spot_img
Homeబిజినెస్OnePlus Pad 4 price and specifications: గేమింగ్, డైలీ యూజర్స్ కు బెస్ట్ ప్యాడ్.....

OnePlus Pad 4 price and specifications: గేమింగ్, డైలీ యూజర్స్ కు బెస్ట్ ప్యాడ్.. రేపటి నుంచి అందుబాటులోకి..

OnePlus Pad 4 price and specifications: OnePlus నుంచి ఇప్పటికే ఎన్నో రకాల మొబైల్స్ మార్కెట్లోకి వచ్చాయి. అయితే ఈ నెలలో Pad 4 అనే టాబ్లెట్ లాంచ్ అయి మరింత ఆకర్షిస్తోంది. ప్రీమియం వినియోగదారులకు తీసుకొచ్చిన దీని డిజైన్, ప్రాసెసర్, డిస్‌ప్లే, బ్యాటరీ వంటి అంశాల్లో ఫ్లాగ్‌షిప్ లెవెల్ పనితీరును అందిస్తుంది. దీని మెయిన్ హైలైట్స్ 13.2 అంగుళాల డిస్ ప్లే. మూవీస్ చూసేవారితో పాటు గేమింగ్ కోరుకునేవారికి ఈ ప్యాడ్ బాగా వర్కౌట్ అవుతుందని అంటున్నారు. మరి దీని గురించి తెలుసుకుందామా..

OnePlus Pad 4 మెటల్ యూనిబాడీతో 5.94 మందంతో తయారు చేశారు. ఇది 672 గ్రాముల బరువుతో స్లిమ్‌గా ఉంటుంది. Dune Glow లేదా Sage Mist కలర్లలో అందుబాటులో ఉన్న ఇందులో ఫ్లాట్ సైడ్స్, 2.5D కర్వ్ ఎడ్జెస్‌తో చేతిలో పట్టుకోవడానికి అనుగుణంగా ఉంటుంది. పవర్ బటన్ టాప్ ఎడ్జ్‌లో, వాల్యూమ్ రాకర్ రైట్ సైడ్‌లో ఉన్నాయి. ఎనిమిది స్పీకర్లు, USB-C పోర్ట్ ఉండటంతో సౌకర్యాంగా ఉంటుంది. ఈ డిజైన్ హ్యాండ్‌లింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. స్మార్ట్ కీబోర్డ్ లేదా కేస్‌తో ఉపయోగించడం మరింత సౌకర్యం.

ఈ టాబ్లెట్ లో Snapdragon 8 Elite Gen 5 (3nm) ప్రాసెసర్‌తో 8GB ర్యామ్, 256 లేదా 512GB UFS 4.1 స్టోరేజ్ ఉంటాయి. మల్టీటాస్కింగ్ తో పాటు గేమింగ్‌ కోరుకునేవారికి అద్భుత పనితీరును అందిస్తుంది. OS 16 (Android 16)పై AI ఫీచర్స్ లైక్ AI Writer, మల్టీ విండో మల్టీటాస్కింగ్‌తో ల్యాప్‌టాప్ రీప్లేస్‌మెంట్‌లా పని చేస్తుంది. కెమెరా విషయానికొస్తే.. 13MP రియర్ కెమెరాను ఇందులో అమర్చారు. 8MP ఫ్రంట్ కెమెరాతో సాధారణ ఫోటోలు, వీడియో కాల్స్‌కు సరిపోతాయి. AI ఫీచర్స్ కెమెరా పనిని మెరుగుపరుస్తాయి. దీంతో రోజూవారీ వినియోగదారులకు సరిపోతుంది.

OnePlus Pad 4లో బలమైన బ్యాటరీ ఉంది. ఇందులో 13,380mAh బ్యాటరీ ఉండగా..దీనికి 80W SuperVOOC చార్జింగ్‌తో 24 గంటల YouTube స్ట్రీమింగ్, మల్టిపుల్ డేస్ మోడరేట్ యూస్ ఇస్తుంది. ఈ బ్యాటరీ 2 గంటల్లో 100 శాతం పూర్తి చేసుకోవచ్చు. ఎఫిషియెంట్ Snapdragon చిప్‌తో హెవీ వర్క్‌లో కూడా రాజీ లేకుండా పని చేస్తుంది. భారత్‌లో 8GB+256GB మోడల్ రూ.59,999 నుంచి ప్రారంభం అవుతుంది. 12GB+512GB రూ.64,999కి అందుబాటులో ఉంది. మే 5 నుంచి OnePlus.in, Amazon, Flipkartలో అందుబాటులో ఉండనుంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper