
Rocking Rakesh: జబర్దస్త్ ఎంతో మంది జీవితాలను నిలబెట్టింది. ఒకప్పుడు ఈ ప్రొగ్రాంలో పార్ట్సిపేట్ చేసిన వారు ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు. ఇప్పుుడు జబర్దస్త్ లో కొత్త వారు సందడి చేస్తున్నారు. అయితే కొందరు ఇందులో నుంచి బయటకు వెళ్లిపోవడంపై రకరకాల రూమర్స్ వస్తున్నాయి. కొందరు ఇతర అవకాశాలు రావడంతో జబర్దస్త్ ను వీడుతున్నారని అంటుంటే.. మరికొందరు మల్లెమాల యాజమాన్యంతో రెమ్యూనరేషన్ సమ్యలు వచ్చి వెళ్లిపోతున్నారని అంటున్నారు. ఎంతోకాలంటో పంచ్ లతో ఆకట్టుకున్న హైపర్ ఆది సైతం ఇటీవల జబర్దస్త్ ను వీడారు. ఈయన కూడా రెమ్యూనరేషన్ కట్ చేశారనే బయటకు వెళ్లారన్న ప్రచారం సాగుతోంది. ఈ తరుణంలో కొందరు రెమ్యూనరేషన్ తక్కవైనా పర్వాలేదు జబర్దస్త్ లో కనిపిస్తే చాలనుకునే వాళ్లు ఎంతో మంది ఉన్నారట. వారిలో ర్యాకింగ్ రాకేశ్, సుజాతల పేర్లు వినిపిస్తున్నాయి. ఇంతకీ వీరి రెమ్యూనరేషన్ ఎంతో చూద్దాం..
ప్రస్తుతం జబర్దస్త్ రేటింగ్ దారుణంగా పడిపోయిందని అంటున్నారు. దీంతో మల్లెమాల యాజమాన్యం రెమ్యూనరేషన్ విషయంలో నిబంధనలు విధించిందట. కొందరు స్కిట్ చేసేవాళ్లకు క్యాష్ కటింగ్ పేరుతో తమకు వచ్చే రెమ్యూనరేషన్ లో కోత విధిస్తుందట. ఇలా చేయడం వల్ల చాలా మంది నిరాశతో ఉన్నారట. అయితే ఈ సమయంలో అలా కట్ చేయకుండా ఉండాలంటే తాము ఓకే చేసిన రెమ్యూనరేషన్ కు పనిచేయాలని అంటున్నారటన. ఈ నిబంధనలు ఒప్పుకోని కొందరు జబర్దస్త్ కు రావడం లేదని అంటున్నారు. ఒకవేళ రావాలని అనుకుంటే తక్కువ రేమ్యూనరేషన్ ఉంటుందని చెబుతున్నారట.

ప్రస్తుతం జబర్దస్త్ లో కొనసాగుతున్న ర్యాకింగ్ రమేశ్, సుజాతలు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వీరిద్దరు కలిసి చేసే స్కిట్స్ ఆకట్టుకుంటున్నాయి. కొన్ని రోజుల పాటు వీరు కలిసి చేసిన తరువాత పెళ్లి కూడా చేసుకున్నారు. అయితే వీరి రెమ్యూనరేషన్ విషయంలో అనేక వార్తలు వస్తున్నాయి. మిగతా వారికంటే వీరు తక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారనట. మల్లెమాల యాజమాన్యం వీరికి ముందే ఆ విషయం చెప్పింట. అయితే తాము జబర్దస్త్ లో కనిపిస్తే చాలు పారితోషికంతో పనిలేదని అంటున్నారు.
చాలా మంది జబర్దస్త్ లో చేసిన వాళ్లు ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు. ఇందులో యాంకర్ గా చేసిన అనసూయ సహాయనటిగా పలు సినిమాల్లో అవకాశం తెచ్చుకుంటున్నారు. సుడిగాలి సుధీర్ హీరో అయ్యాడు. చమ్మక్ చంద్ర లాంటి వాళ్లు మిగతా చానెళ్లలో పనిచేస్తున్నారు. ఇక ఇందులో స్కిట్ చేసిన కమెడియన్ వేణు ఇటీవలే డైరెక్టర్ గా మారిన విషయం తెలిసిందే. ఆయన తీసిన ‘బలగం’ బంపర్ హిట్టు కొట్టింది. అందువల్ల తాము జబర్దస్త్ లో నటించడం వల్ల మంచి అవకాశాలు వస్తాయని చాలా మంది వస్తాయని అనుకుంటున్నారు. వీరిలో ర్యాకింగ్ రమేశ్, సుజాతలు కూడా ఉన్నట్లు చర్చించుకుంటున్నారు.