spot_img
Homeఎంటర్టైన్మెంట్Natu Natu Song- America: ఇంకా తగ్గని నాటు నాటు సాంగ్ క్రేజ్.. అమెరికాలో ఏం...

Natu Natu Song- America: ఇంకా తగ్గని నాటు నాటు సాంగ్ క్రేజ్.. అమెరికాలో ఏం చేశారంటే!

Natu Natu Song- America
Natu Natu Song- America

Natu Natu Song- America: ఆస్కార్ విన్నింగ్ సాంగ్ నాటు నాటు క్రేజ్ ఇప్పట్లో తగ్గే సూచనలు కనిపించడం లేదు. దేశవిదేశాల్లో ఈ సాంగ్ కి యువత స్టెప్స్ వేస్తున్నారు. ఆర్సీ 15 సెట్స్ లో ప్రభుదేవా తన టీమ్ తో ఈ సాంగ్ కి షార్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. అనంతరం రామ్ చరణ్, ప్రేమ్ రక్షిత్ లను అభినందించారు. ఢిల్లీలో జర్మన్ ఎంబసీ స్టాఫ్, అంబాసర్ డాన్స్ చేశారు. జర్మన్ ఎంబసీ బిల్డింగ్ ఎదుట ఈ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. నాటు నాటు సాంగ్ కి జర్మన్ అంబాసర్ తన స్టాఫ్ తో చేసిన డాన్స్ వీడియో వైరల్ అయ్యింది.

తాజాగా అమెరికాలో మరొక ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. టెస్లా కార్స్ వందల సంఖ్యలో పార్క్ చేసి రాత్రివేళ లైట్స్ నాటు నాటు సాంగ్ మ్యూజిక్ కి సింక్ చేశారు. పెద్ద మొత్తంలో కార్ల లైట్స్ నాటు నాటు సాంగ్ ని అనుసరిస్తూ షో చేశారు. ఈ వీడియో ఆర్ ఆర్ ఆర్ అధికారిక ట్విట్టర్ లో పోస్ట్ చేయగా వైరల్ అవుతుంది. వరల్డ్ వైడ్ ఇలాంటి వీడియోలు అనేకం పుట్టుకొస్తున్నాయి. ఆస్కార్ గెలిచిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఈ సాంగ్ గురించి చర్చిస్తున్నారు. స్టెప్స్ వేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

Natu Natu Song- America
Natu Natu Song- America

మార్చి 12న లాస్ ఏంజెల్స్ లో 95వ ఆస్కార్స్ వేడుక జరిగింది. ఒరిజినల్ సాంగ్ విభాగంలో నామినేటైన నాటు నాటు అవార్డు గెలుచుకుంది. నామినేషన్స్ లో ఉన్న మిగతా నాలుగు సాంగ్స్ ని పక్కకు నెట్టి నాటు నాటు ఆస్కార్ అందుకుంది. ఈ పాటకు కీరవాణి సంగీతం అందించారు. చంద్రబోస్ సాహిత్యం సమకూర్చారు. ఆస్కార్ వేదికపైకి వెళ్లి వీరిద్దరూ అవార్డు అందుకున్నారు. కీరవాణి ఆస్కార్ అవార్డు అంగీకార సందేశం ఇచ్చారు.

దర్శకుడు రాజమౌళి విజువల్ వండర్ ఆర్ ఆర్ ఆర్ ప్రపంచ సినిమా వేదికలపై సత్తా చాటింది. రాజమౌళి న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డుకి ఎంపికయ్యారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్స్ గా ఎదిగారు. ముఖ్యంగా రామ్ చరణ్ అరుదైన గౌరవాలు అందుకున్నారు. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్పాట్ లైట్ అవార్డుతో గౌరవించబడ్డారు. గుడ్ మార్నింగ్ అమెరికా షోలో రామ్ చరణ్ పాల్గొన్నారు.

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Avinash Reddy

Avinash Reddy: కడప నుంచి అవినాష్ రెడ్డి ఔట్!

Avinash Reddy: కడప విషయంలో జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. కడప ఎంపీ సీటు విషయంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డికి ఈసారి మొండి చేయి చూపుతారు...
YSRCP

YSRCP: లోకేష్ కు టచ్ లో ఆ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు?!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలామంది నేతలు అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. కూటమిలో ఛాన్స్ దక్కకపోవడంతో చాలామంది వేచి చూస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నామంటే ఉన్నాం అన్నట్టు వ్యవహరిస్తున్న...
US Iran War

US Iran War: ఇరాన్‌తో యుద్ధం.. దివాలా తీస్తున్న అమెరికా!

US Iran War: తన సామ్రాజ్యవాద విస్తరణ కాంక్ష తీర్చుకోవడానికి అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కిరణ్తో యుద్ధం మొదలుపెట్టాడు. ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధం ఇప్పటికీ కొనసాగుతోది. యుద్ధం కారణంగా ఇరాన్...
Jana Nayagan Advance Bookings

Jana Nayagan Advance Bookings: అడ్వాన్స్ బుకింగ్స్ లో అంచనాలు అందుకోలేకపోయిన ‘జన నాయగన్’..ఎంత గ్రాస్ వచ్చిందంటే..

Jana Nayagan Advance Bookings: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' ఎట్టకేలకు అడ్డంకులను దాటుకొని , రేపు ప్రపంచవ్యాప్తంగా తెలుగు , తమిళ...
Oktelugu Epaper