Chinese defense system failed: వెనెజువెలాపై అమెరికా సైనిక చర్యలు ప్రపంచవ్యాప్త ఆశ్చర్యాన్ని కలిగించింది. నిమిషాల వ్యవధిలోనే అమెరికా సైనికులు రాజధాని కరకాస్‌లోకి చొరబడి అధ్యక్షుడు నికోలస్ మదురో, భార్యను అపహరించారు. ఈ ఘటనపై అంతర్జాతీయంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎవరూ అమెరికాను సమర్థించడం లేదు. అయితే ఇక్కడ వెనుజువెలా డిఫెన్స్ సిస్టం విఫలం కావడం ఇప్పుడు ప్రపంచాన్ని సాక్‌కు గురిచేస్తోంది. చైనా డిఫెన్స్ సాంకేతికతల బలహీనతను, ఆధునిక యుద్ధ వ్యూహాల ప్రాముఖ్యతను బయటపెట్టింది.
నిమిషాల్లో పని పూర్తి చేసిన అమెరికా..
అమెరికా సైనికులు వెనుజువెలాలో 150 కిలోమీటర్ల లోపలికి చొరబడ్డాయి. వెనెజువెలా అత్యాధునిక చైనా జేవై–1 రాడార్లు (400 కి.మీ. రేంజ్), ఎస్–బ్యాండ్ 3డి సర్వెయిలెన్స్ సిస్టమ్‌లు (360ని కవరేజ్) విమానాలు, డ్రోన్‌లను గుర్తించలేదు. అమెరికా సైనికుల కదలికలను గుర్తించడంలో విఫలమయ్యాయి. ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ ద్వారా ఫ్రీక్వెన్సీలు జామ్ చేసి, సైబర్ అటాక్‌లతో కమాండ్ సెంట్రాల్, విద్యుత్ సిస్టమ్‌లను నిలిపివేశారు. ఫలితంగా రాడార్లు గుర్తించకముందే దాడి పూర్తయింది.
చైనా మాల్ అంతే మరి..
వెనెజువెలా భారీ డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసిన ఈ రాడార్లు స్పేర్ పార్ట్స్ అందుబాటు లేకపోవడం వల్ల సగం నిరుపయోగంగా మారాయి. నియంత్రిత పరీక్షల్లో అద్భుతంగా పనిచేసినా యథార్థ యుద్ధంలో విఫలమయ్యాయి. మదురో పాలిటికల్ మద్దతుకు భారీ పెట్టుబడి పెట్టినా రక్షణ బలం లోపించింది.
ఆపరేషన్ సిందూర్‌లోనూ..
పాకిస్తాన్ చైనా వైఎల్‌సీ–8ఈ, హెచ్‌క్యూ–9 రాడార్‌లపై ఆధారపడి యాంటీ–డ్రోన్ సిస్టమ్‌లు ఏర్పాటు చేసింది. కానీ ఆపరేషన్ సిందూర్‌లో భారత వాయుసేన హరూప్, రాగ్ పైక్ సిస్టమ్‌లతో సర్గోదా, నూర్ ఖాన్, జాకోబాబాద్, చగాయి బేస్‌లపై దాడి చేసింది. చైనా టెక్నాలజీ గుర్తించకపోవడం పాక్ రక్షణను బలహీనపరిచింది.
భవిష్యత్‌లో ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ కీలకం..
శత్రు రాడార్లను జామ్ చేయడం, సైబర్ దాడులు, కమాండ్ నెట్‌వర్క్‌లను అల్లరు చేయడం రానున్న యుద్ధాల్లో అవసరం. అమెరికా ఎలక్ట్రానిక్ వ్యూహాలతో వెనెజువెలాను ఓడించడం ఆధునిక యుద్ధ పాఠాలను ఇచ్చింది. చైనా ఆయుధాలపై ఆధారపడితే ఇలాంటి పరాజయాలు తప్పవని రుజువైంది.
వెనెజువెలా, పాకిస్తాన్ ఉదాహరణలు చైనా డిఫెన్స్ సాంకేతికత.. టెస్టుల్లో బాగా పనిచేస్తుంది. కానీ యుద్ధరంగంలో విఫలమవుతోంది. దీంతో చైనా ఆయుధాలపై నమ్మకం సడలుతోంది.