్ణయాలకు మద్దతుగా నిలుస్తున్నారు. ప్రాణహాని కలిగించే హంతకులకు మానవ హక్కుల కంటే ప్రజా భద్రతే ముఖ్యమని అక్కడి ప్రజలు భావిస్తున్నారు.

మొత్తంగా ఎల్‌ సాల్వడార్‌ జైలు పరిస్థితులు అక్కడ నేరస్థుల జీవన విధానం, నేర ప్రవృత్తిలోనూ మార్పులు తెచ్చింది. దీంతో ఒకప్పుడు అరాచకాలకు అడ్డాగా మారిన ఎల్‌ సాల్వడార్‌ ఇప్పుడు ప్రశాంత పరిస్థితులు నెలకొంటున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper