China : ప్రపంచం మీదికి కరోనా లాంటి వైరస్ వదిలిన చైనా.. ఎలాంటి దుర్మార్గాల కైనా తెగిస్తుంది. ఎంతటి దారుణాల కైనా ఒడిగడుతుంది. అంతిమంగా తన ప్రయోజనాల విషయంలో అత్యంత జాగ్రత్త ఉంటుంది. అందు గురించే కదా ఆ మధ్య అమెరికా మీదికి నిఘా బెలూన్లు వదిలింది.. అమెరికా ఆధిపత్యానికి గండి కొట్టాలని చూస్తోంది.. అయితే చైనా ఇక్కడితోనే ఆగడం లేదు. ఇంకా అనేక కుట్ర సిద్ధాంతాలను అమలు చేస్తోంది.. అచ్చం హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ “స్టార్ వార్స్” లో లాగా “డెత్ స్టార్” సూపర్ వెపన్ ను రూపొందించింది. దానికి అనువుగా ప్రయోగాలు కూడా రూపొందించింది. అయితే వీటికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞాన విషయంలో చైనా అత్యంత జాగ్రత్తగా ఉంటోంది. ఈ ఆయుధాలను చైనా అంతరిక్షంలో ఉపయోగిస్తుందని తెలుస్తోంది..
మైక్రో వేవ్ వెపన్స్
డెత్ స్టార్ లాంటి ఆయుధాలను మైక్రోవేవ్ వెపన్స్ అని కూడా పిలుస్తుంటారు. ఇవి ఎంచుకున్న టార్గెట్ ను క్షణంలో పేల్చేస్తాయి. వీటికి అత్యంత శక్తివంతమైన ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ రేడియేషన్ ను విడుదల చేసే సామర్థ్యం ఉంటుంది. ఇవి టార్గెట్ లో ఉండే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ సర్క్యూట్ లను దారుణంగా దెబ్బ కొడతాయి. దీంతో శాటిలైట్ వంటి ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ లో గ్రౌండ్ సెంటర్లో లో సమాచార వ్యవస్థ పూర్తిగా నాశనం అయిపోతుంది. ఇప్పటికే ఈ మైక్రో వేవ్ ఆయుధాలతో డ్రోన్స్ వంటి స్మాల్ టార్గెట్లపై దాడులు చేసింది. ఇప్పటికే అమెరికా తాను అభివృద్ధి చేసిన తోర్ (ది టాక్టికల్ హై పవర్ ఆపరేషనల్ రెస్పాండర్) ద్వారా వందలకొద్దీ డ్రోన్లను ఏకకాలంలో నిర్వీర్యం చేసింది. అంతేకాదు సెప్టెంబర్ లో రష్యా, చైనా ఉపగ్రహాల సంకేతాలను కంట్రోల్ చేయగలిగే మెడోల్యాండ్స్ జామర్ అనే ఆయుధాన్ని అభివృద్ధి చేసుకుంది. ఇంగ్లాండ్ దేశం సైతం డ్రాగన్ ఫ్లై లేజర్ వెపన్ ను రూపొందించుకుంది. దీనికి గాలిలో ఎగిరే డ్రోన్లను పడగొట్టే సామర్థ్యం కూడా ఉంది. కాయిన్ సైజులో ఉండే టార్గెట్ ను కూడా ఇది బ్రేక్ చేయగలదు. అత్యంత ఖచ్చితత్వంతో దాడి చేయగలదు.
ఇలా పనిచేస్తుంది
చైనా తయారుచేసిన ఈ వెపన్ ఏడు యంత్రాలను ఉపయోగించి పనిచేస్తుంది. ఇవి ఫైబర్ ఆప్టిక్స్ ద్వారా సమ్మేళితమై ఉంటాయి. ఏడు యంత్రాలు ఎలక్ట్రో మాగ్నెటిక్ వేవ్ ను సృష్టిస్తాయి. శత్రు దేశాల శాటిలైట్లపై దాడులు చేస్తాయి. ఈ ఏడు యంత్రాలు ఏకకాలంలో ఏడు తరంగాలను విడుదల చేస్తాయి. ఈ తరంగాలు ఒక సెకనులో 170 లక్షల కోట్ల వంతు కాలంలో విడుదలవుతాయి. ప్రస్తుతం అత్యాధునికమైన జిపిఎస్ ఉపగ్రహాలలో నిక్షిప్తం చేసిన అటామిక్ గడియారాలు కొన్ని వందల కోట్ల సంవత్సరాల ఒకే ఒక సెకండ్ కాలాన్ని మిస్ అవుతున్నాయి. అయితే వాటికన్నా కచ్చితంగా లెక్కించడం సాధ్యం కాదు. అయితే చైనా శాస్త్రవేత్తలు దానిని కూడా అధిగమించారు. వారు గత ఏడాది అనేక పరిశోధనలు చేసి 1,800 కిలోమీటర్ల పరిధి నుంచి ఒక సెకండ్ కాలంలో 10 లక్షల కోట్ల వత్తు కాలానికి సత్సమానమైన కచ్చితత్వాన్ని లెక్కించగలిగారు.. ఇక ఇదే రీతిలో డెత్ స్టార్ ఆయుధాలను కూడా చైనా శాస్త్రవేత్తలు ప్రత్యర్థి దేశాల ఉపగ్రహాలపై ప్రయోగిస్తారని వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడప్పుడే ఇది సాధ్యం కాదని చైనా లో ప్రముఖ పత్రిక సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: China is launching death star weapons at satellites of rival countries
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com