Pushpa 2 : అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో వస్తున్న పుష్ప 2 సినిమా మీద ఇండియా వైడ్ గా భారీ అంచనాలైతే ఉన్నాయి. ఇక మొదటి పార్ట్ సూపర్ డూపర్ సక్సెస్ అవ్వడంతో ఈ సినిమా మీద మొదటి నుంచి కూడా చాలా అంచనాలైతే ఉన్నాయి. ఇక ఇప్పుడు దానికి తగ్గట్టుగానే సినిమా నుంచి వచ్చిన గ్లింప్స్, టీజర్స్ తో అంచనాలు తార స్థాయికి చేరుకున్నాయి. అయితే ఈ సినిమా ను ఆగస్టు 15వ తేదీన రిలీజ్ చేస్తున్నామంటూ మేకర్స్ అనౌన్స్ చేశారు.
కానీ ఇప్పుడు తెలుస్తున్న సమాచారం ప్రకారం పూరి రామ్ కాంబో లో వస్తున్న డబుల్ ఇస్మార్ట్ సినిమాని ఆగస్టు 15 న రిలీజ్ చేస్తున్నాం అంటూ వాళ్ళు సినిమా డేట్ ని ప్రకటించారు. దాంతో పుష్ప సినిమా పోస్ట్ పోన్ అయింది అంటూ కొద్దిరోజులుగా చాలా వార్తలైతే వస్తున్నాయి. ఇక దాని మీద రీసెంట్ గా సినిమా యూనిట్ స్పందిస్తూ పుష్ప సినిమాని డిసెంబర్ ఆరోవ తేదీన రిలీజ్ చేస్తున్నామంటూ కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేశారు. ఇక పుష్ప మూవీ అభిమానులు ఆ కొత్త డేట్ పట్ల కొంతవరకు నిరుత్సాహపడినప్పటికీ మొత్తానికైతే రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు అదొక సంతోషంగా భావిస్తున్నారు.
నిజానికి పుష్ప 2 సినిమా కోసం ఆగస్టు 15 వరకు ఎలా వెయిట్ చేయాలి ఆ సినిమాని ఇప్పుడు రిలీజ్ చేసిన తొందరగా చూసేస్తాం అంటూ అభిమానులు ఆ సినిమా కోసం చాలా ఎదురుచూస్తున్నారు. మరి ఇలాంటి సమయంలో మరొక 4 నెలలు సినిమాని పోస్ట్ పోన్ చేయడం అనేది నిజంగా అభిమానులకు కొంతవరకు చేదు వార్తనే చెప్పాలి. కానీ మొత్తానికైతే సినిమా యూనిట్ డిసెంబర్ 6 వ తేదీన గ్రాండ్ గా ఈ సినిమాని రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
ఇక దీంతో పుష్ప మీద కొద్ది రోజులుగా వస్తున్న ఊహగానాలకు తెరపడినట్టైంది. ఇక షూటింగ్ కూడా ఇంకొంచెం బ్యాలెన్స్ ఉండడంతో అలాగే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా ఇంకా సరిగ్గా జరగకపోవడంతోనే ఈ సినిమాని పోస్ట్ పోన్ చేసినట్టుగా సినిమా యూనిట్ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది…
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: The makers of pushpa 2 have announced the new release date
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com