Mana Shankara Varaprasad Garu pre-release event: మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు'(Mana Shankara Varaprasad Garu) మూవీ మరో 5 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా నేడు ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాద్ లో ఏర్పాటు చేయనున్నారు. సాయంత్రం 7 నుండి ఈ ఈవెంట్ మొదలు కానుంది. మోకాళ్ళకు చిరంజీవి సర్జరీ చేయించుకోవడం వల్ల, ఆ ఈవెంట్ కి రాడేమో అనే అనుమానాలు అభిమానుల్లో ఉండేవి. కానీ మెగాస్టార్ ఈ ఈవెంట్ కి వస్తున్నాడు. ఆయనతో పాటు, ఈ చిత్రం లో కీలక పాత్ర పోషించిన విక్టరీ వెంకటేష్ కూడా ఈ ఈవెంట్ లో హాజరు కాబోతున్నాడు. అలా ఈ ఇద్దరు క్రేజీ సీనియర్ హీరోలు 5 రోజుల ముందే ఈ ఈవెంట్ ద్వారా అభిమానులకు విజువల్ ఫీస్ట్ ఇవ్వబోతున్నారు. ఒకరి కోసం ఒకరు ఏమి మాట్లాడుకుంటారు అనే దానిపై అభిమానుల్లో, ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి ఉంది.
ఇదంతా పక్కన పెడితే ఈ ఈవెంట్ కి ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అదే విధంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ముఖ్య అతిథులుగా రాబోతున్నారని టాక్. రామ్ చరణ్ అయితే కచ్చితంగా వస్తున్నాడు కానీ, పవన్ కళ్యాణ్ వస్తున్నాడా లేదా అనే దానిపై కాసేపట్లో అధికారికంగా తెలియనుంది. సాధ్యమైనంత వరకు వీళ్లిద్దరు కలిసి ఈ ఈవెంట్ కి సందడి చేయబోతున్నారు అంటూ మెగాస్టార్ చిరంజీవి సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. ఇలా చిరంజీవి, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్ కలిసి చివరిసారిగా ‘సైరా నరసింహా రెడ్డి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కనిపించారు. మళ్లీ ఇన్నాళ్లకు ఈ ముగ్గురి కలయిక నేడు సాయంత్రం జరగబోతుంది. వీరితో విక్టరీ వెంకటేష్ కలిసి చేసే సరదా ఎలా ఉంటుందో చూసేందుకు అభిమానులే కాదు, మూవీ లవర్స్ కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఇక ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ రేపు లేదా ఎల్లుండి నుండి మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. కాసేపట్లో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాల నుండి టికెట్ రేట్స్ జీవోలు కూడా రానున్నాయి. ఇప్పటికే ఓవర్సీస్ లో ఈ సినిమాకు సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. కేవలం ఒక్క నార్త్ అమెరికా నుండే ఈ సినిమా ప్రీమియర్స్ ద్వారా 1 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని అంటున్నారు, ఆ రేంజ్ ట్రెండ్ ప్రస్తుతం నడుస్తోంది. నిన్న ఒక్క రోజే ఈ చిత్రానికి USA నుండి అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా లక్ష డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
Chief Guest Power Star @PawanKalyan Garu#ManaShankaraVaraPrasadGaru pic.twitter.com/wtWCadVz5B
— Chiru Trends (@KChiruFanTrends) January 7, 2026