
Anchor Vishnu Priya: యాంకర్ విష్ణుప్రియ చాలా బోల్డ్. ఆమె ఆటిట్యూడ్, సోషల్ మీడియా ఫోటో షూట్స్ సంచలనం రేపుతుంటాయి. ఎలాంటి మొహమాటం లేకుండా స్కిన్ షో చేస్తుంది. ఆ మధ్య విష్ణుప్రియ ఫేస్ బుక్ పేజీలో అశ్లీల వీడియోలు, ఫోటోలు దర్శనమిచ్చాయి. దాంతో విష్ణుప్రియ ఇంత దారుణానికి తెగబడిందేందని నెటిజెన్స్ ఆశ్చర్యపోయారు. అయితే తన ఫేస్ బుక్ అకౌంట్ హ్యాక్ కి గురైందని, ఆ పోస్ట్స్ నేను చేయలేదన్నారు. అలాగే తన ఫేస్ బుక్ అకౌంట్ అన్ ఫాలో చేయాలంటూ విజ్ఞప్తి చేసింది. అప్పుడు జనాలు సద్దుమణిగారు.
తాజాగా విష్ణుప్రియ తన పర్సనల్ లైఫ్ గురించి చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఆమె కొన్ని బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు. బాయ్ ఫ్రెండ్స్, ముద్దులు అంటూ రెచ్చిపోయి మాట్లాడారు. విష్ణుప్రియ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ… నాకు చాలా బాధ్యతలు ఉన్నాయి. నా వ్యక్తిగత జీవితం నాది. ప్రస్తుతం బాయ్ ఫ్రెండ్ లేడన్న బాధ మనసులో ఉంది. అయితే బాయ్ ఫ్రెండ్ ఉండటం కూడా సమస్యే. సమయం అంతా వాడి కోసం వృధా అయిపోయేది.
నేను బ్రేకప్ చెప్పిన మాజీ లవర్స్ తో కూడా టచ్ లో ఉంటాను. వాళ్ళను ఫ్యామిలీ మెంబర్స్ గా ట్రీట్ చేస్తాను.
ఇక నాకు ఫస్ట్ కిస్ ఎక్స్పీరియన్స్ 17 ఏళ్లకే అయ్యింది. అయితే అది ఆన్ స్క్రీన్ మీద. కాగా తెలుగు బిగ్ బాస్ షో పట్ల నాకు ఆసక్తి లేదు. అవకాశం వచ్చినా వెళ్ళను. ఎందుకంటే బాగా ఆడే కంటెస్టెంట్స్ కూడా ఓడిపోతుంటారు. హిందీ బిగ్ బాస్ షోలో ఛాన్స్ వస్తే ఖచ్చితంగా వెళతాను… అంటూ మైండ్ బ్లోయింగ్ కామెంట్స్ చేసింది. విష్ణుప్రియ ఎలాంటి బెరుకు లేకుండా చేసిన ఈ మాటలు ఆమె డేరింగ్ అండ్ డాషింగ్ యాటిట్యూడ్ బయటపెడుతున్నాయి.

విష్ణుప్రియ కెరీర్ యూట్యూబర్ గా మొదలైంది. ఆమె పలు షార్ట్ ఫిలిమ్స్, కామెడీ వీడియోల్లో నటించారు. పోవే పోరా అనే యూత్ఫుల్ షోతో బుల్లితెరకు ప్రమోట్ అయ్యింది. సుడిగాలి సుధీర్ తో పాటు పోవే పోరా షోకి ఆమె యాంకర్ గా వ్యవహరించారు. ఇటీవల సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ కూడా ఇచ్చారు. గత ఏడాది విడుదలైన వాంటెడ్ పండుగాడ్ మూవీలో విష్ణుప్రియ ఒక పాత్ర చేశారు. విష్ణుప్రియ తనకంటూ ఓ ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్నారు.
View this post on Instagram