spot_img
Homeజాతీయ వార్తలుBrihadeshwara Temple : బృహదీశ్వరాలయం.. అంత అద్భుతంగా ఎలా నిర్మించారు? 1000 ఏళ్ల కిందట ఏం...

Brihadeshwara Temple : బృహదీశ్వరాలయం.. అంత అద్భుతంగా ఎలా నిర్మించారు? 1000 ఏళ్ల కిందట ఏం జరిగింది?

Brihadeshwara Temple : ఆ గుడిని చూస్తే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎక్కడా సిమెంట్‌.. ప్లాస్టర్‌ ఆఫ్‌ పారీస్‌ అతుకు కనిపించదు. అద్భుతమైన శిల్పకళతో అలరారుతూ ఉంటుంది. దీనికి వెయ్యి ఏళ్ల చరిత్ర ఉంది. ఆరు భూకంపాలను తట్టుకుని నిలబడింది. అంతేకాదు దక్షిణభారతదేశంలోనే అత్యంత పురాతమైన శివాలయంగా పేరు పొందింది. ఇంతకీ ఆ గుడి ఏమిటి? ఎక్కడుంది? దాని చరిత్ర ఏమిటి? ఇంకెందుకు ఆలస్యం.. చదవండిక..

తమిళనాడు రాష్ట్రంలోని తంజావురు జిల్లాలోని కావేరి నది ఒడ్డును బృహదీశ్వర ఆలయం ఉంది. దీని నిర్మాణ శైలి ప్రకారం ఇది భారతదేశంలో తొలి గ్రానైట్‌ ఆలయంగా వినతికెక్కింది. క్రీస్తు శకం 1010లో చోళు మహారాజు రాజరాజ చోళుడు ఈ ఆలయాన్ని నిర్మించారని చరిత్ర చెబుతోంది. ఈ ఆలయాన్ని 1,30,000 టన్నుల గ్రానైట్‌ రాయితో నిర్మించారు. ఈ గ్రానైట్‌ను సుమారు 60 కిలోమీటర్ల దూరం నుంచి 3,000 ఏనుగుల మీద రవాణా చేశారు. దక్షిణభారత దేశంలో అత్యంత పురాతన శివాలయం ఇది. ఈ ఆలయ గోపురం 66 మీటర్ల ఎత్తు ఉంటుంది. దాని బరువు 80 టన్నులు. ఈ గోపురం నీడ ఎప్పుడూ నేల మీద పడదు. మధ్యాహ్న సమయంలో కూడా నీడ కన్పించదు. ఆలయ గోడలపై భరత నాట్య భంగిమలో 108 శిల్పాలు, 250 శివలింగాలు ఉన్నాయి. యునెస్కో పర్యాటక గుర్తింపు కూడా పొందింది.

ఈ గుడికి ఎటువంటి పునాది లేదంటే అతిశయోక్తి కాదు. గుడిని ఇంటర్‌లాక్‌ విధానంలో నిర్మించారు. పైగా అంటే ఒక శిలను మరొక శిలతో అనుసంధానించారు. అందువల్ల సిమెంట్‌, ప్లాస్టర్‌ ఆఫ్‌ పారీస్‌ అతుకులు కన్పించవు. ఈ గుడిలో గోపురం 216 అడుగులు ఉంటుంది. పైగా ఇది సున్నా డిగ్రీ వంపును కలిగి ఉంటుంది. ఆ కాలంలో ఇంత ఎత్తయిన గోపురం నిర్మించారంటే మాటలు కాదు. ఇక ఈ విధానంలో బిగ్‌ బెన్‌, పీసా వాల్‌ టవర్స్‌ నిర్మించారు. కానీ అవి వంగి ఉంటాయి.

మందిరం పై భాగంలో ఉన్న కుంభం 80 టన్నుల బరువు ఉంటుంది. ఈ 80 టన్నుల బరువున్న శిలను 200 అడుగుల టవర్‌ పైకి ఎలా చేర్చారు అనేది ఇప్పటికీ ఆశ్చర్యకరమే. దీని కోసం లెవిటేషన్‌ టెక్నాలజీ ఉపయోగించారని నిపుణులు చెబుతున్నారు. ఆరు కిలోమీటర్ల పొడవైన రాంప్‌లో రాతి ముక్కను ఉంచి దానిని ఏనుగులతో లాగించారని చరిత్ర చెబుతోంది.

ఈ మందిరం కింద అనేక భూగర్భ మార్గాలున్నాయి. వీటిలో చాలా వరకు మూసివేతకు గురయ్యాయి. వీటిని చోళులు తమ అంతర్గత భద్రత కోసం వాడేవారని తెలుస్తోంది. పైగా శత్రువులు దండెత్తినప్పుడు వీటిని తమ రక్షణ కోసం ఉపయోగించుకునేవారని చరిత్ర గ్రంథాలు చెబుతున్నాయి. ఈ ఆలయంలో అనేక ఆశ్చర్యకర నిర్మాణాలు ఉండటంతో చరిత్రకారులు అధ్యయనాలు చేస్తూనే ఉన్నారు. అయినప్పటికీ ఇది కొరుకుడు పడటం లేదు. పైగా రాజరాజచోళుడి దూరదృష్టికి ఈ ఆలయ నిర్మాణం మెచ్చుతునక అని కొనియాడుతుంటారు. ఇంతటి గొప్ప ఆలయం కనుకే యునెస్కో దీనిని ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చింది. ఈ ఆలయాన్ని సందర్శించేందుకు ఏటా వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు. కావేరి నది ఒడ్డున ఉండటం ఈ ఆలయానికి మరింత ఆకర్షణ.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Donald Trump

Donald Trump: యుద్ధాల్లో సైనిక మరణం వివరాలు ప్రకటించిన ట్రంప్.. అధ్యక్షుడి పోస్ట్ పై చర్చ!

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధాల్లో సైనికుల మరణం పై తాజాగా ఒక పోస్ట్ చేశారు. తన సొంత సోషల్ మీడియా ట్రూత్ చేసిన ఈ పోస్టులో ఆఫ్గాన్...
David Warner

David Warner: మద్యం తాగి దొరికిన ప్రముఖ క్రికెటర్.. 9 నెలల జైలు శిక్ష

David Warner: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ఆ క్రీడ ఆడేవాళ్లు జెంటిల్మెన్ల మాదిరిగానే వ్యవహరించాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే పరువు పోతుంది. పైగా క్రికెటర్లను డెమి గాడ్స్ లాగా...
Jagan Mohan Reddy

Jagan Mohan Reddy: జగన్ ఇది తగునా?!.. రగిలిపోతున్న సీనియర్!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. ఆ పార్టీలో నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంలో హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారితీస్తోంది. ప్రధానంగా వివిధ కేసుల్లో చిక్కుకున్న వారికి...
Chandrababu And Lokesh

Chandrababu And Lokesh: లోకేష్ విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం

Chandrababu And Lokesh: తెలంగాణలో తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని యాక్టివ్ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి అక్కడ...
Suvendu Adhikari

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసలపై సువేందు ఉక్కుపాదం..

Suvendu Adhikari:   గత 45 సంవత్సరాలుగా పశ్చిమ బెంగాల్‌లో అక్రమ వలసదారులకు ఆశ్రయం కల్పించడం, వారికి ఓటు హక్కు, గుర్తింపు పత్రాలు ఇవ్వడం వంటి విధానాలు అమలులో ఉన్నాయని వివరణలు ఉన్నాయి. ఈ...
Oktelugu Epaper