
MLC Kavitha Arrested: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారణ చేస్తున్న సందర్భంగా బీఆర్‌ఎస్ నేతలు తెలంగాణలో భారీ అల్లర్లు, విధ్వంసానికి కుట్ర చేస్తున్నట్లు కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. ఈమేరకు కేంద్ర హోంశాఖకు ఇప్పటికే సమాచారం అందించినట్లు తెలుస్తోంది. దీంతో కేంద్రం కూడా అలర్ట్ అయినట్లు తెలుస్తోంది.
ఇంటలిజెన్స్ రిపోర్టులో షాకింగ్ నిజాలు..
తెలంగాణను పాలిస్తున్న బీఆర్‌ఎస్ నేతలు రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాల్సి ఉండగా ఉగ్రవాదుల తరహాలో విధ్వంసానికి ప్రాన్ చే స్తున్నట్లు కేంద్ర నిఘా వర్గాలు హోంశాకకు రిపోర్టు చేశాయి. రహస్య ప్రాంతాల్లో ఉన్న కొంతమంది నేతలు, ప్రజాప్రతినిధులు దీనికి నేతృత్వం వహిస్తున్నట్లు ఇంటలిజెన్స్ గుర్తించింది. ఆ నేతల పేర్లను కూడా కేంద్రానికి పంపినట్లు సమాచారం.
సికింద్రాబాద్ దాడి తరహాలో..
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కూతురు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో పీకల్లోతు కూరుకుపోయిన కవితను ఈడీ విచారణకు పిలిచిన నేపథ్యంలోనే బీఆర్‌ఎస్ నేతలు విధ్వంసానికి వ్యూహం రూపొందించారని సమాచారం. ఇందులో కవితకు, కేటీఆర్‌కు, కేసీఆర్‌కు అత్యంత సన్నిహితంగా ఉండే నేతలే కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలిసింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విధ్వంసం సృష్టించిన కొంతమంది యువ నేతలు ఇందులో భాగస్వాములయ్యారని సమాచారం. సైన్యంలో నియామకాల కోసం కేంద్రం అగ్నివీర్ స్కీం తెచ్చినప్పుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌పై దాడి జరిగింది. ఇదే తహరాలో దాడులకు వ్యూహం రూపొందిస్తున్నట్లు ఇంటలిజెన్స్‌కు పక్కా సమాచారం అందింది.

హైదరాబాద్, ఢిల్లీలో విధ్వంసం..?
బీఆర్‌ఎస్ నేత, సీఎం తనయ కవితను ఈడీ అరెస్ట్ చేసిన వెంటనే తెలంగాణ రాజధాని హైదరాబాద్, భారత రాజధాని ఢిల్లీలో భారీ విధ్వంసం సృషించాలన్నదే బీఆర్‌ఎస్ నేతల లక్ష్యంగా కనిపిస్తోంది. ఇందుకోసం ఇప్పటికే రహస్య ప్రాంతాల్లో ఉండి ప్లాన్ రెడీ చేస్తున్న నేతలు ఇప్పటికే వాట్సాప్ గ్రూపులు రూపొందిస్తున్నట్లు తెలిసింది. ఢిల్లీలో ఉన్న నేతలతో ఒక గ్రూపు, హైదరాబాద్‌లో ఉన్నవారితో మరో గ్రూపు, తెలంగాణలోని కీలక పట్టణాల్లో ఉన్న నేతలతో ఇంకో గ్రూపు ఏర్పాటు చేసి ఇప్పటికే చాటింగ్ మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఈ చాటింగ్‌లో నేతలు పూర్తిగా కోడ్ లాగ్వేజ్ ఉపయోగిస్తున్నట్లు సమాచారం. కవిత అరెస్ట్‌పై ప్రకటన విచ్చన వెంటనే ఏ కోడ్ ఇస్తే ఏం చేయాలని ఇప్పటికే నేతలకు వాట్సాప్‌గ్రూపుల ద్వారానే సూచనలు చేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి.
రంగంలోకి కేంద్ర బలగాలు..
కవిత అరెస్ట్ తర్వాత విధ్వంసం సృష్టించే అవకావం ఉందని ఇంటలిజెన్స్ ఇచ్చిన నివేదిక మేరకు కేంద్రం అలర్ట్ అయింది. హోంశాఖ ఆదేశాలతో ఇప్పటికే కేంద్ర బలగాలగాలు రంగంలోకి దిగేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఢిల్లీలో కేంద్ర బలగాలు ఈడీ కార్యలయం, సీఎం కేసీఆర్ ఇంటి వద్ద మోహరించారు. కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే హైదరాబాద్‌లోనూ రగంలోకి దిగేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది.
కేవలం లిక్కర్‌స్కాంలో ఇరుక్కున్న, అవినీతికి పాల్పడిన కవిత కోసం బీఆర్‌ఎస్ నేతలు తెలంగాణలో అల్లర్లకు ప్లాన్ చేయడంతో తెలంగాణ వ్యాప్తంగా హైటెన్షన్ నెలకొంది.