
Bigg Boss Monal: సౌత్ ఇండియా లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి దాదాపుగా అందరి స్టార్ హీరోల సరసన నటించి లేడీ సూపర్ స్టార్ గా ఎదిగిన నయనతార,ఇప్పుడు నిర్మాతగా కూడా ఒక వెలుగు వెలగాలని చూస్తుంది.’రౌడీ పిక్చర్స్’ అనే బ్యానర్ ని తన భర్త విఘ్నేష్ తో కలిసి స్థాపించి తమిళం లో పలు విజయవంతమైన సినిమాలు చేసింది. ఇప్పుడు ఆమె ద్రుష్టి సౌత్ ని దాటి గుజరాతి సినిమాల మీద పడింది.
త్వరలోనే ఆమె ‘శుభయాత్ర’ అనే గుజరాతి సినిమాని నిర్మించబోతోంది. ఈ చిత్రానికి నేషనల్ అవార్డ్ విన్నర్ మనీష్ సైనీ దర్శకత్వం వహించబోతున్నాడు.ఈ చిత్రం లో బిగ్ బాస్ బ్యూటీ మోనాల్ గజ్జర్ హీరోయిన్ గా నటిస్తుండగా, మల్హర్ టక్కర్ అనే గుజరాతి స్టార్ ఇందులో హీరో గా నటిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.
మోనాల్ గజ్జర్ గుజరాత్ కి చెందిన అమ్మాయే అయ్యినప్పటికీ ఆమె తెలుగు సినిమాతోనే వెండితెర కి పరిచయం అయ్యింది.అల్లరి నరేష్ హీరో గా నటించిన ‘సుడిగాడు’ అనే సినిమా ద్వారా ఇండస్ట్రీ కి వచ్చిన ఈ అమ్మాయి, తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది.ఆ తర్వాత బ్రదర్ ఆఫ్ బొమ్మాలి మరియు దేవదాసి వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. కానీ అగ్ర స్టార్ హీరోయిన్ మాత్రం కాలేకపోయింది.ఇక ఆ తర్వాత బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో లోకి అడుగుపెట్టిన మోనాల్ గజ్జర్ మంచి క్రేజ్ మరియు పాపులారిటీ ని దక్కించుకుంది.

ఆ ఫేమ్ తో సినిమాల్లో అవకాశాలు సంపాదించాలి అని అనుకుంది కానీ, సక్సెస్ కాలేదు.దీనితో ఆమె గుజరాతి సినిమాలపై ద్రుష్టి పెట్టింది.ఇప్పుడు నయనతార ప్రొడక్షన్ హౌస్ లో సినిమా అవకాశం దక్కడం ఆమె అదృష్టం గా భావిస్తుంది. కచ్చితంగా నయనతార బ్రాండ్ ఇమేజి సరిగ్గా వాడుకొని సూపర్ హిట్ కొట్టి అగ్ర తారగా ఎదగాలని చూస్తుంది.మరి ఆమె కలలు నెరవేరుతాయా లేదా అనేది చూడాలి.