Homeఆంధ్రప్రదేశ్‌AP MLC Elections Results: వైసీపీకి మూడో ప్లేస్.. తొక్కిపారేసిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు

AP MLC Elections Results: వైసీపీకి మూడో ప్లేస్.. తొక్కిపారేసిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు

AP MLC Elections Results
AP MLC Elections Results

AP MLC Elections Results: ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ సర్కారుకు దెబ్బ మీద దెబ్బలు తగులుతున్నాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల్లో ఏకపక్షంగా ఫలితాలు వచ్చినా.. పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో మాత్రం ప్రతికూల అంశాలు ప్రభావితం చూపుతున్నాయి. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, యువత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారారు. అవి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రస్పుటంగా కనిపిస్తున్నాయి. పోస్టల్ బ్యాలెట్ లో ఉద్యోగులు తమ ప్రతాపం చూపారు. వైసీపీని కిందకు పడేశారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి కౌంటింగ్ అనంతపురంలోని జేఎన్ టీయూ కళాశాలలో ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. కానీ అధికార వైసీపీకి ఉద్యోగులు గట్టి షాకిచ్చారు.

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల స్థానానికి సంబంధించి మొత్తం 280 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదయ్యాయి. అయితే ఇందులో 155 ఓట్లు చెల్లనివిగా నిర్ధేశించడం అనుమానాలకు తావిస్తోంది. పోస్టల్ బ్యాలెట్ లో ప్రతికూల ఫలితాలు వస్తాయనే ఇలా ఇన్ వేలిడ్ ఓట్లుగా సైడ్ చేశారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే మిగతా 125 ఓట్లలో పీడీఎఫ్ అభ్యర్థి పోతల నాగరాజుకు 75 ఓట్లురాగా.. టీడీపీ బలపరచిన రాంగోపాలరెడ్డికి 31 ఓట్లు వచ్చాయి. వైసీపీ బలపరచిన రవీందర్ రెడ్డికి మాత్రం కేవలం 19 ఓట్లే రావడం గమనార్హం. అధికార పార్టీకి ఏకంగా మూడో ప్లేస్ కు నెట్టేసిన ఉద్యోగులు తమ ఆగ్రహాన్ని బయపెట్టారు. అయితే పీడీఎఫ్ తరువాత టీడీపీ నిలబడడంతో ఆ పార్టీలో ఆనందం వ్యక్తమవుతోంది, మొత్తం ఓట్లు చెల్లుబాటు అయితే వైసీపీకి చుక్కలు కనిపించి ఉండేవని విపక్షాలు ఘాటుగానే కామెంట్స్ చేస్తున్నాయి.

AP MLC Elections Results
AP MLC Elections Results

గత సాధారణ ఎన్నికల ఫలితాల సమయంలో పోస్టల్ బ్యాలెట్లలోనే వైసీపీ విజయం తెలిసిపోయింది. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆ ఎన్నికల్లో ఏకపక్షంగా వైసీపీకి మద్దతు తెలిపారు. పోస్టల్ బ్యాలెట్లలో మెజార్టీని ఆ పార్టీకే కట్టబెట్టారు. నియోజకవర్గంలో 3 వేల వరకూ పోస్టల్ బ్యాలెట్లు ఉంటే అందులో రెండొంతులు.. రెండు వేలకుపైగా వైసీపీకే నమోదయ్యాయి. కానీ నాలుగేళ్ల తరువాత సీన్ మారిపోయింది. ఉద్యోగుల‌కు జీతాలు ఎప్పుడిస్తారో తెలియ‌ని స్థితి. అలాగే నూత‌న పీఆర్‌సీ, ఇత‌రత్రా త‌మ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌క‌పోగా, అణ‌చివేత చ‌ర్య‌ల‌కు ప్ర‌భుత్వం పాల్ప‌డుతోంద‌నే ఆవేద‌న ఉద్యోగుల్లో వుంది. ఉద్యోగుల్లో వ్య‌తిరేక‌త‌ను త‌గ్గించుకోడానికి బ‌దులు, పూర్తిగా వారిని ప్ర‌త్య‌ర్థులుగా వైసీపీ భావిస్తుండ‌డంతో వారి మ‌ధ్య ఎడ‌బాటు మ‌రింత పెరిగింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. అది ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. వైసీపీ ఏకంగా మూడో ప్లేస్ కు చేరుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ లెక్కింపు పూర్తయిన నాటికి వైసీపీ బలపరచిన అభ్యర్థులు ఎన్నో స్థానంలో ఉంటారోనని అధికార పార్టీలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Today 22 July 2026 Horoscope

Today 22 July 2026 Horoscope: ఈ రాశుల వారి ఆదాయం ఈరోజు రెండింతలు.. ఏ పని...

Today 22 july 2026 horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని...
Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Oktelugu Epaper